ఊసుపోక – అమ్మాయి సిన్మాతారలా ఉందంటేనూ…

(ఎన్నెమ్మ కతలు 68)

విన్నారా ఈ జోకు. పెళ్ళిచూపులనాడు మధ్యవర్తి “అమ్మాయి సిన్మాతారలా ఉంటుంది,” అన్నాట్ట అబ్బాయితో.పెళ్ళిచూపులయినతరవాత పెళ్ళికొడుకుమాట, “సినీమాతారలా ఉంటుందంటే వైజయంతీమాలలాగో విజయనిర్మలలాగో ఉంటుందనుకున్నాను. సూరేకాంతంలా అనుకోలేదు” అని.

నిజానికి సూర్యకాంతంలా ఉందంటే ఎగిరి గెంతేసి చేసుకోవాల్సిన మాట. సూరేకాంతంగా ప్రసిద్ధికెక్కిన సూర్యకాంతంగారు స్వతహాగా సాత్వికురాలు. ఎటొచ్చీ ఆవిడ ధరించే పాత్రలమూలానా ఆవిడకి ఆ దుష్కీర్తి ఆపాదించబడింది.

నేను అదేదో సినిమాలో సుజాతలా ఉంటాననుకున్నానని స్ఫురిత అంటే నాకు చాలా నవ్వొచ్చింది. ఆ టపా చదివిన చాలామంది కూడా నవ్వుకునే ఉంటారు. అంటే హేహే అంటూ హేళనగా కాదు. “చాలా ఫన్నీగా చెప్పేరండీ” అనీ. అసలు “నారాతలు” చదివేవాళ్ళందరికీ తెలుసే ఉండాలి స్ఫురిత అలాగే రాస్తారని.

నేను ఆ టపామీద వ్యాఖ్యలు కూడా చూశాక ఇది రాయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నాక్కూడా అలాగే ఉంటుంది అని చెప్పడానికి. మరి ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆఊరూ అంతే దూరం కదా. (మధ్యలో వన్వేలూ, డునాట్ ఎంటరులూ తగిల్తే తప్ప. అవుంటే ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం కాదు. మరో మైలో మైలున్నరో ఎక్కువ అగును!)

ఇంతకీ ఎవరైనా కొత్తవారు వస్తున్నారంటే నాక్కూడా చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి. చిన్న పిరికితనం కూడా పొడ సూపుతుంది మనసులో – ఏమడుగుతారో, ఏ సమాధానం చెప్తే ఏ కొంపలు ములుగుతాయో అనీ.

ముందోసారి రాసేను చూడండి “నాతో నేను ఇంటర్వ్యూ” – ఇంచుమించు అలా ఊహించుకుంటానన్నమాట.

“సౌశీల్యద్రౌపదిమీద మీ అభిప్రాయం ఏమిటి?”

“రామాయణకల్పవృక్షం ఈనాటి పరిస్థితులకి అన్వయించుకోవచ్చా?”

“ఈనాటి సాహిత్యం ఏదిక్కుగా పయనిస్తోంది?”

ఇలా ప్రశ్నలమీద ప్రశ్నలు కుప్పించేసి, నేనేమో “తెలీదు”, “తెలీదు” అనుకుంటూ పోతే, “ఈమాత్రందానికి రమ్మనడం ఎందుకూ?” అని విసుక్కుంటూ విసవిసా నడిచిపోతారేమోనని. మళ్ళీ జన్మలో వాళ్ళని చూడనేమోననీ నా భయం. ఆతరవాత నారాతలు అంటే నావే చదవడం మానేస్తారేమోనని కూడా భయం.

