13వ శతాబ్దంలో రుద్రమదేవి పరిపాలనలో కాకతి సామ్రాజ్యవైభవం కథ ఇది. రుద్రమదేవి పట్టాభిషేకం మొదలు ఆరు సంవత్సరాలపాటు ఆమె ఆధిపత్యంలో రాజకీయ, సాంఘిక, సాహిత్యప్రతిభ ఆవిష్కరించారు నోరి నరసింహశాస్త్రిగారు.
మార్పు 13
03/22/2011ఇక్కడికొచ్చేక మరో పెద్ద మార్పు ఏది కొన్నా రెండోసారీ, మూడోసారీ షాపువాడితో “యిచ్చిపుచ్చుకోడాలు” చెయ్యాల్సొస్తోంది. మంచం అయితే నాలుగుసార్లు మార్చాల్సివచ్చింది. మారోజుల్లో అంటే అదేలెండి నాచిన్నతనంలో పరుపు అంటే పరుపు అంతే. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
చరిత్ర, చారిత్రక నవల
03/21/2011చరిత్రంటే తారీకులూ దస్తావేజులూ కావంటారు శ్రీశ్రీ.. చరిత్రకీ చారిత్రిక నవలకీ తేడా ఉందంటారు కవిసామ్రాట్ నోరి నరసింహశాస్త్రిగారు.
తెలుగు నవలకి ఆద్యం లార్డ్ మేయో బెంగాలీలని వారి సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే నవలలు రాయమని కోరడం అని ఆరుద్ర రాశారు (సమగ్రాంధ్రసాహిత్యం సం. 4). ఒక జాతి సంస్కతీ సాంప్రదాయాలనీ, ఆచారవ్యవహారాలని నవలలు చెప్పినంత వివరంగా చరిత్ర చెప్పదు అని మేయో అభిప్రాయం అనుకుంటాను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
మార్పు 12
03/16/2011లీలకి నవ్వు రాలేదు. ఏడవాలనుంది కానీ అదీ రాడం లేదు. నగరివాకిట నుండు నల్లగుండులాటిదేదో గుండెల్ని పట్టి దిగలాగుతున్నట్టుంది. కారుమేఘాలు తరుముకొస్తున్నట్టుంది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
మార్పు 11
03/08/2011“నవ్వెప్పుడొస్తుందో చెప్పడం కష్టం,” అన్నాన్నేను.
“నవ్వెప్పుడు రాదో చెప్పడం కూడా కష్టమే,” అంది అరు.
“నువ్వినలేదేమిటి ఇటీవలి లీలాసుందరులవృత్తాంతం” అంది సిరి.
“లేదు. ఏమాకథ? వినుటకుత్సాహంబయ్యెడిని, చెప్పు చెప్పు చెప్పు చెప్పూ” అన్నాను హుషారుగానూ మరియు పూర్వపు బాణీ నెమరేసుకుంటూను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
మాలతి యొక్క టపా