మిత్రమా!
చూడమంటూ నువ్వంపిన ఫైలు
తెరవబోతున్న క్షణంలో
తటాలున కిటికీలో వెలిగిన తటిల్లత
ఆవెంట గర్జించిన ఘనమేఘమాల
కిటికీలో అమర్చిన అద్దానికి అటువేపు
వానచినుకుల దరువులు
ఇటువేపు నేను మంత్రముగ్ధనయి!
నీ సరసపదకేళి
కన్నులతో ఆస్వాదిస్తుంటే,
ఏటవాలుగా
జాలువారుతున్న
జీవధారారవళి నేపధ్యంలో
సుమధుర గానసభ
కళ్లముందు
సాక్షాత్కారించింది
నీకవితాగానంతో.
అయ్యో, అప్పుడే ముగిసెనా
అనుకుంటూ కళ్లెత్తి చూశాను
ఆకాశం నాకేసి దృక్కులు సారించి
నవ్వుతోంది నిర్మలంగా
ఇంద్రజాలమంటే అదేనంటూ.
(నాస్నేహితురాలు వైదేహి తను కొత్తగా రాసినకవిత, కచేరీ, నాకు పంపినప్పుడు, అది చదువుతుంటే కలిగిన స్ఫూర్తితో రాసిన కవిత ఇది. నేను ఆ ఫైలు తెరుస్తుండగా మొదలయినవాన చదవడం పూర్తయేసరికి ఆగిపోయింది ఆశ్చర్యం!)
(14 మే 2009)
థాంక్స్, నవీన్. ఇక్కడ బ్లాగుల్లో మంచి తెలుగు రాస్తున్నారు. చదివి ఆనందించగలరని ఆశిస్తున్నాను.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — జులై 5, 2009 @ 4:15 అపరాహ్నం
chala bagundi,chala rojula taruvata telugu vinnattu undi.naku telugante chala istam kani nenu Jharjhandlo undatam valla teluguki dooramaipotunna feeling kalugutundi, kani mee kavita nalo telugudananni gurthuchesindi.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా naveen — జులై 4, 2009 @ 11:17 పూర్వాహ్నం
మాలతి గారూ,
మీ సహృదయతకి,అభిమానానికీ ధన్యవాదాలు.
వైదేహి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Vaidehi Sasidhar — జూన్ 8, 2009 @ 4:39 పూర్వాహ్నం
మేథ, బొల్లోజుబాబా, – ధన్యవాదాలు.
బాగుంది.
రాధిక, సినిమాలో వయొలిను వాయించే వాళ్లు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — మే 21, 2009 @ 6:02 అపరాహ్నం
మీ అనుభవం చాలా బావుంది.. పైకి చాలా చిన్న అనుభవమైనా, దాన్ని మలచిన తీరు చాలా బావుంది..
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా మేధ — మే 19, 2009 @ 1:45 అపరాహ్నం
ప్రత్యక్షానుభవాలు కవిత్వంగా మారితే ఆ అందమే వేరు.
నేను మా కిటికీ వైపు చూస్తున్నానిపుడు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా bollojubaba — మే 17, 2009 @ 11:30 అపరాహ్నం
అది బయట కురుస్తున్న వానేనా అని సరదాకి అడిగానండి.అద్భుత కవిత చదువుతున్న ఆనందంలో మీకలా అనిపించిందా అని చమత్కరించానన్న మాట
ఇప్పటి సినిమాల్లో హీరోయిన్ని చూడగానే హీరోకి ఏదోలా అనిపిస్తుంది అని చెప్పడానికి వాళ్ళ వెనుక వయోలిన్లు వాయించేవాళ్ళు ప్రత్యక్షం అవుతుంటారు.అలా మీకు కూడా ఆ కవిత చూడగానే వర్షం కురుస్తున్నట్టు అనిపించిందేమో అని
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — మే 17, 2009 @ 11:22 అపరాహ్నం
@ మధుర వాణి, ఏదో, అన్నిట్లో వేలు పెడుతుంటాను
కొత్తపాళీ, పరిమళం, – ధన్యవాదాలు.
ఉష, అదే, వాతావరణం ఎంతగా కవిత అనుభూతికి కారణమవుతుందో తెలిసింది నాకాపూట అనిపించింది.
రాధిక, నిజంగానే బయట ఆ రెండునిముషాలూ పెద్ద వాన పడింది. నా కంప్యూటరు కిటికీనానుకుని వుంది. వైదేహి కవిత తప్పకుండా చదవాలి. ప్రచురణ అయినప్పుడు చెప్తాను. వేచివుండండి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — మే 17, 2009 @ 10:23 అపరాహ్నం
మాలతి గారూ సరిగా గమనించారా?అది బయట కురుస్తున్న వానేనా?మీ కవితే ఇంత అందం గా వుంటే మీకు స్పూర్తినిచ్చిన వైదేహి గారి కవిత ఇంక ఎంత అందం గా వుండి వుంటుందో.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — మే 17, 2009 @ 9:54 అపరాహ్నం
ఒకసారి నాదీ ఇదే అనుభవం – నాలో అలజడితో మొదలైన జడివాన నేను వచన కవిత పూర్తి చేసేసరికి ఆగింది అప్పుడు వ్రాసుకున్న మాట “గమనించనేలేదు వాన వెలిసిపోయింది, నాలోని కలత చెదిపోయినట్లే”
>> ఇంద్రజాలమంటే అదేనంటూ.
very true, nature is the inspiration and spirit – be it manifests from a person or thing.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ఉష — మే 16, 2009 @ 5:20 పూర్వాహ్నం
మాలతిగారు , ఇంద్రజాలమంటూ ….మండువేసవిలో చిరుజల్లు కురిపించారు మీ కవితలో …
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా parimalam — మే 15, 2009 @ 3:56 అపరాహ్నం
మాలతిగారు , ఇంద్రజాలమంటూ ….చిరుజల్లు కురిపించారు మీ కవితలో …
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా parimalam — మే 15, 2009 @ 3:54 అపరాహ్నం
Nice
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్తపాళీ — మే 15, 2009 @ 5:07 పూర్వాహ్నం
మాలతి గారూ,

చాలా చాలా రోజుల తరవాత మీ బ్లాగుకొచ్చాను. సమయం కుదరక బోలెడు పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి చదవాల్సినవి
మీ స్నేహితురాలు కవిత పంపించడం.. అది చూడగానే మీలో కూడా భావావేశం ఉప్పొంగడం.. మీరు బ్లాగులో రాయగానే మాలాంటి వారిక్కూడా చదవగానే ఆహ్లాదంగా, హాయిగా అనిపించడం.. మరి ఇది ఇంద్రజాలమే కదూ
ఇంట్లో కిటికీ పక్క కూర్చుని చదువుకుంటున్న మిమ్మల్ని ఊహించుకుంటూ చదివాను.. లేదు లేదు.. మీరు రాసింది ఒక్కో లైనూ చదువుతుంటే.. అలా ఊహాచిత్రం నా మదిలో మెదిలింది.
అయితే మీలో మంచి రచయిత్రే కాదు..కవయిత్రి కూడా ఉన్నారన్న మాట
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Madhuravani — మే 15, 2009 @ 2:34 పూర్వాహ్నం