తెలుగు తూలిక

02/06/2010

ఊసుపోక – మనసుకి బుద్ధి లేదు!

ప్రచురించిన వర్గము ఊసుపోక — మాలతి @ 9:44 పూర్వాహ్నం

(ఎన్నెమ్మకతలు 50)

  ఈ రోజు ఏదైనా కొత్తది రాద్దాం అనుకుంటూ. వెనక్కి తిరిగి చూస్తే, ముందు టపాలో అబ్బూరి రామకృష్ణారావుగారి చమత్కారం గుర్తొచ్చింది. ఆ చమత్కారం నామనసున నాటింది కనక అదే నిజం అన్నాను.  కానీ ఈపూట నాబుద్ధికి పని పెట్టి, ఆలోచిస్తే, ఆ రోజుల్లో నేను చదివిన పుస్తకాలు ఎక్కువే, గత పదేళ్లలోనూ నేను “చదువుదాం” అనుకున్నవాటితో పోల్చి చూస్తే.  (ఇంకా…)

02/05/2010

అవేద్యాలు

ప్రచురించిన వర్గము నాకథలు — మాలతి @ 3:39 అపరాహ్నం

తలొంచుకుని తండ్రి రాసిన ఖండకావ్యం తాలూకు ప్రూఫు చూస్తోంది శారద.

శారదని చూసి ఆగిపోయాడు చలపతి ఒకకాలు గుమ్మంలోనూ ఒకకాలు గుమ్మంపైనా ఉంచి – రన్నింగ్ రేస్‌లో ఛాంపియన్‌లా.

కొనకంటిలో మనిషి మెదిలినట్టయితే, “ఎవరోలే” అనుకుని, కావలిస్తే వాళ్లే పిలుస్తారు అన్నధోరణిలో దృష్టి మరల్చలేదు శారద. (ఇంకా…)

02/04/2010

మాలతిసాహితి pdf 2

ప్రచురించిన వర్గము e-Books, నాకథలు — మాలతి @ 3:46 అపరాహ్నం

నాదగ్గర ఉన్నవి 1954నించి ఈసంపుటిలో చేర్చాను. నిజానికి మొదటి అయిదు స్కెచ్ లేక గల్పికలు – ఈనాటి కార్డ్ కథలలాటివి. నాసరదాకోసం పెట్టుకున్నాను కానీ మీరు ఏ ఆరో, ఏడో కథ దగ్గరో చదవడం మొదలెట్టొచ్చు. మళ్లీ చెప్పలేదనకండి మరి.

malathisahiti 2

02/01/2010

ముగ్ధ

ప్రచురించిన వర్గము నాకథలు — మాలతి @ 1:46 అపరాహ్నం

(1959నాటి కథ)

సుబ్బలక్ష్మితో అచ్చనకాయలాడుతూ కూచుంటే టైమెంతయిందో నాకే తెలీదు. సబ్బలక్ష్మి వాళ్లమ్మ సంజెదీపం పెట్టడం చూసి చేతిలో రాళ్లు చెప్పున వదిలేశాను. అప్పుడు గుర్తొచ్చింది ఆకలి. రేపొస్తానని సుబ్బలక్ష్మికి చెప్పి ఇంటికి వస్తూంటే ఆలస్యమయినందుకూ, కొత్తపరికిణీ మాపుకున్నందుకూ అమ్మ ఏమంటుందోనన్న భయం జ్ఞాపకం వచ్చింది. (ఇంకా…)

01/28/2010

మాలతి సాహితి pdf లో

ప్రచురించిన వర్గము e-Books, నాకథలు — మాలతి @ 10:05 పూర్వాహ్నం

ముందు టపాలో అంత ఆర్భాటంగా పుస్తక ప్రచురణవల్ల నష్టాలు ఎలుగెత్తి చాటేను కనక, నేను ఇకమీదట నా సాహిత్యం అంతా e-బుక్కుల రూపంలో నిక్షిప్తం చెయ్యయడం న్యాయం అని భావిస్తున్నాను. (ఇంకా…)

01/25/2010

ఊసుపోక – చదవనివారికి ప్రత్యేకం

ప్రచురించిన వర్గము ఊసుపోక — మాలతి @ 8:27 పూర్వాహ్నం

(ఎన్నెమ్మ కతలు 49)

రెండువారాలుగా జొరం వచ్చినట్టు ఉంటోంది నాకు. ఆ పుస్తకాలసైటు ఇంకొన్నాళ్లు చూస్తే గుండెపోటు కూడా వస్తుందేమో!

చూస్చూసి అలసి సొలసిపోతున్నాను. అలా అలసి సొలసిపోవడం మూలాన చిన్న కోపంలాటిది కూడా వస్తున్నట్టుంది. (ఇంకా…)

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.