ఊసుపోక – ఏనాటికీ మరవలేని రోజున్నరసేపూ

06/27/2011

(ఎన్నెమ్మకతలు 75)

కిందటి శుక్రవారం మధ్యాహ్నం నించి ఆదివారం ఉదయంవరకూ కొత్తపాళీ ఇంట్లో వారి కుటుంబంతో గడిపిన రోజున్నరసేపు నాకు అపూర్వమైన అనుభవం. నేను ఆయన్ని ముఖాముఖి చూడ్డం ఇదే మొదటిసారి. ఇదివరకు రెండు, మూడుసార్లు ఆయనయితే పిలిచేరు కానీ నాకే అప్పట్లో కుదరలేదు. ఈసారి ఏమైనా సరే వెళ్ళాలి అని దృఢంగా నిశ్చయించుకుని, ఆయనకీ, ఆయన భార్య సావిత్రికీ మాట ఇచ్చి, అది నిలబెట్టుకున్నాను కూడా. హా. వాళ్ళిద్దర్నీ చూడ్డం ఇదే మొదలయినా అక్కడున్నంతసేపూ నాకలా అనిపించలేదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి సాహిత్యవ్యాసాలు

06/26/2011

నోరి నరసింహశాస్త్రిగారు (1900-1978) పిన్నవయసులోనే కవిత్వం రాయడం ప్రారంభించి దాదాపు ఆరు దశాబ్దాలపాటు కవిత్వం, నాటకం, కథ, నవల, విమర్శవంటి ప్రధాన సాహిత్యప్రక్రియలలో ప్రతిభావంతమయిన రచనలు చేసి కవిసామ్రాట్ బిరుదునందుకున్నారు (1947). వివిధ సాహితీసంస్థల్లో ప్రముఖపాత్ర వహించి తెలుగుసాహిత్యంపట్ల తమకి గల అభిమానాన్నీ అభినివేశాన్నీ సగర్వంగా ప్రకటించుకున్నారు.  ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


కథామాలతి – సంకలనం

06/23/2011

ఈ సంకలనంగురించి

నా ముందు టపాలో మాధురికీ, నాకథలు ఆదరించే తదితర పాఠకులకి మాటిచ్చాను నా కథలు వీలయినంత పఠనయోగ్యంగా చేసి ఇ-బుక్ రూపంలో అందించగలనని.

(కథలు చదువుకోడానికి కథామాలతి నొక్కండి)

ఆ ప్రయత్నంలో ఇది తొలి సంకలనం. నేను అమెరికా వచ్చేక రాసినవే ఇవన్నీ. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – టెన్నిస్ కాలం మళ్ళీ

06/22/2011

(ఎన్నెమ్మకతలు 74)

లండన్‌లో వింబుల్డన్ ఆటలు మొదలయేయి మళ్లీ.

ఏటా వచ్చినా ఎప్పటికప్పుడు కొత్తే. కిందటిసారి నా రిపోర్టు ఇచ్చేను. అప్పటికంటే ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ అర్థమవుతోంది. ఉదాహరణకి ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్ళు ఒకేరంగు చొక్కాలేసుకుంటే అంత అయోమయంగా లేదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


మార్పు 21

06/19/2011

“ఎంత మంచి సలహా అయినా గుడ్డిగా ఆచరణలో పెట్టడం కాదు. తనకి తానుగా తనజీవితాన్ని తన ఆశయాలకి అనుగుణంగా మలుచుకుంటూ తనకి నచ్చిన సలహాలని తదనుగుణంగా ఉపయోగించుకోవాల”ని కామాక్షమ్మగారి అభిమతం. వారి బంధువు నాళం సుశీలమ్మగారు కూడా ఒక వ్యాసం రాసేరు. ఆ చుట్టరికం నాకు సరిగా గుర్తు లేదు కానీ కామాక్షమ్మగారు సుశీలమ్మగారి మేనత్త అనుకుంటాను. ఇవన్నీ “యుగపురుషుడు వీరేశలింగం” స్మారకోత్సవ సంచికలో ఉన్నాయి. సుశీలమ్మగారు కూడా “ఆ రోజులలాటివి. అందుకు నేను సిగ్గుపడడంలేదు, బాధ పడుతున్నాను గానీ, రామానుజాచార్యులవారి సతి కూడా ఇటువంటి అనుభవాలే పొందేరని విన్నతరవాత నాకు సాంత్వన కలిగింది. ఈనాడు నేను ఆంధ్ర మహిళా గానసభ నడుపుతున్నాను” అంటారు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


