కధ చిన్నదైనా కాన్సెప్టుకు చాలా డెప్త్ ఉందిలెండి. ‘ కమనీయ భూమిభాగములు లేవె పడియుండుటకు, మెత్తని పరుపులేల ‘.. మీ కధకు ఇదే inspiraton అనుకుంటా!.. ఉత్తరాంధ్ర మాండలీకాన్ని కేవలం నూకాలికే పరిమితం చేసినప్పటికీ అక్కడక్కడా మీ నెరేషన్లో కూడా ఆ ఎఫెక్టు కనిపిస్తూంది. వంశీ మా పసలపూడి కధల్లోలా పూర్తిగా మాండలీకంలోనె రాస్తే చదవాలనుంది. నాకు తెలిసి ఎంత ఆ ప్రాంతానికి చెందినవారైనా వ్రాసేటప్పుడు ఇంత పెర్ఫెక్షన్ చూపించడమనేది ఒక విద్యే ( అది అందరికీ రాదు ).
మీరు అంత నిశితంగా నాకథ చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
అవును. పడియుండుకు.. అన్న పాదమే స్ఫూర్తి అయినా ఆరోజుల్లో మాయింట్లో పనిచేసిన అప్పాయమ్మనే ముఖ్యంగా చెప్పుకుంటాను.
ఆరోజుల్లో, 50, 60 ధశకాల్లో నాతో పనిమనిషులూ, స్కూల్లో ప్యూనులు ఎక్కువగా మాటాడుతూండేవారు (నా ముఖవిశేషమేమో :)). నేను ఆభాష వుపయోగించుకున్నది ఆపాత్రల చిత్రణకి మాత్రమే. పోతే కథకుడు ఆభాషలో కథంతా చెప్తాలంటే, ఆపాత్ర పరంగా చెప్పాలి. లేకపోతే నాపాండితిని ప్రదర్శించుకోడంలా వుంటుంది.
పోతే వాళ్ల కల్చర్ వాళ్లకుంది. అది బాగా తెలియాలి. అలా కథ రాసే సాహసం నాకు లేదండీ. ఏమైనా మీఅభిమానానికి మరోసారి కృతజ్ఞతలు.
బాగుందండి కధ. చివరికేదో జరగబోతోందని ఆత్రుత కలిగించి టక్కున ముగింపిచ్చినా బాగుంది.
ధన్యవాదాలు వికటకవిగారూ.
కధ చిన్నదైనా కాన్సెప్టుకు చాలా డెప్త్ ఉందిలెండి. ‘ కమనీయ భూమిభాగములు లేవె పడియుండుటకు, మెత్తని పరుపులేల ‘.. మీ కధకు ఇదే inspiraton అనుకుంటా!.. ఉత్తరాంధ్ర మాండలీకాన్ని కేవలం నూకాలికే పరిమితం చేసినప్పటికీ అక్కడక్కడా మీ నెరేషన్లో కూడా ఆ ఎఫెక్టు కనిపిస్తూంది. వంశీ మా పసలపూడి కధల్లోలా పూర్తిగా మాండలీకంలోనె రాస్తే చదవాలనుంది. నాకు తెలిసి ఎంత ఆ ప్రాంతానికి చెందినవారైనా వ్రాసేటప్పుడు ఇంత పెర్ఫెక్షన్ చూపించడమనేది ఒక విద్యే ( అది అందరికీ రాదు ).
శంకర్ గారూ,