తెలుగు తూలిక

జనవరి 26, 2008

ధర్మకాటా

ప్రచురించిన వర్గము కవితలు, సాహిత్యం — malathi @ 3:10 అపరాహ్నం
Tags:

ధర్మకాటా

ఆకలేస్తే అన్నం తిను
చలేస్తే దుప్పటీ కప్పుకోమంటూ
నోటిలెక్కల్లా
బహుతేలిక
ఈనాటి నాగరీకప్రపంచంలో
ప్రతిసమస్యకీ
రెడీమేడ్ జవాబు

కంటికానని
అనుభవాలు
పరమాణుల్లా
కోటానుకోట్లు

అణువణువూ
గతానుగతికంగా
ప్రపంచాన్ని పాలిస్తోంది
చట్టాలని సృష్టిస్తోంది

నిజానికి
అంతరాంతరాల్లోంచి
పుట్టుకొచ్చే వణుక్కి
దుప్పట్లెక్కడా దొరకవు
అకాడమీలందిచ్చే
ధర్మనిర్ణయాలు
సామాన్యులకి
సాంత్వన కూర్చవు
వారి తీర్పులు
వీరి బతుకుల
మూసపోసిన అచ్చుల్లా
అమరవు.

(మాలతి, 10-24-1997)

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.