“శనివారం మీకేం పన్లేదూ?”
“హా. అదేం ప్రశ్న? నాకు పనుందో లేదో నీకిప్పుడు ఎందుకింత అర్జంటుగా కావలసివచ్చిదీ?”
“అది కాదండీ. తప్పనిసరిగా నేను మీయింటికి రావలసిన అవసరం మీకేమీ లేదా అని.” ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
“శనివారం మీకేం పన్లేదూ?”
“హా. అదేం ప్రశ్న? నాకు పనుందో లేదో నీకిప్పుడు ఎందుకింత అర్జంటుగా కావలసివచ్చిదీ?”
“అది కాదండీ. తప్పనిసరిగా నేను మీయింటికి రావలసిన అవసరం మీకేమీ లేదా అని.” ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
(ఎన్నెమ్మకతలు 69)
ప్రేమే నేరమౌనా అని ఓపాత సినిమాపాట ఉంది చూడండీ, అలాగన్నమాట.
మనం వెనక్కి తిరిగి చూసుకోకూడదా? వెనక్కి చూస్తే అది తిరోగమనవాదమా?
చివరికి మిగిలేది జ్ఞాపకాలే కాదా?
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?
గతమెంతొ మేలు వచ్చు కాలముకంటెన్ … ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
నాలుగోఝామున లేచి
తొలికాఫీతో వరండాలోకెళ్తే
కనిపించిన సుందరదృశ్యం ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
“బాగున్నావా? చాల్రోజులయింది చూసి,” అన్నాడు ప్రభాస్రావు.
సుందరం ఉలికిపడి అటుతిరిగి, “ఓ, అంకుల్, ఆ, బాగానే ఉన్నానండి. అవును ఎప్పుడు చెప్మా … కనీసం నాలుగేళ్లయిఉండాలి, ఆంటీ, విషీ, అందరూ బాగున్నారా?” అన్నాడు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
(ఎన్నెమ్మ కతలు 68)
విన్నారా ఈ జోకు. పెళ్ళిచూపులనాడు మధ్యవర్తి “అమ్మాయి సిన్మాతారలా ఉంటుంది,” అన్నాట్ట అబ్బాయితో.పెళ్ళిచూపులయినతరవాత పెళ్ళికొడుకుమాట, “సినీమాతారలా ఉంటుందంటే వైజయంతీమాలలాగో విజయనిర్మలలాగో ఉంటుందనుకున్నాను. సూరేకాంతంలా అనుకోలేదు” అని. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
(ఎన్నెమ్మ కతలు 66)
ఈమధ్య సౌమ్య తాను చూస్తున్న కొత్త ఊరుగురించి తెగ ఊరించేస్తుంటే, నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది నేను కూడా ఇలాటివేవో రాసేనని. తిరిగి చూసుకుంటే తనలా మురిసిపోతూ రాసింది తక్కువే అని కూడా అర్థమయింది. ఇదుగో ఇలాటప్పుడే మనం చిన్నవాళ్ళదగ్గర్నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని నాకు నేను చెప్పుకుంటాను. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
కూరలబజారులో లీల ఏం కొనడానికొచ్చిందో మర్చిపోయి షెల్ఫులమీద వరసగా పేర్చిన సీసాలూ, ప్లాస్టిక్ పొట్లాలూ, అట్టపెట్టెలూ చూస్తూ నెమ్మదిగా అడుగులేస్తోంది సంతలో తప్పిపోయిన బాలుడిలా.
అంతలో ఎవరో ఎదురుగా నిలుచున్నట్టయి, ఉలికిపడి ఆగిపోయింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఖరనామ సంవత్సరం అడుగుపెడుతూనే, నా సరికొత్త సంకనలం చేతిలోకి రావడం నాకు శుభసూచకంగా ఉంది.
లేఖిని మహిళా చైతన్య సాహితి, సాంస్కృతిక సంస్థ (హైదరాబాదు)వారు పూనుకుని నా అనువాదాల సంకనలం ప్రచురించారు.
ఆ సంస్థకి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి. అధ్యక్షురాలు డా. వాసా ప్రభావతి.
పుస్తకానికి ముందు మాట రాసినవారు ప్రముఖ రచయిత, విమర్శకులు అయిన కేతు విశ్వనాథ రెడ్డిగారు.
అందమైన ముఖచిత్రం ప్రముఖ రచయిత, కవి, చిత్రకారులు శీలా వీర్రాజు గారు వేశారు.
ప్రభావతిగారి రెండవ అమ్మాయి లక్ష్మి నిన్న నాకు అందించారు ఈ సంకలనం.
నేను తూలిక.నెట్ లో ప్రచురిస్తున్న అనువాదాల సంకలనాలలో ఇది మూడోది. ప్రచురణకర్తలలాగే పాఠకులు కూడా ఈ సంకనలనాన్ని ఆదరించగలరని ఆశిస్తూ …
- మాలతి
వివరాలు ఇవి -
ప్రచురణ, కాపీలకు -
Lekhini Mahila Chaitanya samithi
11/2 RT Municipal Colony
Hyderabad – 500 036, Andhra Pradesh, India
పేజీలు 208.
వెల 150 రూపాయలు. 10 డాలర్లు.