1953లో “గాలిపడగలూ, నీటిబుడగలూ” అన్న 98 పేజీల చిన్నినవలతో తెలుగునాట తుఫాను రేపి తెలుగుపాఠకుల పెనునిద్దుర వదిలిస్తూ తనస్ఫూర్తిని ఘనంగా ప్రకటించుకున్నరచయిత్రి రెండక్షరాల పొట్టిపేరుగల లత. పూర్తిపేరు జానకీరమాక్రిష్ణవేణీ హేమలత. ఈనాడు చాలామంది పాఠకులకి తెన్నేటి హేమలతగా సుపరిచితం.పుట్టింది విజయవాడలో 1935లో నవంబరు 15వ తేదీన. తల్లిదండ్రులు నిభానుపూడి విశాలాక్షి, నారాయణరావుగారలు. తొమ్మిదేళ్లవయసులో పదహారేళ్ల తెన్నేటి అచ్యుతరామయ్యతో వివాహం. ఇద్దరు కుమారులు (1956, 1963లో). స్కూలు చదువు అయిదోక్లాసు వరకే అయినా ఇంట్లో తండ్రిశిక్షణలో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు గ్రంథాలు చక్కగా చదువుకుంది. తంఢ్రి మరణించే సమయానికి లతవయసు 32. తండ్రిమీద గౌరవంతో తమ్ముడిని చదివించేను అని రాసుకుందామె. ఆరోజుల్లో రచనావ్యాసంగంతో చెప్పుకోదగ్గ ఆదాయం గల కొద్దిమంది రచయిత్రులలో లత ఒకరు.
లతజీవితం విలక్షణమయినది. ఆమెరచనలు విలక్షణభావజాలంతో సుసంపన్నమయినవి. ఆమెరచనల్లో, ఆలోచనావిధానంలో అసాధారణమయిన వైవిధ్యం వుంది. లత నవలల్లో, వ్యాసపరంపరలో ఆమె ఆలోచనాపటిమ అవగాహన కావాలంటే ఆమెజీవితాన్ని కూడా నిశితంగా పరీక్షించి చూడాలి. మూడు పుస్తకాలు – లతే రాసిన “అంతరంగచిత్రం”, “మోహనవంశీ”, ఘట్టి ఆంజనేయశర్మ రాసిన “సాహితీలత” (జీవితచరిత్ర) – చాలావరకూ ఉపయోగపడతాయి ఆమెవ్యక్తిత్వాన్నీ, భావజాలాన్నీ అర్థం చేసుకోడానికి.
లతకి చాలా చిన్నతనంలోనే ప్రారంభమయిన తాత్త్వికచింతన, అంతరంగసంక్షోభం “అంతరంగచిత్రం”లో ద్యోతకమవుతాయి కొంతవరకూ. “మోహనవంశి”లో అలౌకికప్రేమకోసం ఆమెతపన చూస్తాం. ఇందులో కొన్నివాక్యాలు కలగాపులగంగా కనిపించి పాఠకుడిని గందరగోళపరుస్తాయి. వాక్యాలు అసంపూర్ణం, వ్యాకరణం అయోమయం. అదొక చైతన్యశ్రవంతిలా సాగిపోతుంది. నేను దాన్ని ఆమెమనసులో కలిగినఅలజడిగా, అంతఃక్షోభగా అర్థం చేసుకుంటున్నాను. ఆంజనేయశర్మగారి “సాహితీలత”లో ఆమె జీవితవిశేషాలూ, ఆమెకి ప్రముఖులు రాసిన ఉత్తరాలూ, ఆమెజవాబులూ బోలెడున్నాయి. ఈపుస్తకంలో రచయిత అవగాహన లేదు కానీ raw data మాత్రం చాలా వుంది.
