వికిపీడియాలో తెలుగుసాహిత్యం నాఅభ్యర్థన
ఫిబ్రవరి 28, 2008 ద్వారా tethulika
గూగుల్ సాహిత్యంలో నేను సహాయం కోరేను. తెలుగురచయితలగురించి నేను రాస్తున్న వ్యాసాలు ఇంగ్లీషు వికిపీడియాలో ఎలా పెట్టాలని. కొందరు స్పందించి సలహాలు ఇచ్చారు.
తెలుగు సాహిత్యం, రచయితలగురించి ఇంగ్లీషు మాత్రమే చదవగలవారికి చెప్పాలని నాతాపత్రయం. నేను రాసి, నా సైటు, www.thulika.netలో ప్రచురించినకొన్ని వ్యాసాలు విశేషాదరణ పొందేయి కూడాను. కొందరు రచయితలగురించి అక్కడ వున్నమాట నిజమే. కాని అక్కడ లేని విషయాలు నేను రాస్తున్నాను.
ఇక్కడ పూర్తికథ చెప్తాను.
నాముందు టపాకి స్పందనగా నాస్నేహితురాలు, అసూర్యంపస్య, ఎన్-వికిపీడియాలో ఒక వ్యాసాన్ని పెట్టడానికి ప్రయత్నించింది. లింకు - http://en.wikipedia.org/wiki/Women_Writers_in_Telugu
సగం చేస్తుండగా, తనకి administrators నుండి ఈమెయిలు వచ్చింది.
As I was proceeding with copy-pasting, I got a mesg:
It is proposed that this article be deleted because of the following
concern:
Essay, not an article
If you can address this concern by improving, copyediting, sourcing,
renaming or merging the page, please edit this page and do so. You may
remove this message if you improve the article or otherwise object to
its deletion for any reason. To avoid confusion, it helps to explain
why you object to the deletion, either in the edit summary or on the
talk page. If this template is removed, it should not be replaced.
The article may be deleted if this message remains in place for five
days. This template was added 2008-02-28 02:39; five days from then is
2008-03-04 02:39.
మీరెవరైనా పూనుకుని, ఈవ్యాసం రక్షించడం కానీ, మరొకరకంగా వుద్ధరించండం
గానీ చెయ్యవలసిందిగా నా అభ్యర్ధన. నాకర్థం అయినంతవరకూ మీరు ఎడిట్
చెయ్యడమో, డిస్కస్ చెయ్యడమో చెయ్యొచ్చు అనుకుంటాను.
అనేకానేక ధన్యవాదాలతో
మాలతి
వికీపీడియాలోని భాష, శైలి అలంకారరహితంగానూ, నిష్పక్షపాతంగా, తటస్థ ధృక్కోణముతో ఉండాలని భావిస్తారు. అందుకే సాధారణంగా పత్రికలలో కోసం వ్రాసిన వాటిని వికీపీడియాలో ఒక వ్యాసంగా తీర్చిదిద్దటానికి తగిన మార్పులు చేయాల్సి వస్తుంది
రవి వైజాసత్యగారూ
అర్థమయింది. నా వ్యాసాలు అలాగే వుంటాయని పఠితలు అంగీకరించారు. అయినా మీరు కానీ, మరొకరు కానీ చూడడానికీ, వికిపీడియాకి అనువుగా మార్చడానికీ కావాలంటే నాబ్లాగులో పెడతాను చూడండి.
సాధారణంగా వికీలోని వ్యాసాల పేర్లు నామవాచకంతో ఉంచితే మంచిది. ఇక రవి చెప్పినట్లు పత్రికల్లో నుంచి తెచ్చుకొన్న వ్యాసంలో చాలా మార్పులు చెయ్యవలసి ఉంటుంది. ఉదాహరణకు:
౧) One day Krishnadevarayalu noticed that his daughter was perplexed and asked what was troubling her.
ఈ పేరా అంతా మార్చి వ్రాయవలసి ఉంటుంది. ఆ వాక్యాన్ని కృష్ణదేవరాయలు దృక్కోణం నుంచి కాక మన దృక్కోణం నుంచి నిజా నిజాలను వీలైతే తగిన ఆధారాలతో వ్రాయవలసి ఉంటుంది. పాత్రల మధ్య సంభాషణలు ఉంచకపోతే మంచిది.
౨) Arudra’s comment is pertinent here, “Molla’s Ramayanam enjoys popularity even to this day while several other Ramayanams written by highly regarded male scholars of her times were lost in history”.
ఇక్కడ మనకు అరుద్ర ఏమన్నాడో వ్యాసానికి అనవసరం. ఒక వేళ ఆయన అన్న మాటలు వ్యాసంలో ఉంచదలుచుకుంటే దానికి తగిన కారణం ఉండాలి. తగిన స్థలంలో తగిన హెడ్డింగు క్రింద ఉండాలి.
ఈ వ్యాసం ఏ వర్గంలో ఉంచవచ్చో ఇంకా తట్టటం లేదు. బహుశా మీరు ఒక్కో తెలుగు రచయిత్రి గురించి ఒక్కో వ్యాసం మొదలు పెట్టవచ్చు అనుకుంటా. లేదా దీన్ని చరిత్రకు సంబంధించిన వ్యాసాల్లో కలపవచ్చునేమో చూడాలి.
మీసలహాలు బాగున్నాయండి. అలాటి మార్పులు చెయ్యగలను.
ఆధారాలు ఇచ్చాను కదా ఫుట్ నోట్ లో.
వర్గం - ఇది తెలుగు సాహిత్యచరిత్రలో ఒకభాగం అనుకుంటున్నాను. ఇంగ్లీషులో లభ్యమైన, లభ్యంకాని విషయాలు ఒకచోట పెట్టి, స్థూలంగా 1950-60లలో రచయిత్రుల ప్రాముఖ్యతకి నేపథ్యం ఎత్తిచూపడం నాధ్యేయం.
పోతే, వికిపీడియాలో పెట్టబోతే, వారు డిలిట్ చేస్తాం అన్నారు కనక, అది ఆపడానికి ఏదైనా మార్గం వుందా అన్నది ప్రస్తుత సమస్య. వుదాహరణకి, ఇక్కడ మీరు చెప్పినదే వికిపీడియాలో డిస్కషన్ లో పెట్టడానికి అవకాశం వుందా. నాకు తెలీకే అడుగుతున్నాను.
అన్యథా భావించరని తలుస్తూ.