www.thulika.net, September 2010 updated.
కొత్తవ్యాసాలతో, కథలతో…
తా.క. మాతృదేవో భవ కథ మీద చర్చ ముగిసింది. చర్చకి పెట్టిన రెండోకథ శారదగారి స్వార్థపరుడు.
www.thulika.net, September 2010 updated.
కొత్తవ్యాసాలతో, కథలతో…
తా.క. మాతృదేవో భవ కథ మీద చర్చ ముగిసింది. చర్చకి పెట్టిన రెండోకథ శారదగారి స్వార్థపరుడు.
@లలితా, target audience అంటూ ఏమీ లేదండీ. కల్పన ఇక్కడ పెట్టారు వ్యాఖ్య. దాంతో చర్చ అంతా ఇక్కడ సాగుతోంది. దానికి మూలకథ తెలుగు కావడం కావచ్చు, వ్యాఖ్యానించేవారికి తెలుగు సౌకర్యం కావచ్చు. పోతే, మీరు చెప్పిన వివరణ కూడా చాలా బాగుంది. నిజమే. తల్లిని దేవతలా చూడాలి అని కథకుడి వ్యాఖ్యానం కావచ్చు. కథకుడు ప్రధానపాత్ర కాదు కదా, కథ ఉత్తమపురుషలో చెప్పినప్పుడు కూడా. ప్రధాన పాత్ర ఒక పాత్ర., కథకుడి రచయిత అభిప్రాయాలకి వాహిక అవడానికి అవకాశం ఉంది.
ఈ వ్యాఖ్యలన్నీ చూసినతరవాత నాకు కథాచర్చకి వేరే పేజీ పెట్టి, ఒకొక కథే తీసుకుని చర్చిస్తే బాగుండునని ఉంది. సత్యవతిగారితో ఈమాట అంటే, ఆమె కూడా మంచి ఆలోచన అన్నారు. త్వరలోనే మొదలు పెడతాను. ఈసారి తెలుగు కథ కూడా అందుబాటులో ఉండేలా చూస్తాను.
మరొకసారి చర్చలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు.
మాలతి గారూ,
మీ ఆంగ్ల అనువాదల target audience లో నేను లేనని నాకో నమ్మకం.
ఏదో ఊరికే కథని పలకరించి వచ్చి, ఆ తర్వాతెప్పుడో కల్పన వ్యాఖ్య చూసి తీరికగా మొత్తం కథ చదివాను (మాతృదేవో భవ).
తర్వాత సత్యవతి గారి వ్యాఖ్య చూసి ఇంకో వైపు అభిప్రాయం కూడా వచ్చేసింది అనుకున్నాను.
ఆ పైన చర్చ చూసి నా అభిప్రాయం ఏమిటని ప్రశ్నించుకున్నాను.
మొదట్లో కథ గురించి కానీ, కథ పేరు గురించి కానీ ఎక్కువ ఆలోచించలేదు.
శారద ఆలోచనలు బాధించాయి, ఆ అమ్మాయి (పాత్ర) గురించి కూడా బాధ వేసింది.
అంతే, మొదట్లో.
ఇప్పుడు అనిపిస్తున్నదేంటంటే, కల్పన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది కదా అని.
అంటే, “మాతృ దేవో భవ” (తల్లిని దైవంగా చూసే వ్యక్తివి అవ్వు)అంటే ఏమిటి అని ఆలోచింప చేస్తోంది కదా ఈ కథ. అదే కదా కథ ఉద్దేశం అనిపిస్తోంది.
సత్యవతి, కల్పనా, ఈచర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇలాటి చర్చలు స్ఫూర్తిదాయకం అని నా నమ్మకం. అంటే వీటితో రచయితలు కథలు తిరగరాయాలని కాదు. ఆ రచయిత కానీ మరొకరు కానీ ఆలోచించుకోడానికి అవకాశం ఇస్తాయని. ఆ ఆలోచనద్వారా మరొక కొత్త కథ కూడా రావచ్చు.
ఈ కథ ప్రత్యేకించి నాదృష్టినాకర్షించడానికి కారణం – ఇతివృత్తం కుటుంబసభ్యులమధ్య పరస్పర సంబంధాలగురించినది కనక – అది సార్వజనీనం. నిత్యం అందరిళ్లలో చూస్తున్నదే – ఇండియాలోనూ అమెరికాలోనూ కూడా.
