ముగింపేదీ …
ఫిబ్రవరి 21, 2008 ద్వారా tethulika
అంతేనా ఈకథ, లేక, అప్పుడే అయిపోయిందా …
ఈమధ్య తరుచూ నాకు ఎదురవుతున్న ప్రశ్న– కథ అప్పుడే అయిపోయిందా అని. అంటే రచయిత ఇంకా చెప్పవలసింది ఏదో చెప్పలేదని. అంచేత మీకు నాప్రశ్న. ఏకథ అయినా ఎప్పుడు అయిపోతుంది. అసలు అయిపోడం (ముగింపు) అంటూ జరుగుతుందా?
మీరే వున్నారనుకోండి. మీకు అలా అనిపించిన ఏఒక్కకథ అయినా తీసుకుని (నాకు అందుబాటులో వుండాలి ఏబ్లాగులోనో, సైటులోనో), ఆకథ ముగియలేదని మీరెందుకనుకుంటున్నారో, ఇంకా చెప్పవలసింది ఏమిటో చెప్తారా?