కళ్లు

02/25/2010

ఓ చల్లని సాయంవేళ గోపాలరావు షికారుగా నెమ్మదిగా ఏవేవో భావాలు కలకలుపుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. వెనకే సుమిత్ర సప్తపాదాలు తొక్కుతున్నట్టు అనుసరిస్తుండగా, ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఉద్దేశాలు మంచివే!

02/23/2010

ఆంధ్రదేశంలో ఒకజిల్లా ముఖ్యపట్టణంలో బస్‌స్టాండునించి కాలేజీకి వెళ్లేదారిలో సూర్యచంద్రలారీ సర్విస్ షెడ్ వుంది. సామాన్యంగా బస్టాండుకీ కాలేజీకీ మధ్య పయనించే ప్రజలు ఎంత తొందరపనిలో వున్నా ఎంత పరధ్యానంతో నడుస్తున్నా ఆ సూర్యచంద్రలారీ సర్వీసుదగ్గరికి వచ్చేసరికి ఓమారు ఉలిక్కిపడి చుట్టూ చూసి ముందుకి సాగుతారు. దానికి కారణం లేకపోలేదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


తెలుగెప్పుడూ రెండోభాషే – మీవ్యాఖ్యలకి నా జవాబు

02/21/2010

మీరందరూ – పూర్ణమా, అబ్రకదబ్ర, రమణ, ఇండిపెండంట్, సుజాత, లలిత, భావన,  కుమార్ యన్, శ్రీవాసుకి – మీఅభిప్రాయాలు వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

సంగ్రహంగా, నేను చెప్పదలుకున్నది ఈనాడు మనసాహిత్యంలో ఇంగ్లీషు ఇంత విస్తారంగా కనిపించడానికి చారిత్ర్యక కారణాలు.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


తెలుగెప్పుడూ రెండోభాషే!

02/16/2010

కిందటివారం పుస్తకం.నెట్‌లో మనకి “లేని పుస్తకాల”మీద హేలీ రాసినవ్యాసం చూసినతరవాత నాకు కొన్ని సందేహాలు కలిగేయి. ఆ వ్యాసంలో ప్రధానాంశం “ఇంగ్లీషులో వచ్చిన పుస్తకాలలాటివి తెలుగులో ఎందుకు లేవూ?” అని.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – మనసుకి బుద్ధి లేదు!

02/06/2010

(ఎన్నెమ్మకతలు 50)

  ఈ రోజు ఏదైనా కొత్తది రాద్దాం అనుకుంటూ. వెనక్కి తిరిగి చూస్తే, ముందు టపాలో అబ్బూరి రామకృష్ణారావుగారి చమత్కారం గుర్తొచ్చింది. ఆ చమత్కారం నామనసున నాటింది కనక అదే నిజం అన్నాను.  కానీ ఈపూట నాబుద్ధికి పని పెట్టి, ఆలోచిస్తే, ఆ రోజుల్లో నేను చదివిన పుస్తకాలు ఎక్కువే, గత పదేళ్లలోనూ నేను “చదువుదాం” అనుకున్నవాటితో పోల్చి చూస్తే.  ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


అవేద్యాలు

02/05/2010

తలొంచుకుని తండ్రి రాసిన ఖండకావ్యం తాలూకు ప్రూఫు చూస్తోంది శారద.

శారదని చూసి ఆగిపోయాడు చలపతి ఒకకాలు గుమ్మంలోనూ ఒకకాలు గుమ్మంపైనా ఉంచి – రన్నింగ్ రేస్‌లో ఛాంపియన్‌లా.

కొనకంటిలో మనిషి మెదిలినట్టయితే, “ఎవరోలే” అనుకుని, కావలిస్తే వాళ్లే పిలుస్తారు అన్నధోరణిలో దృష్టి మరల్చలేదు శారద. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


మాలతిసాహితి pdf 2

02/04/2010

నాదగ్గర ఉన్నవి 1954నించి ఈసంపుటిలో చేర్చాను. నిజానికి మొదటి అయిదు స్కెచ్ లేక గల్పికలు – ఈనాటి కార్డ్ కథలలాటివి. నాసరదాకోసం పెట్టుకున్నాను కానీ మీరు ఏ ఆరో, ఏడో కథ దగ్గరో చదవడం మొదలెట్టొచ్చు. మళ్లీ చెప్పలేదనకండి మరి.

తాజాకలం.

malathisahiti 1, malathisahiti 2 – ఈ రెండు సంకలనాలు మార్చి, కథామాలతి అన్న పేరుతో నా కథలన్నీ వేరే సంకలనాలు చేస్తున్నాను. మాలతి సాహిత్యం pdf లో అన్న పేజీ చూడగలరు.  – మాలతి


ముగ్ధ

02/01/2010

(1959నాటి కథ)

సుబ్బలక్ష్మితో అచ్చనకాయలాడుతూ కూచుంటే టైమెంతయిందో నాకే తెలీదు. సబ్బలక్ష్మి వాళ్లమ్మ సంజెదీపం పెట్టడం చూసి చేతిలో రాళ్లు చెప్పున వదిలేశాను. అప్పుడు గుర్తొచ్చింది ఆకలి. రేపొస్తానని సుబ్బలక్ష్మికి చెప్పి ఇంటికి వస్తూంటే ఆలస్యమయినందుకూ, కొత్తపరికిణీ మాపుకున్నందుకూ అమ్మ ఏమంటుందోనన్న భయం జ్ఞాపకం వచ్చింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.