లేదా, ఇలాటి కఠినప్రశ్నలు కాక, తేలిగ్గా, “పోనీ మీకు ఇష్టమయిన రచయితలపేర్లు చెప్పండి” అని అడిగినప్పుడు కూడా నాకు గుండెల్లో బితుకుబితుకుమంటూనే ఉంటుంది. వాళ్ళకి ఇష్టమయిన రచయితల మరియు రచయిత్రులపేర్లు చెప్పలేనేమో, నేను చెప్పిన పేర్లు వాళ్ళకి యిష్టం కాదేమో నని. పైగా ఈమధ్య ఇంగ్లీషురచయితలపేర్లు చెప్పకపోతే కూడా పరువు పోయేలా ఉంది. అదీ ఇదీ కాకపోతే వాళ్ళే ఏవో రచయితలపేర్లు చెప్తే, అవి నా “నో నో” లిస్టులోవి అయిఉండొచ్చు. (నా నోనో లిస్టు చాలా పెద్దది లెండి.­)

అసలు ఒకమనిషిని కలుసుకోడానికి వెళ్తున్నాం అనగానే ముందు ఆ మనిషి చూడ్డానికి ఎలా ఉంటారో ఊహించుకుంటాం. అదేం ఖర్మో గానీ మంచివాళ్ళన్నా, మనకి ఏదో విధంగా నచ్చినవాళ్ళన్నా బహు సుందరమైన మొహం మనసులోకి వస్తుంది. (అదే) ఖర్మ కాలి, వాళ్ళగురించి ఏదైనా చెడు వినుంటే, పరమ కర్కోటకులు కాకపోయినా, అందమయిన మొహం మాత్రం మనసులోకి రాదు. సగటుమొహానికి దింపేస్తాం.

ఆ తరవాత ఇల్లు – ఆ రచయితకథల్లోలాగే మహా భవనాలు కాకపోయినా, ఎంతో నీటుగా సర్దబడి, గోడలమీద అందమైన బొమ్మలతో ప్రసిద్ధ డైరెక్టరు తీయబోయే కొత్తసినిమాకి అప్పుడే వేసిన సెట్టులా ఉంటుంది.

ఆపైన ఎంతో ఖరీదైన పళ్లేల్లో తాజా తాజాగా చేసిన పిండివంటలతో, పానీయాలతో ఆదరిస్తారు.  అల్పాహారాలంటే మీకు నవ్వుగా ఉండొచ్చు కానీ తినడానికి పెట్టే తిండి సర్వదా ఆనందదాయకం కాకపోవచ్చు. చూస్చూసి బాగులేదనలేం.

ఓసారి ఎవరింటికో వెళ్తే, అదేదో ఆరోగ్యకరమైన పానీయం ఇచ్చారు. చూడ్డానికి ఆకుపచ్చగానూ,  తాగబోతే వగరుగానూ ఉంది. ఈమధ్య ఆకుపచ్చ ఎర్త్ డేకి గుర్తయింది కానీ చాలాకాలంగా పచ్చరంగుకీ ఐరిష్ బీరుకీ పొత్తు.

ఇంతకీ నాకు ఆరోజు ఇచ్చింది అదో రకం నేచర్ డ్రింకుట. నాకు మరీ అంత ఆరోగ్యకరతిళ్లు అలవాట్లు లేవు. కళ్ళు మూసుకు తాగేసి, బాత్రూంలోకెళ్ళి నీళ్ళు పుక్కిలించి ఉమ్మేసేవరకూ తోచలేదు నాకాపూట. ఇది సర్వసాధారణం కాదు లెండి. ఇలా జరగొచ్చని చెప్తున్నానంతే. నిజానికి చాలామంది ఇళ్ళల్లో మనకి చాలా చాలా ఇష్టమయినవే ఉంటాయి. ఆ కారణంచేత మళ్ళీ మళ్ళీ వాళ్ళింటికెళ్ళి వాళ్లని చూడాలనిపిస్తుంది కూడా. మరి వాళ్ళకి కూడా అలానే ఉంటుందా అంటే నేనేం చెప్పలేను.

