లలితగారి కథమీద నా అభిప్రాయం

http://thulika.net/media/naabhiprayam.mp3

కొందరికి ఆడియో ఓపెనవడం లేదని విన్నాను, క్షమించాలి. నాకు రెండో చెయ్యి స్వాధీనం అయేవరకూ, బహుశా మరో రెండు నెలలపాటు నా రాతింతే :(

3 Responses to లలితగారి కథమీద నా అభిప్రాయం

  1. మాలతి అంటున్నారు:

    @ కొత్త పాళీ, బాగా పట్టుకున్నారండీ, నాకు తోచలేదు. లలిత కూడా అదే అంటున్నారు.
    ”ఏది సరైన మార్గం అని ఎంచుకునే శక్తి పఠనం ద్వారా, సాధన ద్వారా, కొంతవరకూ ఇతరులతో చర్చద్వారా పదునెక్కుతుంది”. నిజమే.
    @ లలిత, బాగుందండీ. అలా అయితే, మీచివరివాక్యం –బయట ఆదర్సదంపతులుగా… అన్నది ఎలా ఈ కథలో చొప్పిస్తారో మీరే తేల్చుకోవాలి మరి.

  2. lalitha అంటున్నారు:

    మాలతి గారు మీ అభిప్రాయం కోసమే చూస్తున్నానండీ .

    కథ పేరు గురించి – కథ లో సన్నివేశాలు బహిరంగంగా జరిగినవి కాదు. ఏకాంతంలో కేవలం ఇద్దరిమధ్య జరిగిన సంభాషణలు. వాటిని ఇలా బహిర్గతం చేస్తున్న కథ ఇది . ఇటువంటి సున్నితమైన సమస్యలెన్నో మనం మాట్లాడుకోకూడని రహస్యాలుగా ఉండిపోతున్నాయి . అటువంటి ఒక రహస్యాని కి సంబంధించిన అంశం కాబట్టి కథకి ఈ పేరు బావుంటుందనిపించింది.
    మీ సహాయానికి ధన్యవాదాలు

  3. కొత్త పాళీ అంటున్నారు:

    బావుందండి.
    రహస్య నివేదిక ఎందుకయింది అంటే, కథ చివరి ముక్తాయింపు వాక్యం మూలంగానే. ఇక్కడ కథకురాలు (అంటే కథ చెబుతున్న గొంతు, రచయిత్రి కాదు) ఒక ప్రఛ్ఛన్న విలేకరి (undercover reporter) అన్నట్టు – ఆ పడగ్గదిలో పరమరహస్యంగా జరిగే విషయాన్ని ఇప్పుడు పాఠకలోకానికి బహిర్గతం చేసినందుగ్గాను ఇది రహస్యనివేదిక అయిందని నేను అనుకుంటున్నా.

    మీరన్నట్టు, కథ రాయడంలో (ఆ మాటకొస్తే ఈ సృజనాత్మక ప్రక్రియలోనైనా) సూచనలు సూత్రాలు ఒక మార్గదర్శకంగా మాత్రమే పని చేస్తాయి. చివరికి రచయిత తన వస్తువుకి, తన శైలికి తగిన మార్గాన్ని ఎంచుకోవలసిందే కథ రాసేందుకు. ఏది సరైన మార్గం అని ఎంచుకునే శక్తి పఠనం ద్వారా, సాధన ద్వారా, కొంతవరకూ ఇతరులతో చర్చద్వారా పదునెక్కుతుంది.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.