శునకేంద్రభోగాలు
ఈనాడు మానాట
కుక్కలకు గౌరీకల్యాణం
కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు
ఆవులను కోసి కుక్కలను మేపుట సర్వసాధారణం
ఇచట
కుక్కతిండికి వ్యయం ఏటికి పదహారు బిలియనులు
గ్రామసింహాల పళ్లు తోమడానికీ
ఒళ్లు కడగడానికీ
మరో తొమ్మిది బిలియనులు
యజమానులు తీరిచి దిద్దుకుంటున్నారు
ముద్దుకుక్కల ముఖవిలాసం
కుక్కలకున్నాయి
ఫర్‌కోటులూ, ఆభరణాలూ
అందాలపోటీలూ,
ఆరామస్థలాలు
సంఘాలు, సమావేశాలు
వెరసి వ్యయం
యేటికి యాభై బిలియనులు
మాసార్వభౌముల
సలహాదారులు *లోరా, బార్నీ,
వారిలో బార్నీవాక్కులకే అధికప్రాధాన్యం.
అందుకే సామాన్యులకి కుక్కగతి
మానవజన్మనెత్తి
నానా ఆగచాటులు పడుటేల
అమెరికాలో కుక్కగా
పుట్టిన కలుగు
అష్టశ్వైర్యములు, అనన్యసామాన్య భోగబాగ్యాలు
(* లోరా సార్వభౌముల అర్థాంగి, బార్నీ వారి ముద్దుకుక్క అని గ్రహించగలరు)
000
(మా.ని. జనవరి 2008)
అవును. కరక్టే. ఈ రోజు పేపర్లో అనుకుంటా, ఒక ఫొటొ చూస్తే, విచిత్రంగా అనిపించింది. ఆ ఫొటొలో ఒక జాతి కుక్క యజమాని, తన కుక్క పట్టే మంచినీటిని తాను ముందు తాగిచూసి, మరీ ఆ కుక్క కి పట్టించాడు. ఇది “అతి”కి పరకాశ్టేమో అనిపించినిది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వల్లూరి. — జనవరి 28, 2008 @ 3:22 అపరాహ్నం