గత మూడేళ్ళగా తెలుగు తూలికని ఆదరిస్తున్న పాఠకమిత్రులకి
2011 నూతన సంవత్సరం శుభాకాంక్షలు, ధన్యవాదాలు
మాలతి
గత మూడేళ్ళగా తెలుగు తూలికని ఆదరిస్తున్న పాఠకమిత్రులకి
2011 నూతన సంవత్సరం శుభాకాంక్షలు, ధన్యవాదాలు
మాలతి
ఇక్కడ మూడు దిశలా విస్తరించుకున్న ఆకాశం కనుకొలుకుల్లో ఈ చివర్నించి ఆ చివరికి కనిపిస్తూ – హ్. అదొక అద్భుత అనుభవ. నాకు కలిగిన తొలి ఊహ, “అబ్భ, ఆకాశం ఎంత పెద్దదో” అని!! ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఎమెస్కోవారు ప్రచురించిన నా నవల నాకు చాలా నిరాశ కలిగించింది. ఎమెస్కో వంటి సుప్రసిద్ధ సంస్థ ఒకనవలని ఇంత అవకతవకగా ప్రచురించి బజారులో పెట్టగలదని నేను ఊహించలేదు. ఇప్పటికే కొందరైనా గమనించి ఉంటారు.
ఈ పుస్తకంలో జరిగిన పొరపాట్లు ఏమిటంటే – ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
జాకీ మిలార్ కి క్షమ కవచం మాత్రమే కాదు. పరమదుర్మార్గులలో కూడా మానవత్వం మేలుకొలిపి, వారిని మనుషులని చేయగల పరమౌషధం.
ఐదారేళ్ళక్రితం జూడీ తన స్నేహితురాలు జాకీ మిలార్‌గురించి చెప్పి పుస్తకం రాస్తున్నానని చెప్పినప్పుడు నాకు ప్రత్యేకంగా అనిపించలేదు. పుస్తకప్రచురణ అయినతరవాత నాకో కాపీ ఇచ్చినప్పుడు కూడా నేను వెంటనే చదవలేదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
“ఎక్కడికి మార్తావు?” – తొలి ప్రశ్న.
ఏమో… పక్కఊరికి కాపోతే ఊళ్ళోనే ఈకొసనించి ఆకొసకి, ఈ వీధినించి మరోవీధికి … ఎక్కడికైనా సరే మారాలి. అంతే. నాక్కావలసింది మార్పు. అంతే. ఎక్కడికి అన్నది నాక్కూడా తెలీదు.
అడిగినవాళ్ళు నవ్వేరు. కుక్క తోకని వేటాడినట్టుందని అనలేదు కానీ అలా అనుకుని ఉండడానికి అవకాశాలున్నాయి! ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
దాదాపు నాలుగు నెలలయిపోయింది మంచి కథ రాద్దాం అనుకుంటూనే. ఏదో రాయాలనే కానీ ఏం రాయాలన్నది తెలీడం లేదు. అంచేత నాకు తోచిందంతా రాసేద్దాం అనుకుని మొదలు పెట్టేనిది. ఇది నవల కాకపోవచ్చు. ఈమధ్య ఊసుపోక కూడా అట్టే సాగడంలేదు. అంచేత దానికి ఇది మరో రూపం అన్నా తప్పు లేదు. దేశం ఆమూలనించి ఈమూలకి వచ్చి పడ్డాక, అమెరికా మరోసారి కొత్తగా కనుగొన్నట్టుంది! ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
నా ఏకైక నవల చాతకపక్షులు కూడా ప్రచురణ అయిపోయిందనీ, బజారులో దొరుకుతోందనీ ఇప్పుడే జ్యోతిగారు ఈమెయిలిచ్చారు. వివరాలు కూడా అందించేరు, ముఖచిత్రం స్కాన్ చేసి.
ఆ వివరాలివిః
ఇందులో, డా. వైదేహి శశిధర్ ముందుమాట, డా. మధురవాణి, అన్నపూర్ణ గద్దె మంచిమాటలు కూడా ఉన్నాయి.
జరిగిన పెద్ద పొరపాటు – అన్నపూర్ణ బ్లాగు ఎడ్రెస్ పొరపాటున తప్పు ఇచ్చేను. అందుకు నాక్షమాపణలు. ఆమె బ్లాగు http://anu-parimalam.blogspot.com.
176 పేజీలు. వెల. 60 రూపాయిలు.
సాహితి (ఎమెస్కో) ప్రచురణ, విజయవాడ.
హైదరాబాదు బుక్ ఫేయిర్ లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకం ప్రచురణ కర్తలు : ఎమెస్కొ వారి స్టాల్స్: 103, 228, 229. (ఈవార్త అందించిన అనిల్ గారికి ధన్యవాదాలు.
వివరాలు, ముఖచిత్రం అందించిన వలబోజు జ్యోతి గారికి ధన్యవాదాలు.
మీ అందరి ఆదరాభిమానాలూ ఎప్పట్లాగే నాకుంటాయని ఆశిస్తూ
మాలతి
(ఎన్నెమ్మకతలు 64)
పట్టు పట్టరాదు, పట్టెనేని పట్టు విడువరాదు అని ఆర్యోక్తి. ఆ మాట వినే కావచ్చు తా పట్టినకుందేలికి మూడే కాళ్ళంటూ పట్టు పట్టి ప్రాణంమీదికి తెచ్చుకున్నాడు ఓ బుద్ధిమంతుడో మందబుద్ధో … ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఒకే పుస్తకానికి రెండు అనువాదాలెందుకు అని సౌమ్య అడుగుతోంది. ఈమధ్యనే అఫ్సర్ గారి బ్లాగులో సంకలనకర్తల, సంపాదకుల బాధ్యతలగురించి చర్చ మొదలయి, చాలా అభిప్రాయాలు తెలుసుకోడానికి అవకాశం కలిగింది. మొదటి ప్రశ్నా, రెండో చర్చా చూసినతరవాత నాకు నిరంకుశో కవయః అన్నది మార్చి నిరంకుశో సంపాదకః మరియు అనువాదకః అనడం సబబేమో అనిపిస్తోంది! ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
బలివాడ కాంతారావుగారిగురించి ప్రత్యేకవ్యాసం, తదితర కథలు.
తూలిక.నెట్ లో
చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు
- మాలతి