ముందు ముందు ఇలాటి చర్చలు ఇంకా చెయ్యాలనుకుంటున్నాను. మీరు, మిగతా పాఠకులూ కూడా పాల్గొనగలరని ఆశిస్తూ — మాలతి
ఈ కథ లో తల్లి ఎప్పుడూ ఉదాత్తంగానే ప్రవర్తిస్తుంది,ఆమెని అర్థం చేసుకోలేకపోయింది మొదటినించీ శారదే.చనిపోబోయే ముందుకూడా శారద వచ్చిందా అని అడుగుతుంది.శారదలో వుండే రకరకాల కాంప్లెక్సులే ఆమె ప్రవర్తనకు కారణం.తల్లి ఎప్పుడూ దైవమే.మనుషుల ప్రవర్తనల్లో మార్పులు రావడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటన కారణం కావచ్చు.భావావేశాల్లో సమతూకం లేని శారదకు డబ్బే కనువిప్పు కలిగించి వుండొచ్చు.సమానంగా డబ్బిచ్చినందువల్ల సమంగా ప్రేమను పంచిందని ఆమె అనుకుని వుండోచ్చు,కానీ మాలతిగారన్నట్లు కధకు ఈ శీర్షిక కాక వేరే ఏదైనా పెడితే బాగుండేదేమో
@ కల్పనా, నీ వివరణ బాగుంది. నిన్న వైదేహితో కూడా సుదీర్ఘంగా చర్చించినతరవాత సత్యవతిగారి విశ్లేషణలో బలం నాకు అర్థమవుతోంది.
.
@ సత్యవతి, మీవ్యాఖ్య చూసినతరవాత మళ్లీ ఆలోచిస్తే, ఆముగింపు ఆపాత్రకి తగినట్టే ఉంది అనిపిస్తోంది. సుబ్బారావు తనని పెళ్లి చేసుకోడానికి ముందుకి రావడం తనడబ్బుకోసమే, తండ్రి ఆస్తి అంతా తనకే ఇచ్చేస్తాడేమోనని చెల్లెలిభయం … ఇలా శారద కనీసం కొన్ని విషయాలు డబ్బుతో కొలుస్తున్నట్టే కనిపిస్తుంది. అంచేత తల్లి తనకి ఆస్తి పంపకం పెట్టడంతో తల్లిప్రేమమీద ఆవిడకి నమ్మకం కలిగిందనుకోవాలేమో.
నాచిన్నప్పుడు చదివేను – ఇచ్ఛాపురపు జగన్నాథరావు రాసిన కథ ఒకటి. ఒకాయన లాటరీ టికెట్ కొని జేబులో పెట్టుకుంటాడు. ఆ టికెట్ గెలిచింది అని తెలిసి భర్త ఆవిడని అడుగుతాడు. ఆవిడ బట్టలు చాకలికి వేసేనంటుంది. అతను నానా గొడవ చేస్తాడు. తరవాత చాకలి బాబుగారి జేబులో ఉందంటూ ఆ టికెట్ తెచ్చి ఇస్తాడు. ఆవిడ దాన్ని ఆయనకి అందజేస్తుంది. ఆయన ఎంతో ఆనందంగా ఆవిడని కౌగలించుకుని, నువ్వు నా దేవతవి అంటాడు. కథ పేరు “ధనం చేసిన దేవత”.
డబ్బు విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయాలు కారణం కావచ్చు ఈకథ ఇంతకాలం గుర్తుండిపోడానికీ, వసుంధరాదేవికథకి నేను అలా స్పందించడానికీ కూడా.
ఏమైనా, మంచి చర్చ రావడం ముదావహం.
సత్యవతి గారు,
మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం బావుంది.
మీరన్నా పాయింట్ నేను కూడా అర్థం చేసుకున్నాను. కూతురి అసమ్ప్తృప్తి చెప్తూనే వచ్చారు మొదటి నుంచి . కానీ అదొక అపోహ , తప్పు అభిప్రాయం అని తెలియటానికి తీసుకున్న సంకేతం మాత్రం బావుండలేదు. తల్లి చనిపోయాక ఆ అమ్మాయికి కనువిప్పు కలిగిందని చెప్పటానికి మరో బలమైన సెంటిమెంట్ వుండాలి కానీ డబ్బు అక్కడ బంధాన్ని కొంచెం తక్కువ చేసిందని నాకు అనిపించింది.
