Before daybreak లేచి
Breakfast చేసి
Freshen upప్పయి Officeకెళ్లి
Late evening ఇల్లు చేరి
Daddyకో hugయ్యమ్మా అంటే
పో, నాన్నా, నిద్దలొతూందంటూ
ఒత్తిగిలి నిద్దరోయింది
చక్రాలబండి తొక్కి తొక్కి అలసిపోయిన పాపాయి.
000
కాలం అపురూపం
ఎక్కడయిపోతుందోనని
కొసరి కొసరి కొరుకుతూ తింటోందామె
అమ్మమ్మ పెట్టిన అరిసెల్లా.
అనుభవించకపోతే అరచేతిలో స్వర్గం చేజారిపోతుందని
ఉరుకులూ పరుగులూ పెడుతున్నాడతను వగరుస్తూ.
కాలం కదులుతోంది తనమానాన తను.
000
అవ్యక్తమధురం
కొందరిజీవితాల్లో ఆత్మస్ఫర్శలు
సాగుతాయి సమాంతరంగా.
అవి కలవవు, విడిపోవు.
వారి బాంధవ్యం
సాగుతుంది సరస్వతీనదిలా
అవ్యక్త పట్టాలమీద
“ఔరా” ఎక్స్‌ప్రెస్ అయి.
(June 30, 2010)

[...] http://tethulika.wordpress.com/2010/06/30/%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%a4%e0… [...]
కల్పనా, నేను నీకు పోటీనా, మరీ హాస్యాలు కాకపోతే … ఏదో పాతఫొటో కనిపిస్తే, నాలుగు మాటలు గిలికేను. నువ్వు బాగుందంటే ఆమోదముద్ర. నాకు సంతోషం.
మాలతి గారు,
మీరు భలేవారండీ.కవితల మీద కవితలు రాసేసి మాకు పోటీ వస్తున్నారా? కథల్లో మీతో పడలెం కనీసం కవిత్వం తో వద్దామనుకుంటే మీరు మాకు గట్టి పోటీ ఇచ్చేస్తున్నారుగా….జస్ట్ కిడ్డింగ్. కవితా బావుంది. నిద్దోరోతున్న పాపాయి కూడా. అసలు నిద్దరపోయే పాపాయిల అందమే వేరు.
కల్పన
@ రాధిక, -:). బాగుంది నీ మినికవిత కూడా. ధన్యవాదాలు.
@ రవి, ధన్యవాదాలు.
హృద్యంగా రాశారు. అచ్చం మా పాపాయి లానే నిదరోతుంది, ఫోటోలో పాపాయి కూడాను.
“కాలం అపురూపం” amazing
“పలుకు తేనియలొలుకు” cute,nice
“అవ్యక్తమధురం”brilliant