అసలు నిజం చెప్పమంటారా? “మిమ్మల్ని చూడాలనుందండీ” అంటూ మాయింటికి వచ్చేవాళ్ళని ఒక్కచేతివేళ్ళమీద లెక్కెట్టొచ్చు. కదాచితుగా, తమకి తాముగా అనుకోకపోయినా, మరొకరితో వచ్చి, నాకు చాలా స్నేహితులయిపోయినారు కూడా ఉన్నారు. అసలు మాయింటికి రాకుండానే ఆప్తులయిపోయినవారు కూడా ఉన్నారు. వీళ్ళకి నామొహం ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిన అవుసరం లేదు, హీహీహీ.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, స్ఫురితటపాలో కుమార్ యన్ వ్యాఖ్య చూసి, చెప్పాలనిపించింది. లేదండీ, నేను కూడా మీలాగే నా అరకొర పుస్తకజ్ఞానంతోనూ, వీళ్ళకున్న కాస్త సరదా మట్టు పెట్టేస్తానేమో, నామీద ఉన్న కాస్త గౌరవం ఊడ్చుకుపోతుందేమోనుకుంటూనూ ఉంటాను. అంచేత మీరలా అనుకోనఖ్ఖర్లేదు. J).

స్ఫురితా, మీరు మీవారితో మాఇంటికి వచ్చినందుకూ, ముచ్చటగా టపా రాసినందుకూ చాలా సంతోషం.

(ఈ టపాకి నేను స్ఫురితగారిని చూశానోచ్ అని పెట్టాలనుకున్నాను కానీ కాపీరైటు గొడవలొస్తాయేమోనని … :p)

(ఏప్రిల్ 13, 2011)

12 Responses to ఊసుపోక – అమ్మాయి సిన్మాతారలా ఉందంటేనూ…

  1. సి వి ఆర్ మోహన్ అంటున్నారు:

    క్షమించాలి

    మోహన్

  2. మాలతి అంటున్నారు:

    @ ఉష, మీ ఆదరాభిమానాలకి మరోసారి ధన్యవాదాలు. అవును. మీరు నాకో విడిటప్పున్నారు :) ). ఇప్పుడు దూరం ఎక్కువయింది కానీ ఏమో ఎప్పుడో జరుగుతుందనే అనుకుంటాను. మీ మాలతి.

  3. ఉష అంటున్నారు:

    ఇద్దరి మాటా చదివాను కామెంట్స్ తో సహా. పూతరేకులు – రేగివడియాలు గుర్తుకు తెప్పించారు. నిజానికి నిన్ననే మీ వంట ముఖ్యంగా కందిపొడి ఊరింపు, నా వసపిట్ట వాగుడు మాట ప్రస్తావించి ఇచ్చిన హెచ్చరింపు, మా అమ్మాయి “గుర్తుందా? ట్రిప్ అన్నావు?” బెదిరింపు గుర్తొచ్చి మరొక మిత్రునితో అన్నాను మాలతి గారి దగ్గరకి వెళ్ళాలీయేడు అని. అందుకే జిమ్ కి తప్పక హాజరౌతున్నాను. :) కలవని ఒకరిని ఊహించటం చిత్రమైన అనుభూతి – నా బ్లాగు రచనలు చదివి ఒకరు, లావుగా సోడాబుడ్డి కళ్ళద్దాల డెబ్బయ్యో పడి మహిళని ఊహిస్తే, మరొకరు పాతికలోపు యువతి అనుకున్నాము అన్నపుడు నాకూ నవ్వొచ్చింది. మన అక్షరాలో లేక వారు చూసిన సినిమాల/అనుభవాల తాలూకు ప్రభావమేగా అని. అడపాదడపా వచ్చిపోతున్నాను కానీ వ్యాఖ్యలకి ఒళ్ళు కాస్త వంగటం లేదు – మీ రచనల తాజాదనం మాత్రం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

  4. సి వి ఆర్ మోహన్ అంటున్నారు:

    ఈ వ్యాఖ్య నా టపాకి సంబంధించినది కానందున తొలగించబడిందని గ్రహించగలరు. – ఎడ్మిన్.