తండ్రి జమీందారీఫాయిదాలో సాహిత్యచర్చలతోనూ, మధుపానీయాలతోనూ జీవితాన్ని గడపడం గమనించింది లత చిన్నతనంలోనే కళ్లారా చూసింది. భర్త అచ్యుతరామయ్య అనారోగ్యం, తన అనారోగ్యం, ఆర్థికబాధలూ – వీటన్నటితోనూ ఆమెకి ఒకవిధమయిన వైరాగ్యం, జీవితానికి అర్థం ఏమిటి అన్న తాత్త్విక చింతన ఏర్పడింది. బాధ పడ్డవారికే బాధ అర్థమవుతుంది. “అంతరంగచిత్రం” లో ఈవిషయం ప్రస్తావించింది, “నా ఈ చిన్నజీవితంలో ఎన్నో బాధలు అనుభవించేను–కష్టాలూ, కన్నీళ్లూ, బాధా, సంతోషం. ప్రేమా, బాధ్యతలూ .. మనోవైకల్యం, కోరికలూ. జీవితంతోనూ, ఆర్థికబాధలతోనూ కుస్తీ–వీటన్నిటిమధ్యా విమానంలో ఇంకా మొదటితరగతిలోనే ప్రయాణం చేస్తూ .. వర్ణించలేని ఆనందాన్నీ, మాటల్లో చెప్పలేని వికృతాన్నీ-ఎన్నిసార్లు చూడలేదు ఈజీవితంలో? నాజీవితం చిన్నదే అయినా అనుభవాలతో, మెరుపులతో బెలూనులా తేలిపోతోంది. బహుశా ఏదో ఒకరోజు ఇది పగిలిపోతుంది (అంతరంగచిత్రం. 13).
ఇటువంటి ఆత్మక్షోభ దృష్టిలో పెట్టుకున్నప్పుడే ఆమెనవలల్లో సంక్షోభం అర్థమవుతుంది మనకి. ఆమెరచనల్లో విశృంఖలత్వం ఆమెమనోవేదనల్లోంచి పుట్టింది. ఆపైన పాఠకులూ, పండితులూ చేసిన బాధ్యతలేని వ్యాఖ్యలతో లోకంమీద తిరుగుబాటు ప్రకటించింది మొండిధైర్యంతో (living with abandon అనొచ్చు). తద్వారా తెలుగు సాహిత్యానికి మేలే జరిగింది.
తనరచనలగురించి, “నాకు జీవితం నిజం. ఒక యథార్థం. ఆ నిజాన్ని చిత్రించడానికి నాకలం ఒక బ్రష్. నేనో పెయింటర్ని. అక్షరాల చిత్రకారిణిని. నాచిత్రాలు ఏ రంగుల సమన్వితాలో, స్ఫూర్తిమంతాలవునో కాదో నిర్ణయించేది కాలం” అంటుంది. (కొండముది శ్రీరామచంద్రమూర్తిగారి “చలానికి, అరుణాచలానికి మధ్య లత”, ఆంధ్రజ్యోతి మే 24. సాహిత్యవేదికలో వ్యాసంనుంచి ఇక్క కోట్ చేస్తున్నాను. కానీ ఆమె “గాలిపడగలూ, నీటిబుడగలూ”నవలకి ముందుమాటలో ఈవాక్యాలు రాసినట్టు నాకు గుర్తు.)
[...] 5..లత – ఊహాగానం, గాలిపడగలూ-నీటిబుడగలూ. [...]
[...] [...]
I have known Lata through her weekly column “UhaagaanaM’ in Andhra Prabha. You and Kalpana have enabled me to see her multi-faceted personality.
@ సూర్యప్రకాశ్, సంతోషం అండీ మీఅందరికీ లత రచనలయందు గల అభిమానానికి. నేను స్వర్ణసీత గురించి రాయకపోవడానికి కారణం నాకు తెలియకపోవడమే. నేను అప్పటికి అమెరికా వచ్చేశాను. కనీసం ఇప్పుడు మీమూలంగా తెలిసింది. ధన్యవాదాలు.
