“లోకంలో నీతీ న్యాయం – రెండూ సమాజశ్రేయస్సుకే అయినా రెంటికీ పొత్తు లేదెంచేతో,” అంది సిరి ఎటో చూస్తూ.
“ఏం ఈ రోజు, న్యాయాన్యాయాలవేపు మళ్ళింది బండి,” అన్నాను పక్కనే కూర్చుంటూ. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
“లోకంలో నీతీ న్యాయం – రెండూ సమాజశ్రేయస్సుకే అయినా రెంటికీ పొత్తు లేదెంచేతో,” అంది సిరి ఎటో చూస్తూ.
“ఏం ఈ రోజు, న్యాయాన్యాయాలవేపు మళ్ళింది బండి,” అన్నాను పక్కనే కూర్చుంటూ. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
నా కథల అత్తయ్యగారు సంకలనంమీద సమీక్ష వచ్చింది ఆదివారం సాక్షిలో.
స్కాన్ చేసి ఇచ్చిన జ్యోతిగారికి కృతజ్ఞతలు. సమీక్షకురాలు సి. ఉమాదేవి గారికి ధన్యవాదాలు.
ఆదివారం సౌజన్య ఇంటికి వెళ్ళేను, నాస్నేహితురాలితో.
మేం వెళ్ళేసరికి ఓ పదిమంది ఉన్నారు. సుధ చనువుగా లోపలికి వెళ్ళి నలుగురినీ పలకరిస్తోంది. నేను సందేహిస్తూ వెనక నించున్నాను. ఇంతలో ఒకావిడ నావేపు వస్తూ కనిపించింది. ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ పరకాయించి చూస్తున్నాను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
(ఎన్నెమ్మకతలు 66)
నిజంగా భావముద్ర అన్న అర్థం చెప్పుకోవచ్చో లేదో నాకు తెలీదు కానీ బాగుందనిపించి, “ఇంప్రెషన”న్న పదానికి సమానార్థకంగా వాడుతున్నా. ఇంప్రెషనంటే ఒక మనిషో ఒక సంఘటనో మన మనోఫలకముపై యాదృచ్ఛికముగా గానీ స్వేచ్ఛగా గానీ వేయు ముద్ర అనుకోండి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
భండారు అచ్చమాంబగారి జీవితకాలం 1874 నుండి 1905 వరకు. గురజాడ అప్పారావుగారికంటే ముందే అచ్చమాంబగారు 1898లో ఆధునిక తెలుగు కథకి శ్రీకారం చుట్టేరని ఒక వాదన. ఈవాదన మాట ఎలా ఉన్నా, ఈనాడు కనీసం ఆమెగురించి కొంతవరకైనా మనకి తెలిసే అవకాశం దొరికింది. తెలుగు కథాసాహిత్యంలో చారిత్ర్యకంగా ఈకథలకి ప్రత్యేకమయిన స్థానం ఉంది. ఆమె రచనలమీద సుమారు పదేళ్ళుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
(ఎన్నెమ్మ కతలు 65)
చాలాకాలం తరవాత ఓ పుస్తకం పట్టుక్కూర్చున్నాను. ఎంతసేపూ రాయడమే అయితే ఎలా? చదివితేనే కదా కొత్త ఊహలు కలిగేది అనుకుంటూ.
“బావున్నారాండీ?” అంటూ తారకం వచ్చేడు.
ఆ వెనకే, “బాబుగోరిని సూసి నానొచ్చిన” అంటూ సంద్రాలు ప్రవేశించింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
“నిన్ను చూసి ఆరేళ్ళయింది. నాకయితే ఏళ్ళూ పూళ్లూ అయినట్టుంది. బొత్తిగా రాడం మానేశావు? ఈ ఏడయినా ఒకసారి రాకూడదుటే?”
అలనాటి చెలి కామేశ్వరి రాసిన ఉత్తరం చేత పుచ్చుకుని దిగంతాల్లోకి చూస్తూ కూర్చుంది శాంత, గతించిన రోజులు తలబోసుకుంటూ. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »