ప్రముఖ కవి అఫ్సర్ గారి బ్లాగులో నేను!

09/30/2010

వయసుకి నాకంటే చిన్న అయినా సాహిత్యంలో చాలా పెద్దపేరున్న అఫ్సర్ నన్ను గుర్తించేరంటే, నాకు ఆరిపోతున్న ఉత్సాహం తేరుకుని మళ్ళీ ఉరకలేస్తానంటోంది.

ఒకే నెలలో మొదట ప్రముఖ రచయిత్రి పి. సత్యవతిగారు నాకధలమీద వ్యాసం (భూమికలో), ఆ తరవాత ప్రముఖ కవి అఫ్సర్ ముఖాముఖి అంటూ నా నాలుగుమాటలు తనబ్లాగులో పెట్టడం నాకొక అపూర్వ గౌరవం.

అఫ్సర్ గారితో నా ముఖాముఖీ కి లింకిదుగో -

http://afsartelugu.blogspot.com/2010/09/blog-post_30.html

మాలతి


లోభిహృదయం కథ (చర్చ)

09/26/2010

పూర్వంలాగే, ఇక్కడ భానుమతిగారి లోభి హృదయం కథ చర్చకి పెడుతున్నాను. మీరు ఈకథ చదివి, మీ మీ స్పందనలు రాయవలసిందిగా కోరుతున్నాను.

లోభి హృదయం

దయచేసి ఇక్కడ ఈకథమీద మాత్రమే మీ వ్యాఖ్యలు రాయమని అర్థిస్తున్నాను.  ధన్యవాదాలు.


భానుమతి కథానికలు

09/26/2010

భానుమతి అత్తగారిపాత్ర లేని కథలు రాసేరని చాలామందికి తెలీదన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది.

మొదటి చిన్నకథ వేదికలో చర్చ చక్కగా సాగిందన్న హుషారులో భానుమతి కథ ఎంచుకున్నాను రెండో చర్చకి. ఆవిడ హాస్యరచయితగా సుప్రసిద్ధులు కనక, వారిదే ఒక కథ తీసుకుని, ఆకథ ఆధారంగా మరింత విస్తృతపరిధిలో తెలుగు హాస్యంమీద చర్చ కొనసాగించాలని నా కోరిక. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


స్వార్థపరుడు – సింహావలోకనం

09/20/2010

ఈ చర్చలో పాల్గొన్న సాహితీమిత్రులు - సౌమ్య, లలిత (తెలుగు4కిడ్స్),  కొత్తపాళీ, సత్యవతి, వైదేహి. ఈ చర్చని జయప్రదం చేసినందుకు, మీకు ధన్యవాదాలు.

ఈ చర్చకి ధ్యేయం – ఒక కథలో వివిధ అంశాలు – ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – “లుండెడివి కావా?”

09/18/2010

(ఎన్నెమ్మకతలు 60)

సుప్రసిద్ధ రచయిత ముళ్ళపూడి వెంకటరమణగారు చాలా చాలా కాలం క్రితం, అంటే బ్లాగురులలో ముప్పాతికమంది పుట్టకముందే అడిగినప్రశ్న అది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


శారదగారికథ స్వార్థపరుడు (చర్చ)

09/11/2010

స్వార్థపరుడు (కథ)

ఈకథగురించి నాకు కలిగిన కొన్ని అభిప్రాయాలూ, ఆలోచనలూ నాముందు టపా, శారదమీద వ్యాసం రెండోభాగంలో కొంత చెప్పేను. మీరు మీ అభిప్రాయాలు రాస్తారని ఆశిస్తున్నాను.

గమనికః ఈ కథ చదివినతరవాత ఎవరికి ఎలాటి ఆలోచనలు వచ్చేయి, కథలో ఏవిషయాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అని తెలుసుకోడానికే మాత్రమే ఈ వేదిక. ఒకే కథని వేరు పాఠకులు వేరు వేరు కోణాలనుండీ పరిశీలిస్తారు. ఆ కోణాలు తెలుసుకోడమే నా ఉద్దేశ్యం కానీ ఒకరు తప్పూ, మరొకరు ఒప్పూ అని కాదు. అంచేత, ఈకథమీద మీకు తోచిన అంశాలు రాయడానికి మొహమాట పడకండి.

మాలతి


ఉత్తమశ్రేణి కథకుడు శారద (యస్. నటరాజన్) – 2

09/11/2010

స్వార్థపరుడు కథలో వకీలు విజయరాఘవరావు కూతురు పద్మకి ఒకే ఒక్క లోపం – పుటకతోనే చచ్చుపడిన కాళ్లు. విజయరాఘవరావు వారాలకుర్రాడు ప్రకాశాన్ని చేరదీసి మొదట వారాలు ఏర్పాటు చేసి, ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఉత్తమశ్రేణి కథకుడు శారద (యస్. నటరాజన్) -1

09/10/2010

శారద కలంపేరుతో తెలుగువారికి విజయవాడ, తెనాలి నేపథ్యంతో అద్భుతమైన కథలు అందించిన శారద కేవలం రాసింది ఏడేళ్ళపాటు, 1948 నించి 1955 వరకూ అంటే ఆశ్చర్యం కలక్కమానదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


చిన్నకథకొక వేదిక – ఆలోచనలు పంచుకోడానికి

09/08/2010

వారంరోజులుగా మాతృదేవో భవ (ఆర్. వసుంధరాదేవి) కథమీద చర్చ జరుగుతోంది ఇక్కడ. (ఈ చర్చ వ్యాఖ్యలలో ఈ టపాకింద చూడండి).  ఈ చర్చలో మంచి అంశాలు వేదికమీదకి వచ్చేయి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


పి. సత్యవతిగారి సమగ్రవ్యాసం నాకథలమీద

09/02/2010

ప్రముఖ రచయిత్రి పి. సత్యవతిగారు ఓపిగ్గా నాకథలు అన్నీ ఆసాంతం చదివి, రాసిన పరిశీలనాత్మక వ్యాసం సెప్టెంబర్, 2010,  భూమిక లో చూడండి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.