మాలతి గారి కథ ల మీద మీ సమగ్ర వ్యాసం ఇంకా చదవలేదు. చదవాగానే మైల్ చేస్తాను.
కల్పన
వసుంధరా దేవి కధ మళ్ళి చదివాను.ఆవిడ ఇందులో శారద పాత్ర కుండే complex కి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని పిం చింది ఆ అమ్మాయికి మొదటి నించి తల్లి తనపై చూపే ప్రేమ పట్ల ఒకరకమైన అసంతృప్తి…తల్లికి ఆ పిల్లకి మధ్య అవగాహనా లోపం వుంది.communication gap వుంది.తల్లి తనను స్పృశించలేదని తనతో సంబంధం పెట్టుకోలేదని అనుకుంటుందే కాని తను కూడా తల్లితో సంబంధం పెట్టుకోడానికి ప్రయత్నించక పోగా ఒక విధ మైన కచ్చ పెం చుకుంటుంది .దాన్ని తండ్రిపై అమితమైన ఇష్టంగా మార్చుకుంటుంది.తండ్రి మరణం, ఆయన దేహాన్ని కూడా ఆమె వచ్చే వరకు వుంచకుండా దహనం చెయ్యడం తో తనకెవరు లేరనే అబిప్రాయం ఏర్పడి తల్లి పై మరింత అపేక్షాబావం.నిర్లక్షం ఏర్పడ్డాయి తల్లికి తనమీద ఎలాంటి కోపం లేదని కూడా తెలుసు అంతేకాక ఎవరిమిదో కక్ష సాధించాలన్న ఆరాటం.ఇదంతా కూడా తల్లి తన మీద ప్రేమ చూపించలేదనే ఉద్దేశం తోనే ఈ కోపం తల్లి పట్ల నిరసన బావం ఆమె డబ్బు ఇవ్వగానే పోయాయనడం కరెక్ట్ కాదు. ఇక్కడ శారద కి డబ్బుతో అవసరం లేదు.తన చెల్లితో పాటు సమానంగా concern చూపిందని తెలియడం తో తల్లిని అపార్ధం చేసుకున్నాననుకుం దే కాని డబ్బు వల్ల మారిందని అర్ధం కాదుడబ్బు కేవలం ఒక సంకేతమే.. .అల్లా అని నేను అర్ధం చేసుకున్నాను.
కల్పనా, మాతృదేవోభవ లాటి ఉపనిషద్వాక్యాలు కోట్ చేసినప్పుడు, సర్వసాధారణమయిన ప్రాపంచిక చింతలకీ, ఆశలకీ, కోరికలకీ అతీతమయిన ఒక ఉదాత్తభావాన్నీ, ఒక తాత్త్వికచింతననీ ఆవిష్కరించాలని నేను అనుకుంటాను. ఈకథలో ప్రధానపాత్ర శారద అభిప్రాయాలని తల్లి వీలునామాతో కలపడంమూలంగా ఔచిత్యభంగం అయిందనే నేను కూడా అనుకున్నాను. వసుంధరాదేవిగారికి నీ వ్యాఖ్య అందజేశాను. ఆమె ఏమి జవాబు చెప్తారో చూద్దాం.
మాలతి గారు,
మీ ఇంగ్లీష్ తూలిక లో వసుంధరాదేవి గారి కథ కు మీ అనువాదం చదివాను. మీ ఎడిటోరియల్ లో మీరు మెన్షన్ చేశారు కానీ నా అభిప్రాయం కూడా చెప్పటం అవసరం అనుకున్నాను.
తల్లి ఇచ్చిన డబ్బులు చూశాక కానీ ఆమె మాతృత్వం మీద గౌరవం, నమ్మకం కూతురు కి కలగలేదా? ఆదేనా మాతృదేవోభవా? ఒకవేళ కథలో తల్లి కూతురికి ఆ డబ్బు ఇచ్చిచి వుండకపోతే ఆమె చెడ్డ తల్లి నా? వసుంధరాదేవి గారి లాంటి సీనియర్ రచయిత్రికలం నుంది ఏదో ఒక టైం లో ఇలాంటి కథ రావటం నాకైతే అసలు నచ్చలేదు. వీలైతే మీరు రచయత్రి కి ఈ అభిప్రాయం చూపించగలరు.
కల్పన