నేటి విద్యార్థులు (ఆడియో)

అనిల్ అట్లూరి ప్రోత్సాహంతో ఒక ఆడియో చేసి చూద్దాం అనుకుని, ఇది చేశాను. నిజానికి, ఆడియో చెయ్యడానికి గళంలో నాటకీయత కావాలి. మాఅమ్మాయికి తెలుగొచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపించే క్షణాలన్నమాట. రెండోది కథలో వివిధస్వరాలు పలికించే అవకాశం ఉండాలి. అలా ఉన్నవి ప్రాప్తంలాటి కథలు కానీ అవి ప్రచురించడం అయిపోయింది కనక, మళ్లీ వినే సరదా ఉండకపోవచ్చనీ ఇది ఎంచుకున్నాను.

ఈ స్కెచ్ (నిజంగా కథ కాదు కదా) నేను ఇంటర్ చదివేరోజుల్లో రాసింది. ఇప్పటికింకా ఈబ్లాగు మొహం చూడనిది. ఈకథకి స్ఫూర్తినిచ్చింది రావిశాస్త్రిగారి జరీఅంచు తెల్లచీర. వారికి కృతజ్ఞతలు.

అనిల్ ఆడియో చెయ్యడానికి ప్రోత్సహించారు కనక ఆయనకి కృతజ్ఞతలతో.

http://thulika.net/media/vidyarthulu.mp3

కల్పన ఎప్పటినించో అనుకుంటున్న కవితాశ్రవణం కూడా ఈవిధంగా క్రియారూపం దాల్చడం మరో ఫలం ఈ సంకల్పనానికి. ఆ రెండు కవితలు  ఇక్కడ వినండి.

7 Responses to నేటి విద్యార్థులు (ఆడియో)

  1. Sowmya అంటున్నారు:

    మరేమో, నేను ఇప్పుడు వింటున్నా అనమాట :)
    బాగుంది ఆడియో!
    మీరు మాట్లాడుతున్నట్లే, చాట్లాడుతున్నట్లే ఉంది నాకు :) ) (అఫ్కోర్సు, మీరే మాట్లాడారనుకోండి.. ;) )

  2. మాలతి అంటున్నారు:

    @చదువరి, మీరు బాగుందంటే నాకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు
    @శ్రీలలిత, చిన్నప్పుడు రేడియో.. అంటే ఇంకా వస్తున్నాయా. ఎప్పుడో నాచిన్నప్పుడు వచ్చేవి. సంతోషం.
    @లలిత (తెలుగు4కిడ్స్).అవునండీ సందేహిస్తూనే చదివేను. అసలు ఇదేమంత గొప్పకథ కాదని సందేహం, నాగొంతు బాగోదని సందేహం, రికార్డింగ్ బాగా రాదని సందేహం… మీరన్నట్టు పాఠం కూడా పెడితే బాగుంటుంది. కనీసం నా పరువు నిలుపుకోడానికైనా మరో మంచి కథ చెయ్యక తప్పదు :p.
    కథ ఇంకా ఏదో వున్నట్టు అనిపించడం మంచి చిన్నకథ లక్షణమేననుకుంటానండీ. ఎందుకంటే జీవితంలాగే కథకి కూడా అంతం లేదు, రచయిత అంతమయినప్పుడు తప్ప. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా.. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  3. మాలతి గారూ, మీ ప్రయోగం బావుంది.
    నాకైతే, చదివిన కథలు కూడా, (ఒక్కో సారి చదివిన కథలనే) వినబుద్ధేస్తుంది.
    అలాంటి వారు ఇంకా ఉండవచ్చు.
    అందుకని ఇప్పటికే ప్రచురించిన కథలకు కూడా audio పెట్టగలరు.
    అంతే కాదు, audio ఉన్నా కూడా రాసిన కథ కూడా పెడితే బావుంటుంది.

    చదవడం కొంచెం అపనమ్మకంతో మొదలు పెట్టినట్టనిపించింది. కానీ, చదువుతున్న కొద్దీ నమ్మకం తెలియకుండానే పెరిగి సులభంగా సాగిపోయింది. అసలు మీ కథలే అటువంటివి, పైకి చదవడానికి బావుండేవి, అనిపిస్తుంది నాకు, మరి. ముగింపు దగ్గర ఇంకా కథ ఉందేమో అనిపించేలా ఆగింది.

  4. Srilalita అంటున్నారు:

    మాలతిగారూ,
    మీ స్కెచ్ వింటుంటే చిన్నప్పుడు రేడియో లో వినే కథలు గుర్తొచ్చాయి. బాగా చదివారు. అంటే మీరు చదువుతుంటే బాగా యేక్షన్ తో సహా అర్ధమైంది. ప్రయోగం బాగుంది..అభినందనలు.

  5. చదువరి అంటున్నారు:

    కల్పన గారన్నట్టు, గొంతులో చక్కటి నాటకీయతను కనబరచారు.
    “ఆశ్చర్యార్థకాల్లా నించున్న నలుగురు..” – :) – మీ మార్కు!

  6. మాలతి అంటున్నారు:

    కల్పన, నీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. కొన్నాళ్ళాగి చూద్దాం.

  7. kalpana అంటున్నారు:

    మాలతి గారు,

    సరయూ చదివి వుంటే బావుండేది. కానీ మీరు కూడా చక్కగా చదివారు. మీ కంఠం లో నాటకీయతకేమి తక్కువ లేదు.ముందు ముందు మరిన్ని కథలు ఆడియో రూపం లో అందివ్వండి. చదవటానికి వీలు లేని వారు వింతారు. వింటానికి వీలు లేని వారు చద్వుతారు. రెండూ వీలు లేని కొందరు నా లాంటి వాళ్ళూ ( స్మైలీ ప్లీజ్) ఇలా కామెంటుతారు.
    బెస్ట్ ఆఫ్ లక్

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.