తెలుగు తూలిక

జనవరి 26, 2008

చెట్టు

ప్రచురించిన వర్గము కవితలు, సాహిత్యం — malathi @ 3:07 అపరాహ్నం
Tags:

సౌమ్య వ్యాఖ్యానం చూసినతరవాత తప్పు దిద్దుకుంటున్నాను. ఇస్మాయిల్ గారికి నా క్షమాపణలు.
– మాలతి.

చెట్టు ఆదర్శం?

.
చెట్టు తమ ఆదర్శం
అంటారు మన కవులు
మరి
ఈనాడు మూడులోకాలకూ
పనికొస్తోంది వనచయం
సంచులూ, కంచాలూ కూర్చిపెట్టటానికీ,
ముక్కూ, మూతీ,
ముందూ వెనకా ఒత్తుకోటాని‌కీ
ఇల్లూ వాకిలీ సోకులు జేసుకోటానికీ.

అయ్యో రాతా!
ఇదా నేను ఏరికోరి
వలచి వరించిన బతుకని
కుమిలి కుళ్లిపోతోంది చెట్టు.

2 వ్యాఖ్యలు »

  1. చెట్టు నాకాదర్శం అన్న కవిత ఇస్మాయిల్ గారిది కదా! తిలక్ గారు కూడా అలానే అన్నారా??

    వ్యాఖ్య ద్వారా vbsowmya — ఫిబ్రవరి 3, 2008 @ 3:33 అపరాహ్నం

  2. నేను ఇస్మాయిల్ కవితలేమీ చదవలేదు. తిలక్ అని చదివినట్టు అనిపించింది. :(
    నేను రాసింది తప్పు కావచ్చు.

    వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 3, 2008 @ 5:03 అపరాహ్నం

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.