@రవి: మాలతిగారు స్వర్ణసీత గురించి ప్రస్తావించలేదని అనుకుంటుంటే మీరు నా మనసులో వున్నది చెప్పారు. మా ఇంటిలో కూడా ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా వెలువడినప్పుడు కుట్టిన పుస్తకం వుంది. నాకెంతో ఇష్టమైన నవలలో ఇది ఒకటి. “శివశిరశ్చంద్రముఖీ సఖీ” అని శ్రీరాముడు సీతాదేవిని పిలవడంతో మొదలవుతుంది.
లతగారు అప్పుడు ముఖాముఖిలో ఇచ్చిన జవాబులలో తనకి హారర్ నవలలు రాయడం/చదవడం అంటే ఇష్టం అని చెప్పిన గుర్తు (యండమూరి ఆ సమయంలో “తులసి” వంటి వాటితో బాగా పాపులర్).
ఏమైనా లతగారి గురించి చక్కని పరిచయం చేసిన మాలతిగారికి నెనరులు.
సూర్యప్రకాష్
రావు పంగనామముల, రవి,
ధన్యవాదాలు మీరు అందించిన సమాధానాలకి.
నా చిన్నతనంలో ఆంధ్రజ్యోతిలో లత గారి సీరియల్ “స్వర్ణ సీత” వచ్చేది. అది వారం వారం కత్తిరించుకుని, పుస్తకం కుట్టుకుంది అమ్మ. ఆ పుస్తకం మా ఇంట్లో ఏదో మూలన ఇప్పటికీ ఉన్నట్లు నాకు గుర్తు. నేనా పుస్తకం చాలాసార్లు చదివాను. ఆ తర్వాత ఆమె వ్రాసిన ఇతర రచనలు వెతికితే దొరకలేదు. ముఖ్యంగా విషవృక్ష ఖండన దొరకడం లేదు. మీ రచన చాలాబావుంది. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.
కాలాతీతవ్యక్తులు నవల “చదువుకున్న అమ్మాయిలు”గా సినిమా వచ్చింది. లత గారిదే రామాయణాన్ని అందులోని సీత మరికొన్ని ఇతర పాత్రలని విలక్షణంగా చిత్రీకరిస్తూ ఒకవార పత్రికలో 1970 లలో సీరియలుగా చదివిన జ్ఞాపకము. దానిని గురించి మీరుగాని, పాఠకులెవరైనాగాని ఏమైనా చెప్పగలరా?
@ వెంకటరమణ, ఏరచయితనైనా మనం అర్థం చేసుకోవాలంటే కాస్త శ్రమ తీసుకుని ఆలోచించాలి అని నేను అనుకుంటాను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
చాలా మంచి వ్యాసం మాలతి గారు. లత గారివి మోహన వంశీ, మిగిలిందేమిటి నవలలు చదివాను. అవిరెండూ సంప్రదాయానికి ఎదురు తిరిగే భావాలు కల పుస్తకాలే అనిపించింది.
మీ వ్యాఖ్య
// ఆవిడలో ఒకవైపు తిరుగుబాటుతత్త్వమూ, మరోవంక సాంప్రదాయంపట్ల గౌరవమూ కనిపించడం కొంతమందికి తికమకగా తోచవచ్చు. కానీ, నిశితంగా పరిశీలించి చూస్తే, ఆవిడా మనమూ కూడా నిత్యజీవితంలో ఎదుర్కొనే అనేక సంఘర్షణలు, పరస్పరవిరుద్ధమయినవీ, క్లిష్టతరమయినవీ ఆమె తననవలద్వారా చర్చకి పెడుతోంది అని అర్థమవుతుంది. //
ఆసక్తికరం.
ఈ విషయాన్ని గురించి ఆలోచించేవాడిని.
ఎందుకంటే ‘విషవృక్ష ఖండన’ రచన మన ప్రజల నమ్మకాలపై గౌరవాన్ని సూచిస్తుంది. ఒక పరిధి దాటిన తిరుగుబాటు ధోరణి మంచిది కాదు అని తోస్తుంది.
