thulika.net మార్చి 2011

02/28/2011

కొత్త వ్యాసాలతో కథలతో thulika.net మార్చి సంచిక ఇక్కడ చూడండి.


మార్పు 10

02/26/2011

ఆదివారం మధ్యాహ్నం. టైము నాలుగయింది. దారిన పోతూ పార్క్ దగ్గర ఆగేను. పిల్లలు సాకరాడుతున్నారు. పిల్లల తల్లులూ, తండ్రులూ, స్నేహితులూ ఆట చూస్తూ, పిల్లలకి హుషారిస్తూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. ముచ్చటేసే దృశ్యం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


సాక్షిలో డలస్ సభవిశేషాలు

02/22/2011

ఈ లింకు చూడండి.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=13220&Categoryid=14&subcatid=59


తెలుగుకథ తీరుతెన్నులు

02/20/2011

తెలుగుకథ తీరుతెన్నులు

కథ తీరుతెన్నులు ఈ నాటి అంశం. అసలు కథంటే ఏమిటి? ఏది కథ, ఏది కథ కాదు? చూద్దాం.

ఈరోజుల్లో విమర్శకులూ, సంపాదకులూ, ఒకొకప్పుడు పాఠకులూ కూడా కథంటే ఇలా ఉండాలి, ఈ లక్షణాలు ఉంటేనే కథ అవుతుంది అని నిర్ధారణ చేస్తున్నారు.

ఆ లక్షణాలు –  క్లుప్తత, వస్త్వైక్యత, సమయైక్యత, నిబద్ధత, సాంద్రత. రెండోస్థాయిలో పరిశీలించేవి నిర్వహణ లేక నడక, ఆవరణ, పాత్రపోషణ, ముగింపు. వీటికి తగినట్టుగా సన్నివేశాలు. సంఘర్షణా ఉన్నాయా లేవా అన్నది పరిశీలిస్తారు విమర్శకులు. మరోలా చెప్పాలంటే కథకి ప్రధానాంగాలు – ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు. ఉపాంగాలు - ఆవరణ, పాత్రచిత్రణ, భాష. ఈ భాష అన్నది మళ్ళీ చాలా విస్తృతమయిన విషయం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


తెలుగుకథ తీరుతెన్నులు – రెండోభాగం

02/20/2011

(తొలిభాగం ఇక్కడ)

వీరేశలింగంగారి చివరిదశలో అంటే 1875లో పుట్టిన భండారు అచ్చమాంబగారు ఆయనరచనలతోనే ప్రభావితురాలయినా ఆయన ఉపదేశాలను యథాతథంగా స్వీకరించలేదు. ఆవిడ సృష్టించిన స్త్రీపాత్రలు బలమైన వ్యక్తిత్వాలు గలవి. కేవలం భర్తలసేవలకి అంకితమయినవారు కారు. పిల్లలని బుధ్ధిమంతులుగానూ, విద్యావంతులుగానూ తీర్చిదిద్దడమే కాక తప్పిదం చేసిన భర్తలతో మంచిచెడ్డలు వితర్కించి, వారిని సన్మార్గంవేపు, ధర్మవర్తన వైపు నడిపించినవారు. బహుశా ఇది ఈనాటి స్త్రీవాదనకి నాంది కావచ్చు. ఈ కథలగురించి మరింత విపులంగా తరవాత చర్చిస్తాను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


మార్పు 9

02/14/2011

శ్రీదేవి మాటలే నామనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. ఒక మనిషి మరొక మనిషిని ఎందుకు బాధిస్తాడు, నేను ఆమనిషిని బాధ పెడుతున్నాను, ఎదటివాడి నొప్పి నాకానందం” అన్న స్పృహతో చేస్తాడా? లేక యాదృచ్ఛికంగా జరుగుతుందా బాధించడం అన్నది? ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


భండారు అచ్చమాంబగారి కథల్లో ఏముంది?

02/07/2011

అచ్చమాంబగారి కథలు సుమారు పదేళ్ళుగా చర్చల్లో కనిపిస్తున్నాయి. అబలా సచ్చరిత్రరత్నమాల పేరు నాకు పరిచితమే అయినా కొండవీటి సత్యవతిగారి వ్యాసం నాలుగేళ్ళక్రితం చూసేకే, అచ్చమాంబగారి కథలగురించి తెలిసింది. అప్పటినుండీ నాకు ఆసక్తి కలిగింది. ఈకథలు ఈనాటి పాఠకులు ఆదరిస్తారా లేదా, ఆదరిస్తే, ఏ కారణాలవల్ల అని. అందుకే ఇక్కడ పెట్టి మీ అభిప్రాయాలు కోరేను. లలితగారి స్పందన మీరు చూసే ఉంటారు.  చూడకపోతే ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


మార్పు 8

02/05/2011

మార్పు 8

నాలుగురోజులయింది వీధిలో అడుగెట్టి. “నువ్వే మీ విస్కాన్సిన్ మంచు తీసుకొచ్చేవు మాప్రాణాలమీదకి” అంటూ నన్నే దెప్పుతున్నారు నా సన్నిహితులు, తదితర సారమతులూను.

నిజం చెప్పొద్దూ నాకు మంచు కురిసిన తొలిరోజు చాలా హుషారుగానే ఉండింది కానీ గత మూడురోజులనించీ నరకం మొదలయింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.