కథామాలతీయం -3 పొద్దులో

03/30/2009

పొద్దువారు కథామాలతీయం మూడో భాగం ప్రచురించారు, చూసి, మీఅభిప్రాయాలు చెప్పండి.

మొదటి భాగం

రెండో భాగం


ఊసుపోక గంటకూలి అణాపరక

03/27/2009

 

(ఎన్నెమ్మ కతలు 31)

ఒకసారి ఒక చాకులాటి కుర్రవాడు దేవుడితో, అయ్యా, దేవుడుగారూ, దేవుడుగారూ, జలధిగంభీర, జలజనయన, మేరునగధీర, మిమ్ముల బొగడ నాతరమా అని కొంచెంసేపు పొగిడి, తరవాత, మీకు క్షణము యుగముతో సమానమని విన్నాను. నిజమేనా? అని అడిగాట్ట.

అందుకు దేవుడుగారు ధీరోదాత్తచిత్తముతో, అవున్నాయనా. అన్నారుట.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


మా మే స్త్రీత్త్వమ్

03/20/2009

 

 పొద్దు.నెట్ తరఫున స్వాతికుమారి నాతో జరుపుతున్న ఇంటర్వూ లింకు ఇక్కడ చూడండి.

http://poddu.net/?p=2197

ఆఇంటర్వూలో ఉదహరించిన కథలలో ఇది ఒకటి.

మా మే స్త్రీత్త్వమ్


ఆడమనసు

03/20/2009

గరల్ స్కూల్ టీచరు రవణమ్మ సిగ్నల్‌ పోస్టుదగ్గర ఆగిపోయిన రైల్లో థర్డుక్లాసు కంపార్ట్‌మెంటులో లోకానికీ తనకీ మధ్యనున్న సూక్ష్మాతిసూక్ష్మమయిన సంబంధంగూర్చి ఆలోచిస్తూ కూచుంది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


పెంపకం

03/17/2009

హవామహల్ దగ్గర బీచికి పార్వతి ఆరేళ్ల కూతురు మల్లికని తీసుకొచ్చింది. కనుచూపు దూరంలో ప్రదీపు కనిపించాడు. కొడుకు మహార్ణవ్‌ చెయ్యి పుచ్చుకుని నడుస్తూ వాడికేదో చెబుతున్నాడు దూరంగా ఏరాడకొండా, కొండమీద సెర్చిలైటు చూపిస్తూ. వాళ్లిద్దరినీ చూస్తుంటే పార్వతికి ఏబట్టలదుకాణంలోంచో షోకేసులో వుండే తండ్రీకొడుకుల బొమ్మలు ప్రాణం పోసుకుని నడిచి వచ్చేస్తున్నట్టుంది.  ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – వెదురుమొక్క అదురుష్టం

03/14/2009
(ఎన్నెమ్మకతలు 30) 

ఈరోజు ఉదయం లేస్తూనే తెలివొచ్చింది.

తెలుగుతూలికలో ఓకబురు చెప్పి నెలరోజులయింది. ఇంగ్లీషుతూలిక అయితే మరీ అన్యాయం. మూణ్ణెల్లయింది. అదయినా ఒక్క వ్యాసం పెట్టి. ఏమిటో పనీ లేదు, తీరుబడీలేదు, క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయంలేదు లాటి జాతీయాలన్నీ వరసగా వచ్చేస్తున్నాయి నాలుకమీదకి.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.