మార్పు 20

06/14/2011

ఎండ మండిపోతోంది. ఇంత గాలివాన నేనెప్పుడూ చూళ్లేదన్న నక్కలా ఉంది నామటుకు నాకు. అమెరికా వచ్చేక, ఇంత ఎండ చూడ్డం ఇదే మొదలు. విస్కాన్సిన్‌లో ఎండలు 90 డిగ్రీలు దాటిన రోజులు లేవని కాదు కానీ విస్కాన్సిన్ అంటే మంచే తలపుకొస్తుంది కానీ ఎండలు కాదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – నీరసాక్షుల సంఘసేవ

06/09/2011

(ఎన్నెమ్మకతలు 73)

నా చిన్నప్పుడు అరసికాయ కవిత్వనివేదనం అన్న పదబంధం చూసి అరసికాయ అంటే ఉసిరికాయలాగే ఏదో కాయ కాబోలు అనుకున్నాను చాలా కాలం. ఆ తరవాత అది   “అరసికాయ కవిత్వనివేదనమ్ శిరసి మాలిఖ మాలిఖ” అని తెలుసుకొని, ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – ప్రచురణ ప్రహసనంలో ఆఖరి అధ్యాయం

06/02/2011

72 ఊసుపోక – ప్రచురణ ప్రహసనంలో ఆఖరి అధ్యాయం(ఎన్నెమ్మ కతలు 72)

ముందొకసారి, పుస్తకాలు అచ్చేసుకోడం, లేదా వేరేవారు ప్రచురించడానికి అంగీకరించేక ఎదురయే ఈతిబాధలగురించి రాసేను. ఆ వరసలోనే పుస్తకాలు కొనడంగురించి కూడా రాసేను.

ఈ మధ్య నాపుస్తకాలు రెండు బజారుకెక్కింతరవాత ఈ కథ ముగిసిందనే అనుకున్నాను. కానీ నాల్రోజులక్రితం సుజాత (మనసులోమాట) నాపుస్తకంలో అక్షరదోషాలగురించి నాబ్లాగులో వ్యాఖ్య పెట్టేక నేను తీవ్రంగా ఆలోచించవలసివచ్చింది.

నిజానికి సుజాతకంటే ముందే సౌమ్య స్వయంగా తెలియజేసింది నాకుఈవిషయం. ఎంచేతో కానీ నాకు అప్పుడు టపా రాయాలన్న ఉత్సాహం అంతగా రాలేదు. సుజాత కూడా చెప్పినతరవాత నేను సదరు విషయంమీద కూడా ఓ టపా కొట్టేస్తే తప్ప ఈ పుస్తకప్రచురణ ప్రహసనం సంపూర్ణం కాదని తెలిసొచ్చింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


తూలిక.నెట్ చరిత్రలో ఒక దశాబ్దం

06/01/2011

నా వెబ్ సైట్ thulika.net అంతర్జాలంలో అడుగెట్టి దశాబ్దం అయింది ఈరోజుకి.

పదేళ్లు! నాకే ఆశ్చర్యంగా ఉంది. నాజీవితకాలంలో ఏ అంతరాయాలూ లేకుండా ఇంతకాలం నేను నిర్వహించిన ఉజ్జోగం – ఆదాయంలేనిదే అనుకోండి – ఇదొక్కటే.     ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.