విశాలాంధ్రవారి ప్రచురణ – నా 22 కథల సంకలనం – కథల అత్తయ్యగారు అన్నపేరుతో
బజారులోకి వచ్చింది.
వివరాలు – వెల 70 రూపాయలు. 160 పేజీలు (ఈ వివరాలు అందించిన అనిల్ గారికి ధన్యవాదాలు.)
).
కవర్ పేజీ స్కాన్ చేసి అందించిన సుజాతకి ధన్యవాదాలు.
తా.క. avkf.org లో దొరుకుతోందంటూ, లింకు ఇచ్చిన లలితకి ధన్యవాదాలు.
ఆ లింకు ఇక్కడ చూడండి.
http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=3805
మాలతి

లలితా, ఇలా నాకథలు పిల్లలసైటుకి మీరు వినియోగించుకోగలగడం నిజంగా నా అదృష్టం. అవును, పిల్లలకి చెప్పేటప్పుడు ట ప్రత్యయం చేర్చడం, వాళ్ళు ఊ కొట్టడం కథకి అందాన్నిస్తాయి. ఇలాటి కథలని ఊకుడు కథలంటారని నిన్ననే చదివేను
).
అచ్చమాంబగారికథలమీద వ్యాసం రేపో ఎల్లుండో పెడతానిక్కడ. ఆవిడకథల్లో కూడా రెండు, మూడు పిల్లలకి పనికొచ్చేలా ఉన్నాయి. నావ్యాసం చూసినతరవాత మీరే నిర్ణయించుకోండి.
మరొకసారి, ధన్యవాదాలతో. – మాలతి
మాలతి గారూ,
ఈ కథ ఆడియో ఇక్కడ పెట్టాను.
నాకు కథ నచ్చింది. కానీ ఎందుకు నచ్చిందో అది నేను రికార్డు చేసేటప్పుడు అర్థం అయ్యింది.
“అలా జరిగిందట” అంటూ మీరు చెప్పించిన విధానం దాదాపుగా మొత్తం అలానే ఉంచి చదివాను.
నేను చాలా కథలు చదివి వినిపిద్దామంటే ఎందుకు నచ్చట్లేదో అర్థమయ్యింది.
కథ చెప్పే తీరు మార్చి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు.
మీ పుస్తకంలోని మిగతా కథలు చదువుతున్నాను.
ఎన్నో సార్లు తెర మీద చదువుతుంటే పుస్తకంలో ఉంటే బాగుండును అనిపించింది.
పుస్తకంలో చదివితే బావుంది.
వివరంగా అభిప్రాయాలు తీరిక చేసుకుని ఎప్పుడైనా రాస్తాను.
[...] [...]
@ లలిత, – మీరు నాకు (తెలుగు4కిడ్స్) కి అలాగే దొరికారు
– నేనా? హా. మీ ఆడియోలో చిలకలకొలికి కథ పెట్టండి తప్పకుండాను. నాకు గుర్తుండిపోయిన చాలాతక్కువ కథల్లో అదొకటి.
మాలతి గారూ,
మీ కథల అత్తయ్య కథ చదివాను.
మీరు నాకు (తెలుగు4కిడ్స్) కి అలాగే దొరికారు
తెలుగు మాటలు లో పెట్టటానికి మంచి (ఆడియో లో బావుండేవి)కథలు చాలా రోజులనించీ తట్టట్లేదు.
“చిలకల కొలికీ చినదానా” కథ audio story అక్కడ present చెయ్య వచ్చా?
కొత్తపాళీ, ధన్యవాదాలు.
చాలా చాలా సంతోషం. బోలెడేసి అభినందనలు. పేద్ద సంఖ్యలో అమ్ముడవ్వాలని కోరుకుంటున్నాను.
లలితా, మీకే ధన్యవాదాలు లింకు కూడా ఇచ్చినందుకు. నాకు పరమానందంగా ఉంది ఈమాత్రం స్పందన కనిపిస్తున్నందుకు.
మరొకసారి నన్ను అభిమానిస్తున్న పాఠకులందరికీ కృతజ్ఞతలు.
మీ
మాలతి
AVKF లో ఉందోచ్!
అభినందనలు మాలతి గారూ, కృతజ్ఞతలు కూడా
http://www.avkf.org/BookLink/3_week_new_titles.php?cat_id=11645
సునీతా, నాపుస్తకం కొన్నందుకు ధన్యవాదాలు. చదివి మీ అభిప్రాయాలు రాయగలరని ఆశిస్తున్నాను. – మాలతి
naenoo konnaanu.
@ మేధ, వవ్. నాపుస్తకం బుక్ ఫెయిర్ లో కూడా ఉందన్నమాట. థాంక్సండీ కొన్నందుకూ, ఆమాట నాకు అందించినందుకూ.. =))
)
@ మధురవాణి, ప్చ్ ఏం చేస్తాం. సరే. avkf. లో పెడతారేమో చూదాం.
మాలతి గారూ! కంగ్రాచ్యులేషన్స్!
నేను మొన్న సెప్టెంబరులో ఇండియాలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి తెలుగు పుస్తకాలు కొనుక్కోడానికి విశాలాంధ్రకి వెళ్ళితిని. మీ పుస్తకం జస్ట్ మిస్సయిపోయానన్నమాట! మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడే ఇహ కొనడం.
నేను మొన్న బుక్ ఫెయిర్ లో కొన్నాను
@ కల్పన, హాహా. కావలిసినవారు ఏమని పిలిచినా పలుకుతాం కదా!
@. సుజాతా, కవర్ పేజీ స్కాన్ చేసి పంపుతానంటే అంతకంటేనా … థాంక్స్ ముందే చెప్పేస్తున్నా. మాఅన్నయ్య పుస్తకం వచ్చిందని చెప్పేడు కానీ ఆ స్కానూ గట్రా అతనికి తెలీదు.
కథల అత్తయ్య గారూ, ఇక నుంచి క.అ. అనే పిలుస్తాను. కంగ్రాచులేషన్స్.
రేపే కొంటా! కవర్ పేజీ మీకు స్కాన్ చేసి పంపిస్తా! ఇదే ఇవాల్టికి నా శపథం!
అనిల్,
. వివరాలకి ధన్యవాదాలు. నాకు తెలీకుండా అంటే నేనింకా ఆ పుస్తకం కళ్ళతో చూడలేదని. లేదులెండియ నిజానికి మీరిచ్చినవివరాలు నాకు తెలీదు. ఇక అందరూ వెళ్ళి నాపుస్తకం కొనేసుకుని, మీ మీ అభిప్రాయాలు రాస్తారని ఆశిస్తున్నా
)
ఆశ్చర్యం.
మీకు తెలియకుండా మీ కథల పుస్తకం వెలువడడేమిటి?
ఇవి మరికొన్న వివరాలు:
కథల అత్తయ్యగారు పుస్తకం ..పేజీలు 160..ధర రూ 70.00