@భావన, కాలిన జీవితానుభవం నున్చి వచ్చిన రచన మాత్రం ఆ అనుభపు తీవ్రత ను పాఠకుడి కి కూడా అనుభూతి ని కలిగించకలదేమో – నిజమేనండీ. నేను అలాగే అనుకుంటాను. ఇక్కడివ్యాఖ్యకి, ఉచితఇక్కట్లమీద వ్యాఖ్యకి కూడా ధన్యవాదాలు.
మాలతి గారు, చాలా బావుందండి లత గారి గురించి ఎన్తో సమగ్రం గా ఇచ్చారు. నిజమే కదా కొందరి రచనలు ఎందుకో తిరిగి ప్రచురించరు. ఆమె ను చూసిన అనుభూతి కలిగింది మీ పరిచయం చదివేక. అన్ని సార్లు అనుభవాలే రచనలు అవ్వనక్కర్లేదేమో కాని కాలిన జీవితానుభవం నున్చి వచ్చిన రచన మాత్రం ఆ అనుభపు తీవ్రత ను పాఠకుడి కి కూడా అనుభూతి ని కలిగించకలదేమో కదా.
శిరాకదంబంగారూ, మీకు కూడా శుభాకాంక్షలు.
వి.బి.సౌమ్య, థాంక్స్, ఇలా నిర్లక్ష్యం చేయబడినరచయితలని వెలుగులోకి తీసుకురావాలని నాక్కూడా చాలా కోరికగా వుంది.
నరసింహారావుగారూ, మీవ్యాఖ్య నాకు అర్థం కాలేదు. కాలాతీతవ్యక్తులు రాసింది శ్రీదేవి అని కింద గద్దె స్వరూప్ కి ఇచ్చిన సమాధానంలో వుంది. శ్రీదేవిగారి నవలగురించి తెలుగురచయిత్రులమీద నాపుస్తకంలో విపులంగా చర్చించేను కూడాను.
కాలాతీత వ్యక్తులు నవల వ్రాసినవారు శ్రీదేవి గారని గుర్తు. తప్పయితే సరిచేయగలరు.
మంచి వ్యాసం అందించారు… ధన్యవాదాలు
’లత’ పేరు వినడమే కానీ ఎప్పుడూ చదవలేదు.. ’మోహనవంశీ’ చదివా అనుకుంటా కొంతభాగం ఇదివరలో ఎవరింట్లోనో…
ఇలా ఇప్పుడు దొరకని రచనల గురించీ, రచయిత్రుల గురించీ మరిన్ని వ్యాసాలు రాయండి…
ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
@ వైదేహీ,
@ మధురవాణీ,
ఇప్పుడు ఈపుస్తకాలు ఎక్కడా దొరకవు. ఉంటే లైబ్రరీల్లో వుండాలి. డిజిటల్ లైబ్రరీలో కనిపించడంలేదు. నాబాధ అదే. మహారచయితలంటూ కొందరిపుస్తకాలు మళ్లీ మళ్లీ ప్రచురించవచ్చు కానీ కొందరిని నిర్లక్ష్యం చేయడం కూడా జరుగుతోంది. అంచేత మనసాహిత్య చరిత్ర అసంపూర్ణంగానే మిగిలిపోతోంది ఎంతో పురోభివృద్ధి సాధించినట్టు కనిపించినా.
మాలతి గారూ,
‘లత’ గారెవరో, ఆవిడ రచనలేవిటో బొత్తిగా తెలియకపోయినా కూడా మీ వ్యాసం చూసాక ఆవిడ తప్పక తెలుసుకోవాల్సిన రచయిత్రి అనిపించింది. తెలుగు సాహిత్యం గురించి పెద్దగా తెలియని నాలాంటివాళ్లకి చాలా ఆసక్తికరమైన రచయిత్రి గురించి వ్యాసం రాసి కొత్త విషయాలు తెలిసేలా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఆవిడ పుస్తకాలు చాలానే ఉన్నాయంటున్నారుగా..మామూలు పుస్తకాల షాపుల్లో దొరుకుతాయా అవి?
