(ఎన్నెమ్మ కతలు 77)
ఇక్కడ జులై నాలుగు బాణాసంచా వెలుగులు చూడ్డానికి వెళ్ళడం మానేశాను చాలాకాలంగా. ఎందుకంటే ఊరుబయట ఆరుబయల్లో జరుగుతాయి అవి స్థానిక ప్రభువుల ఆధ్వర్యంలో.
ఊళ్ళోవాళ్ళందరూ ఆరుగంటలకే వెళ్ళి, దుప్పట్లు పరుచుకుని తెచ్చుకున్న హాంబర్గర్లు తింటూ, బీరు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు బాణాసంచా ప్రేలుళ్ళు మొదలయేవరకూ. అవి చీకటి పడ్డాక జరగాలి అంటే కనీసం తొమ్మిదన్నర దాటాలి. అంటే అంతవరకూ అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే ఓపిక కావాలి. రెండోది దోమలు. అవును, ఇక్కడ కూడా దోమలబాధ కూడా ఎక్కువే. ఆ పైన జనసందోహం. కారులో సుమారుగా ఏ ఎనిమిది గంటలకో బయల్దేరితే, దాదాపు మైలున్నర దూరం నడవాల్సొస్తుంది అప్పటికే వచ్చి ఉండిన కార్ల మూలంగా.
ఇంతకీ నిన్న ఏం జరిగిందంటే, నేను పడుకుని ఉండగా డబ్ డబ్మని చప్పుడు వినిపించింది. మాంఛినిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచి ఆ తరవాత భయపడ్డాను. ఈ సమయంలో మాయింటికొచ్చి తలుపు తట్టేవాళ్ళెవరున్నారు, దొంగేమో అని. ఆ పైన కొన్ని సినేరియోలు ఊహించుకుని మరింతభయపడి, మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకుని, లేచి తలుపుదగ్గరికొచ్చి, గాజుకన్నంలోంచి చూసేను. అక్కడెవరూ లేరు.
హమ్మయ్య అనుకుని, ఇంతా డబ్ డబ్ వినిపిస్తుంటే ఉరుములు కాబోలు, వాన వస్తుంది కాబోలు అనుకుంటూ చూస్తున్నాను.
అప్పుడు వెలిగింది బల్బు ఇది జులై నాలుగు సంబరాలేమోనని. చూద్దాం ఎటునించి వస్తున్నాయో అనుకుని తలుపు తీసుకుని బయట చూశాను.
ఆశ్చర్యం.
మాఇళ్ళపక్కనే ఉన్న గాల్ఫ్ కోర్సులోంచి వస్తున్నాయి నేరుగా మాముంగిట్లోకి. ఎంత ముంగిట అంటే నేను నాలుగడుగులు బయటికొస్తే ఆ నిప్పు రవ్వలు నామీద పడతాయేమోనని భయమేసింది.
చుట్టూ చూశాను నాలాగే మిగతా వాటాల్లో ఉన్నవాళ్ళు కూడా బయటికి వచ్చి చూస్తారేమోనని. ఎక్కడా నరసంచారం లేదు.
నాకు నవ్వొచ్చింది. కిందటివారం నాకోసం ప్రత్యేకం నాట్యప్రదర్శన.
ఇవాళ నా ముంగిట నాకొక్కదానికే కనిపిస్తున్న దీపావళి బాణా సంచా! నేను ఈ దేశం వచ్చేక ఈ బాణాసంచా సంరంభం ఇంతగా చూసి ఆనందించింది ఇదొక్కటేనేమో. ఈ ఏడు నాజాతకం భలే మారిపోయినట్టుంది. హా. హా.
(జులై 4, 2011.)







రాజేష్, *ఫాషన్ షోలో డైటింగ్ భామల్లాగా ఉన్నారు
. చక్కటి భంగిమ కూడా..అవై-సువైల్లా ఉన్నాయి.* – బాగుంది. సౌమ్యకేమో దెయ్యాల్లా కనిపిస్తే మీకు డైటింగ్ భామల్లా ఉన్నారా. నేను కూడా ఇంకా ఘా..ఠ్ఠి…గా స్టడీ చేస్తానుండండి, ఇంకా ఏం కనిపిస్తాయో..
$మాలతి గారు
భలే చిత్రాలు..చక్కగా బంధించారు. ముఖ్యంగా మూడో చిత్రం అదిరింది. ఫాషన్ షోలో డైటింగ్ భామల్లాగా ఉన్నారు
. చక్కటి భంగిమ కూడా..అవై-సువైల్లా ఉన్నాయి.
@ సౌమ్య, ఏమో నాకు హిప్పీదయ్యాల్లా కనిపించలేదు :p
)
@ కొత్తపాళీ,
Nice.
@sowmya – మగ హిప్పీ దయ్యాలు హ హ
ఇప్పుడింక దయ్యాల జడల ఊడల్లా అనిపిస్తున్నాయ్ మరి!
)
అవి ఆడదయ్యాలు అని తీర్మానించలేను కానీ, మగ హిప్పీ దయ్యాలనుకోవచ్చు
@ లలిత, =))
@ సౌమ్య, రవి గాంచనిచో కవి గాంచు … మరియు యద్భావం తద్భవతి అనే కదా నిన్ను చూడమన్నది. నాలాటివారికి కనిపించనివి నీకు కనిపిస్తాయి :p.
Nice pics, by the way!!
నిజం చెప్పొద్దూ, మీరు దొంగలని ఊహించుకుంటే, నేను దయ్యాలని ఊహించుకుని చూశా మీ ఫొటోల్ని. చివరి మూడూ ఐతే, పిల్ల దయ్యాల మీటింగు ఫొటోల్లా అనిపించాయి దాంతో. నా కళ్ళతో చూసి చెప్పండి – మీకూ అనిపించాయో లేదో!
వెలుగు సొగసు అదే కాబోలు… తనని తాను దయ్యంలా మార్చుకోగలదు, కావల్స్తే
)