నన్ను ముత్యాలపేట జిల్లా పరిషత్తు హైస్కూలికి బదిలీ చేశారని తెలిసినప్పుడు, నన్ను తెలిసినవాళ్లందరూ విచారించారు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
విపర్యయం
03/28/2010క్రిందనించి “కృష్ణా” అని అమ్మ మళ్లీ పిలుస్తూంది.
కృష్ణుడు కుర్చీలో కూర్చుని టేబుల్‌వేపు తదేకంగా చూస్తున్నాడు.
అప్పడే రైలు దిగి వచ్చేనేమో, స్నానం చేసి పడుకోడంతో నిద్ర ముంచుకొస్తోంది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఊసుపోక – గోడమీద రేపు
03/23/2010(ఎన్నెమ్మకతలు 51)
పిల్లల్ని “భోజనాలకి రండర్రా,” అని మీరంటే, “ఇదుగో వచ్చే” అని వాళ్లంటే, వెంటనే పరుగెత్తుకు వచ్చేసే పిల్లల్ని మీరెక్కడయినా చూశారా? చూస్తే, వాళ్లు రెండుతరాలకి ముందు పుట్టినవాళ్లయి ఉంటారని నా నమ్మకం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
కొనే మనిషి
03/20/2010(ఈకథకి కథా కమామీషూ – ఆంధ్రప్రభలో మార్చి 1976లో అచ్చయింది.
మళ్లీ ఈమధ్యనే – “20వ శతాబ్దంలో అమెరికా తెలుగుకథానిక” అను బృహద్గ్రంథంలో ప్రచురణకి నోచుకున్న నాకథ రచయిత నిడదవోలు మాధవి అని ప్రచురించినట్టు నాకు ఈమధ్యనే తెలిసింది. వంగూరివారిదే మరోసంకలనంలో “డాలరుకో గుప్పెడు రూకలు” అను నాకథ “డాలరుకో గుప్పెడు నూకలు” అన్న మారుపేరుతో ప్రచురించబడింది. చూశారా, ఒక్క అక్షరం మారితే, అర్థం ఎలా మారిపోతుందో.. వంగూరివారు హాస్యరస ప్రియులు మరి. రానున్న సంకలనంలో నాకూ, నాకథకీ ఏంనామకరణాలు చేస్తారో వేచి చూద్దాం …
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
చిరుచక్రం
03/17/2010“డీయీవో బాబొస్తన్నాడంట”
రోజూ అయ్యగారింటికి ఆరుగంటలకి పరుగెత్తే స్కూలు ప్యూను వెంకన్న ఆరోజు అర్థరాత్రి లేచి ముస్తాబు మొదలెట్టాడు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఆచార్య నాయని కృష్ణకుమారిగారు – జానపదసాహిత్య విదుషీమణి.
03/13/2010కృష్ణకుమారిగారు జానపదసాహిత్యం, స్త్రీలసాహిత్యంలో విశేషకృషి చేసిన ఆద్యులలో ఒకరు. ఆమె రంగంలో ప్రవేశించేనాటికి, జానపదవాఙ్మయానికి సాహిత్యస్థాయి లేదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
DLI లైబ్రరీలో పుస్తకాలు
03/12/2010ఈరోజు పొద్దున్నే లేచి మెయిలు చూస్తే అయిదు వ్యాఖ్యలు కనిపించేయి నా తపాల్ పెట్టెలో. ఒక్కరోజులో ఇన్ని రావడం అరుదు. ఎవరా అని చూస్తే, ఇంకెవరు? పుస్తకం.నెట్ సంపాదకజంటలో ఒకరైన సౌమ్య! ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
“ఋణానుబంధ రూపేణ …”
03/10/2010“అయితే ఆ మిషను ఏమైంది మామయ్యా?” అన్నాను భయపడుతూ, భయపడుతూ.
ఆయన మామయ్య కాదు గానీ పెద్దవాళ్లని పేరు పెట్టి పిలవకూడదు కనక … ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
నడుస్తున్న చరిత్ర
03/08/2010(ఈరోజు మహిళల దినోత్సవంట. 63లో రాసిన ఈకథ మనం ఎంత సావకాశంగానూ, వేగంగానూ ముందుకు సాగుతున్నామో చెపుతుంది అనిపించి, మీతో పంచుకుంటున్నాను.
)
“నవంబరు ఒకటో తారీఖు” అంది కేలండరు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
thulika.net updated
03/03/2010నా thulika.netలో ఇంగ్లీషులో ఈకింది కథలూ, వ్యాసాలు చూడండి
శివరాజు సుబ్బలక్ష్మిగారిమీద నాప్రత్యేక వ్యాసంతో పాటు వారి కథ, ఆడవాళ్లపెట్టెలో ప్రయాణం. నేను మీకు తెలుగు కథ అందించలేను కానీ, ఇంగ్లీషు అనువాదం చూడొచ్చు ఆమె హాస్యచతురతకోసం.
ఇంకా, భండారు అచ్చమాంబ గారి ధనత్రయోదశి, డా. కొలకలూరి ఇనాక్ గారి క్షమాభిక్ష, కూడా అక్కడ దొరుకును.
- నిడదవోలు మాలతి
మాలతి యొక్క టపా