కథల అత్తయ్యగారు పుస్తకంమీద మరో సమీక్ష

05/27/2011

ఈరోజు పొద్దున్నే ఏం తోచక అంతర్జాలంలో చూస్తుంటే  నా కథల అత్తయ్యగారు పుస్తకంమీద మరో సమీక్ష   సి. పి. బ్రౌన్ ఎకాడమీ వారి సైటులో కనిపించింది.

లింకు - ఇక్కడ.  http://www.cpbrownacademy.org/bookreviews1/222.htm

ఇంతవరకూ ఇప్పటికి మూడు సమీక్షలొచ్చేయి. ఎవరూ అక్షరదోషాలగురించి ప్రస్తావించలేదు. అంటే కథలమీద దృష్టి పెట్టేవారికి కనీసం కొందరికి ఈ అక్షరదోషాలూ అవీ అంతగా బాధగా అనిపించలేదు అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకది సంతోషంగానే ఉంది. -:))

మాలతి


మార్పు 19

05/26/2011

“మంచి ఘుమఘుమ వాసనలు … ఏం చేస్తున్నారేమిటి?”

“మజ్జిగపులుసు. తింటావా?”

“ఏంటో మీరు! ఇంతకాలంగా మీయింటిచుట్టూ తిరుగుతున్నా కదా “రా, భోంచేద్దువుగానీ“ అని ఒక్కసారయినా అన్లేదు.” ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – నా అజ్నానమే ఇదంతా!

05/24/2011

నాకు రాయడానికేం తోచడంలేదు అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు ఓ మాట అని నన్ను రాసేలా చేసేస్తారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి దుప్పల రవికుమార్ “ఎందుకీ అజ్నానప్రదర్శన” అని అడిగింతరవాత నాక్కూడా అనుమానం వచ్చింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


సాక్షిలో నాపుస్తకంమీద సమీక్ష

05/24/2011

మంగళవారం, మే 24, 2011 – ఈరోజు సాక్షిలో నాపుస్తకం కధల అత్తయ్యగారు మీద వ్యాఖ్య ఇక్కడ చూడండి.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=19657&Categoryid=11&subcatid=20

సమీక్షకులకీ  ప్రచురించిన సాక్షి సంపాదకులకూ ధన్యవాదాలు.

సాక్షి లో ఈ సమీక్షకి లింకు ఇచ్చిన పి. సత్యవతిగారికి ధన్యవాదాలు.

- నిడదవోలు మాలతి


మార్పు 18

05/20/2011

తలుపు తట్టిన అరవిందకి తలుపు తీసి, “రా, ఇప్పుడే అనుకుంటున్నా, టీ పెట్టుకుందామా అని,” అంది సిరి.

“నే పెడతాలే” అంది అరవింద వంటగదివేపు నడుస్తూ.

అరవింద టీ తెచ్చి సిరికిచ్చి, ఎదురుగా కూర్చుంది.

“నువ్వు తెచ్చుకోలేదేం?”

“ఇప్పుడే తాగి వస్తున్నా, కాంప్లిమెంట్స్ ఆఫ్ సుందరంగారు.” ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


మార్పు మొదటినుండీ 17 వరకూ

05/19/2011

ఇది నేను అవుట్లైను లేకుండా మొదలు పెట్టడంచేత కొందరు పాఠకులు ముందుకీ వెనక్కీ వెళ్ళి చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

అంచేత అలా వెనకేం జరిగిందీ అన్న ప్రశ్నకి సమాధానంగా ఇంతవరకూ అయిన భాగాలు ఒక పిడియఫ్.లో పెట్టేను.

marpu 1 to 17

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

- మాలతి


మార్పు 17

05/11/2011

సుందరం అరవిందకి టీ, తనకి కాఫీ, రెండుకప్పులతోనూ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.

అరవింద టీ అందుకుని థాంక్స్ అంది.

“స్కూల్ ఎలా ఉంది?”

“బాగానే ఉంది?” ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – బతుకు కలేజా!

05/07/2011

భూపతిఁ జంపితి, మగడు భూరిభుజంగము చేత జిక్కి చచ్చె

నేనాపదఁ జెంది ఉదయార్కుని పట్టణము జేరి

వేశ్యనై కాలము బుచ్చ, పట్టి విటుండై రాగ

సంతాపము చెంది ఇటు గొల్లభామనైతి నృపతీ, వగపేటికి చల్ల చిందినన్. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.