  5. మాలతి అంటున్నారు:

    @ మాధురి, I am sorry, I also experimented with several ways and found it impossible to make the change in fonts. WordPress does not have the built in facility to make the fonts bigger. You can do it on your computer in a couple of ways though. 1. Hold the control key and press + sign. Or in the view menu, you can click on large fonts. Hope this helps.

  6. madhuri అంటున్నారు:

    can you please make the size of the letters in the comments section a bit bigger? i’m finding it difficult to read the too small letters.

    regards.

  7. మాలతి అంటున్నారు:

    @ రాజేష్ జి, కుమార్ నారింజపండంటే మీరు సీతాఫలం అంటున్నారు. బాగున్నాయి మీ ఇద్దరి సృజనాత్మకత :) ). ఈసారి మీరు కానీ మరొకరు కానీ వచ్చినప్పుడు నేను కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఏమిస్తున్నాను, అది వారికెలా ఉంటుంది అన్నది చెప్పకయే చెప్పేరు, హీహీ.
    సంతోషమండీ. మీలాటి ఆదరాభిమానాలే నాచేత రాయిస్తున్నాయి. నాచేతిలో ప్రత్యేకంగా ఏమీ లేదు ఐదువేళ్లు తప్ప. ధన్యవాదాలు. – మాలతి.

  8. మాలతి అంటున్నారు:

    @ కుమార్ యన్, ఇక్కడ కూడా చిన్న ఊరేనండీ. నిజంగా డలస్ ప్రాపర్ కాదు. @తాళాలు. అలాగే తాళాలు వెయ్యను, రండి. మీఊళ్ళో సినిమా తప్పితే లైబ్రరీయే అంటే మందేవూరు అని అడగనులెండి. ఆంధ్రాలో నూటికి తొంభైతొమ్మిది అంతే కదా. ఎటొచ్చీ మీరు చెట్లంటా పుట్లంటా తిరక్కుండా చల్లగా పుస్తకాలమధ్య కాలం గడపడం చాలా నచ్చింది నాకు. నారింజపండులా .. బాగుందండీ ఉపమానం. మీరొచ్చినప్పుడు మీతలమీంచి వెళ్లిపోయినవేవో కనుక్కుని వాటిని కూడా పండులా చెయ్యగలనేమో చూస్తాను. ఇది నాకు నేనే ఇచ్చుకుంటున్న పరీక్ష :) ).
    మీ అదరాభిమానాలకి ధన్యవాదాలు. – మాలతి
    @

  9. రాజేష్ జి అంటున్నారు:

    $మాలతి గారూ

    నాదీ కుమార్ గారి మాటే!

    మీ చేతికు౦డే మాయ ఏ౦టో కానీ, పక్కన కూర్చొని సీతాఫలం మీగడలాంటి గుజ్జు తీసి తినిపిస్తున్నట్లుగా తియ్యగా, మధురంగా ఉ౦టాయి మీ కబుర్లు.

    #పెళ్ళిచూపులనాడు మధ్యవర్తి “అమ్మాయి సిన్మాతారలా ఉంటుంది,” అన్నాట్ట అబ్బాయితో.పెళ్ళిచూపులయినతరవాత పెళ్ళికొడుకుమాట, “సినీమాతారలా ఉంటుందంటే వైజయంతీమాలలాగో విజయనిర్మలలాగో ఉంటుందనుకున్నాను. సూరేకాంతంలా అనుకోలేదు” అని

    సందర్భోచితమైన ఉపమానం. కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ఇక్కడ :) )

    #కళ్ళు మూసుకు తాగేసి, బాత్రూంలోకెళ్ళి నీళ్ళు పుక్కిలించి ఉమ్మేసేవరకూ తోచలేదు నాకాపూట.
    :) ) .. నాకు ఇలా ఎన్నో అనుభవాలు కొందరు జీవుల చేతుల్లో చిక్కి ;)

  10. KumarN అంటున్నారు:

    వావ్ మాలతి గారూ, మీ చేతికు౦డే మాజిక్ ఏ౦టో కానీ, పక్కన కూర్చొని నారి౦జ ప౦డు తొనలు తీసి తినిపిస్తున్నట్లుగా ఉ౦టాయి మీ కబుర్లు. అ౦త సరళ౦గానూ, అ౦తకన్నా తియ్యగానూ!! అనితరసాధ్య౦. (వామ్మొ నాకిట్లా౦టి క్లిష్టమయిన పదాలుపయోగి౦చాల౦టే భయ౦, అ౦దునా మీతో!!!)