మాలతి గారూ,
వ్యాసం సమగ్రంగా బావుంది. మీరన్నట్లు ఆవిడ నిజంగా ప్రభంజనమే. ఊహాగానం,కొన్ని కధలు వారపత్రికలలో ఎప్పుడో చదివిన గుర్తు.లత గారి పుస్తకాలకోసం ప్రయత్నించినా దొరకలేదు. ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే చెప్పండి
మీరు ఇటువంటి వ్యాసాలు ఇంకా రాయాలి.
వైదేహి
@ సుజాత, తప్పకుండాను. సాయంత్రం రారాదూ, తీసుకుపోదువు గానీ,
లేదా, ఫరవాలేదనుకుంటే, గాలిపడగలూ, నీటిబుడగలు నవలకి నా అనువాదం నా తూలిక.నెట్ లోవుంది. ఇదుగో లింకు.http://www.thulika.net/2002June/Kites.html
మాలతి గారూ,
నాకు లత గారి గురించి సమగ్రంగా తెలుసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. వికీ పీడియాలో కేవలం “సమాచారాత్మకం” గా దొరికే వ్యాసం కాక. చాలా చాలా థాంక్స్! ఈ మధ్య లత రాసిన ఉమర్ ఖయాం ఒక పాత పుస్తకాల కొట్లో దొరికింది. గాలిపడగలూ నీటి బుడగలూ మాత్రం ఎక్కడా దొరకలేదు. ఇస్తారా నాకు, చదివేసి ఇస్తాను?
ఆమె రాసిన పుస్తకాల్లో మా అమ్మకి బాగా ఇష్టమైన పుస్తకం ఒకటుండేది “పౌలస్త్యుని ప్రేమకథ” అని (రావణుడి ని సున్నితమైన ప్రేమికుడిగా వర్ణిస్తూ రాసిన నవల అనుకుంటాను)!అమ్మ చెప్పాక దాని కోసం ప్రయత్నిస్తే అది కూడా దొరకలేదు.దాని గురించి మీకేమైనా తెలిస్తే రాస్తారా?
@ కల్పన, నేను రాసినా, నువ్వు మళ్లీ రాయొచ్చు. నీబ్లాగు చూసేవారు నాబ్లాగు చూడకపోవచ్చు. లతలాటి రచయిత్రిమీద రాయడానికి ఎంతైనా వుంటుంది.
@ఉష, ధన్యవాదాలు. తప్పక చదివి మీఆలోచనలు రాయండి
@వేణు, మీరు అన్న factual error చూస్తానండీ మరొకసారి. ఇంకా ఎవరైనా ఈవిషయం సవిస్తరంగా చెప్పగలరేమో కూడా చూస్తాను. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు.
@గద్దె స్వరూప్, ఆంధ్రలో తెలుగు యూనివర్సిటీ, విశాలంధ్రలో దొరుకుతాయి. అమెరికానించి తెప్పించుకోవాలంటే పోస్టేజి ఎంతవుతుందో కనుక్కుని చెప్తాను. మీ ఈమెయిలు ఇవ్వగలరా? my ID malathini@gmail.com. Thanks.
@ బుడుగోయ్, ఇప్పుడు ఆపుస్తకాలు బజారులో దొరక్కపోవచ్చు. లైబ్రరీల్లో తప్పకుండా వుంటాయి. ఫాయిదా అన్న వాడుక కూడా వుందండీ. ధన్యవాదాలు.
@ SRRao, ధన్యవాదాలు.
మాలతి గారూ !
తనలోని భావాలకు ఎలాంటి ముసుగులు లేకుండా, నిర్మొహమాటంగా బయిటపెట్టడం అందరికీ సాధ్యంకాదు. అలాంటి ధైర్యం గల రచయిత్రి లత. ఆవిడ గురించి వివరంగా, సమగ్రంగా అందించినందుకు ధన్యవాదాలు
లత గారి గురించి ఎప్పుడూ చదవడమే తప్ప పుస్తకాలు మాత్రం ఎక్కడా దొరకవు ఈ తరానికి. అవెక్కడ కొనుక్కోవాలో కాస్త చెబుదురూ..
