నిండుకుండ
ఆమె నిండుకుండ
అయినవాళ్లూ, కానివాళ్లూ కుమ్మరించిన
కన్నీళ్లతో, ఆనందాశ్రువులతో
నిండిపోయిందా కుండ.
శాంతమూర్తి
వీరికి కోపం
వారిది మౌనం.
ఆవాకిట ప్రశాంతత
వెల్లివిరిస్తుంది
సందేహం లేదు.
యుద్ధం ముగిసిన రాత్రి
నడిచి నడిచి
అలసిపోయిందామె
నడవనంటూ మొండికేశాడతను
ఇద్దరూ ఆగిపోయారు ట్వైలైట్ జోన్‌లో.
మగ్నోలియాలు
మేలో రెండు వారాలపాటు
నిండుమనమ్మువలె నవ్యనవనీతసమమ్మయి
వెల్లివిరిసే మగ్నోలియామహా వృక్షం సుందరదృశ్యం
కెమెరాలో పట్టబోతే తెలిసింది
నేను రెండువారాలు ఆలస్యం చేసేనని.
ఆరుద్రగారు చెప్పినట్టు
నేను ఎక్కబోయినరైలు
మగ్నోలియా కాలమానంలో
ఓ జీవితకాలం లేటు.
(21 మే 2009)


[...] Author: కవితలు-2 « WordPress.com Tag Feed [...]
anuradha madasu, vbsowmya, Thanks.
“ఆమె నిండుకుండ
అయినవాళ్లూ, కానివాళ్లూ కుమ్మరించిన
కన్నీళ్లతో, ఆనందాశ్రువులతో
నిండిపోయిందా కుండ.”
- Wow!!
kavitvam very good.
ఉషా, బాగుంది మీ కవిత. మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.
)
ప్రదీప్, అవునండీ, ఆతపము అంటే ఎండ. ఎండాకాలం వచ్చింది కదా. వాటితాలూకు తలపులకి ఛాయలు అని అర్థం చెప్పుకున్నాను. పోతే, నాలాటి “పెద్ద రచయితలే” మిటిలెండి. ఇక్కడ బ్లాగుల్లో కవితలు చూసే నేర్చుకున్నాను. బ్లాగురచనలకి సంబంధించినంతవరకూ బాలాకుమారినే
కవితలలో భావం బాగున్నప్పటికీ మీ లాంటి పెద్ద రచయితలు కూడా పంక్తికొక పదం రాయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.
ఆతపము అంటే సూర్యకాంతి కదా. అంటే మీ శీర్షిక అర్ధం సూర్యకాంతి వల్ల వచ్చిన నీడలనా? తెలుపగలరు
నిండుకుండ – అంతే కాదు, నల్ల కుండైనా, ఎర్ర కుండైనా సరే, అది…
“కుమ్మరి చేయిచెక్కిన శిల్పం
చల్లని నీటికి అదేగా ఆధారం
ఇసుకతిన్నె మీద కూర్చుని వయ్యారి
విసుగు చెందక దాహం తీర్చే పొన్నారి!”
జీవిత సత్యాన్ని చక్కగా విప్పిచెప్పే గీతావాణి, సుమీ!
****************************
యుద్ధం ముగిసిన రాత్రి – నా కవితలు “ఎన్నిసార్లు”, “మరో ప్రయత్నం” ప్రహసనం అయినాక చివరి సంధి ఇదే అయింది.
మగ్నోలియాలు – నా మారథాన్ రన్ లో ఈ పువ్వే ముందుగా కొమ్మ వంచి నాపై కురిపించింది అమ్మ వంటి ఓ పచ్చని చెట్టు. 2003 లో మా ఇంటి ముందున్న ఈ చెట్టు పూలతో నుండుగావున్నపుడు నా కెమేరాలో బంధించి ఇండియాకి వెళ్ళినపుడు ఆ ఆల్బుం అమ్మకి చూపాను. అదే తన ఆఖరి చూపు. ఆ తర్వాత తీసినవేవీ ఆల్బంలో పెట్టలేదు. ఎందుకో మనస్కరించలేదు. అందుకే ఇప్పటికీ నా ఆల్బంలోని చివరి చిత్రం ఇంకా ఈ పూల చెట్టే. ఏదో జ్ఞాపకం అలా కదలాడింది.
పరిమళం, నానోలూ, నానీలూ – వీటిన్నటికీ ఏవో ఛందోనియమాలున్నాయి అనుకుంటానండీ. నాకవేమీ తెలీవు. ఏదో తోచింది రాసేసేనంతే. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు
నానో లని అంటున్నారు అవే తెలుగులో మీ శీర్షికేమో అనుకున్నా మేడం ! పేరేమైనా అన్నీ బావున్నాయండీ
ాధికా, బాగున్నాయన్నందుకు ధాంక్స్. కిందనించి పైకి
) ఏమో నాకూ తెలీడం లేదు. తోచక ఏదో ఒకటి చేస్తుంటాను, మళ్లీ ఇప్పుడు వెనక్కి తిప్పడం ఎలాగో తెలీడంలేదు. హీహీ.
శీర్షిక – ఎండాకాలపు నీడలు లేక గుర్తులు. ఎండాకాలం తొలిదశల్లో వచ్చే ఆలోచనలు అనుకున్నాను. బాగులేదా?
మాగంటి వంశీ, నిజమేనండీ, ఏదో చూస్తుంటే మరోటేదో గుర్తొస్తుంది. థాంక్స్,
అన్నీ బాగున్నాయండి.అన్నట్టు మీ శీర్షికకి అర్ధం ఏమిటి?
బెజవాడ గోపాలరెడ్డి గారనుకుంటా ఏదో పుస్తకంలో అంటారు
అద్భుతమయిన విభిన్నత్వపు వాతావరణంలో నివసిస్తూనే, అనంతమయిన ఆనందాలు చవిచూస్తాము.. ఎన్ని రుచులు, శ్రావ్యతలు, దృశ్యాలు, ఎన్ని పరిమళాలు? వీటిలో గగుర్పాటు కలిగించేవి ఎన్ని ? ఆనందం మిగిల్చేవి ఎన్ని ? ఎంతని, ఎన్నిటినని ఆనందిస్తాడు మానవుడు ? ఆయుష్షు చాలని మానవుడు..
ఇదే ఎందుకు గుర్తుకు వచ్చింది ? ఏమో …