    గత మూడు స౦వత్సరాల్లో మీరు ఇక్కడ రాసినవన్నీ కూడా చదివే ఉ౦టాను(భారీ సబ్జక్టులు, నా నెత్తి మీద ను౦చి వెళ్ళీపోయే విషయాలు తప్ప….హ హ హ అట్లయితే రె౦డో, మూడో చదివి ఉ౦టావ్ లేవోయ్, పుల్లారావ్ అనుకు౦టున్నారా)

    అబ్బే, మీరు ఇప్పుడా నాకు తెలిసి౦ది?, మా ఊరికున్న ఏకైక వినోద మార్గ౦(సినిమా హాల్ వచ్చేదాకా) లైబ్రరీ లో నేను నిక్కర్లు వేసుకొనెప్పుడే తెలుసు నాకు. అ౦దుకని చాలానే చదివాను. అయితే మీరిక్కడ అమెరికా లో ఉన్నారన్న స౦గతి తెలియటమ్ నాకు ప్లజ౦ట్ సర్ప్రయిజ్.

    మీరు డల్లాస్ మూవ్ అయ్యారని తెలిసినప్పుడు కొ౦చె౦ సాడ్ గా ఫీల్ అయ్యాను. విస్కాన్సిన్ లో, మాడిసన్ చల్లటి ప్రదేశ౦ అయినా చక్కగా స్మాల్ టౌన్ ఫీల్ ఉ౦డదూ? నాకు మరీ పెద్ద నగరాల౦టే….. విజిట్ చేయటానికి తప్ప, నివసి౦చటానికి ఇష్టపడను. కాని, మీరిప్పుడు నాకు ఎనిమిది గ౦టల దూరమే..జాగ్రత్త..తాళ౦, తాళ౦చెవి లు ఎప్పుడూ దగ్గరే పెట్టుకొని పడుకో౦డి. నేనొస్తున్నానని తెలియగానే తొ౦దరగా బయటపడటానికి పనికొస్తు౦ది :-) )). నాకసలే ము౦దు చెప్పే అలవాటు లేదు మరి…ఇ౦డియా లో లాగా, వెళ్ళీ తలుపు కొట్టటమే…:-)))) (జస్ట్ కిడ్డి౦గ్, భయపడక౦డి)

    ఓసారెప్పుడో ఎవరో అన్నారు, …., ఎవరి ఇ౦టికి అయినా మొదటి సారి విజిట్ కెళ్ళీనప్పుడు, బయటకి రాగానే, వాళ్ళ గురి౦చి జడ్జ్ మె౦టల్ గా కాకు౦డా మామూలుగా ఆలోచి౦చడ౦ రాదా మనకి ఎప్పటికీ అని? మీరు పైన రాసినవి చదివితే, అదె౦దుకో గుర్తొచ్చి౦దోసారి.

    ఎని వే, స౦తోషమ౦డీ మీకు నా పేరు తెలిసిన౦దుకు..
    ముఖ్య౦గా మిక్కిలి ధన్యవాదాలు… మీరు చేసిన క౦ట్రిబ్యూషన్ కి, ఓ తెలుగు పాఠకుడిగా..

    I hope you will keep doing this for a long time to come. We will be there..waiting for them.

  11. మాలతి అంటున్నారు:

    @ స్ఫురిత, :) ) అంతేనండీ. కీలే వీలు మనకి.

  12. స్ఫురిత అంటున్నారు:

    :) మొత్తానికి…మనం కలిసినప్పుడు కన్నా రాతల ద్వ్వారానే ఎక్కువ తెలుసుకున్నాట్టున్నాం…

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.