అలాగే మీ వ్యాసంలో “జమీందారీ ఫాయిదాలో” అన్న పదప్రయోగం ఎందుకో తప్పనిపిస్తుంది. “జమీందారీ ఫాయాలో” అని రాయాలనుకుంటా. correct me if i am wrong.
“తెలుగు రచయిత్రులమీద నేను రాసిన పుస్తకం మీరు చదవాలి. చాలా విషయాలు తెలుస్తాయి ఆకాలం రచయిత్రులగురించి.”
నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఎలా తెప్పించుకోవచ్చో చెప్పగలరా? నెనర్లు.
కల్పన గారూ తప్పకుండా చదువుతాను.
మాలతి గారూ, లత గారి గురించి మీ టపా చాలా విశేషాలు తెలియజేసింది.ఆమె వ్యక్తిగత జీవిత సంఘర్షణ రచనల్లో ప్రతిఫలించిన సంగతి బాగా రాశారు. మీకు అభినందనలు!
అయితే, ఒక factual error దొర్లింది. రంగనాయకమ్మ గారి ‘రామాయణ విషవృక్షం’ వాల్మీకి ‘రామాయణం’పై విమర్శ. అంతే కానీ అది విశ్వనాథ సత్యనారాయణ గారి ‘శ్రీ మద్రామాయణ కల్పవృక్షం ’పై విమర్శ కాదు. మీరొక్కరే కాదు; కల్ప వృక్షం- విష వృక్షం అనే పేర్లను బట్టి చాలామంది సాహితీ వేత్తలు కూడా ఇలా పొరబడుతుంటారు.
ఈ వీకెండ్ మంచి వ్యాసం చదవటంతో పూర్తైంది. థాంక్స్ మాలతి గారు. మునుపు లత గారి రచనలు చదివాను కానీ ఇంత లోతుగా తరిచి చెప్పిన విశ్లేషణ చూడటం ఇదే. నిజానికి చదివినవి కూడా మరిచిపోయాను. ప్రయత్నించి చదవాలిక. “బాధ పడ్డవారికే బాధ అర్థమవుతుంది.” ఇది మాత్రం నేను నమ్మే, నన్ను నడిపే జీవిత సూత్రం,
మాలతి గారు, లత మీద నా వ్యాసం కూడా పూర్తి కావచ్చింది. మీరు నాకన్నా ముందున్నారు. అభినందనలు. మీరు రాసేసిన పాయింట్లు నేను రాయక్కరలేదుకదా…అందుకు…
గద్దే స్వరూప్ గారు, లత గురించి మరి కొన్ని వివరాలు, నా జ్ఞాపకాలు నా బ్లాగ్ లో త్వరలో పెట్టబోతున్నాను. అలాగే మీరు ప్రస్తావించిన కాలాతీత వ్యక్తుల గురించి కూడా. వీలైతే అవి పెట్టినప్పుడు వచ్చి చదివి మీ అభిప్రాయం చెప్పండి.
@ gaddeswarup, కాదండీ. కాలాతీతవ్యక్తులు రాసింది పి. శ్రీదేవి. ఈవిడ లతగానే సుప్రసిద్ధురాలు. తెలుగు రచయిత్రులమీద నేను రాసిన పుస్తకం మీరు చదవాలి. ఆనాటి నవలలు,కథలూ, గాలిపడగలూ, నీటిబుడగలూ, కాలాతీతవ్యక్తులూ కూడా విస్తృతంగా చర్చించాను నాపుస్తకంలో.
లీలగా గుర్తుకు వచ్చింది. ‘కాలాతీతవ్యక్తులు ‘ రచయిత్రి ఈవిడేనా? ఈపుస్తకంబాగుంది ఎవరూ ఈరచయిత్రిని గురించి రాయటంలేదేమిటి అనుకునేవాడిని.