కథల చర్చ – చివరిమాటగా …

10/27/2011

ఈ టపాధారలో ఆదిని చెప్పేను కొన్ని కథలు తీసుకుని నాసలహాలు ప్రాతిపదికగా సమీక్షిస్తానని.

కథకి కొన్ని ప్రమాణాలున్నాయని వెనక చెప్పేను. అవి ఈనాటి పత్రికల, పాఠకులకోణం దృష్టిలో పెట్టుకుని అని కూడా చెప్పేను. ఇలా రాయకపోతే కథ కాదు అని మాత్రం కాదు.

ఎత్తుగడ, నడక, ముగింపు ముందు చూద్దాం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – రామయమంత్రి భోజనపరాక్రమేమని చెప్పవచ్చు

10/23/2011

(ఎన్నెమ్మకతలు 80)

గ్రామము చేత నుండి పరికల్పిత ధాన్యము నింట నుండి శ్రీ
రామ కటాక్ష వీక్షణ పరంపరచే గడతేరె గాక మా
రామయమంత్రి భోజన పరాక్రమ మేమని చెప్పవచ్చు నా
స్వామి యెరుంగు దత్కబళ చాతురి తాళ ఫల ప్రమాణమున్.

అంటూ వర్ణిస్తాడు శ్రీనాథుడు రామయమంత్రి భోజనపరాక్రమము. ఆ రోజులలాటివి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


నాకథ మీ అభిప్రాయాలకోసం

10/16/2011

కథలు చర్చించడం కూడా కథలు రాయడంలో భాగమే. ఎందుకంటే మీరు కథ రాస్తున్నప్పుడు ఇవే ప్రశ్నలు దృష్టిలో పెట్టుకుంటే మరింత బాగా కుదురుతుంది కథ.

కొన్ని కథలు మంచివో గొప్పవో కాకపోయినా, కథాలక్షణాలు చర్చించడానికి పనికొస్తాయి. అలాటిదే ఈ రససిద్ధి కథ – ఈసారి చర్చకి పెడుతున్నా. చర్చించదగ్గ ప్రశ్నలు ఉదాహరణకి,

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


లక్ష్మీ రాఘవగారి కథ మీద నా అభిప్రాయాలు

10/07/2011

కథ ఇక్కడ పెట్టడానికి అనుమతి ఇచ్చిన లక్ష్మీ రాఘవ గారికి చక్కని వ్యాఖ్యలందించిన పాఠకులకీ ధన్యవాదాలు. నిజానికి మీ వ్యాఖ్యలు నాకు కూడా స్ఫూర్తినిచ్చేయి.

నా అభిప్రాయాలు - ఇక్కడ నొక్కండి.


లక్ష్మీ రాఘవగారి కథ మీ అభిప్రాయాలకోసం

10/04/2011

నేను మొదలుపెట్టిన ఈ ప్రణాలికలో – మీ కథలు చర్చకి పెట్టడం – ఇది రెండో కథ. నా కోరిక మన్నించి తన కథను నాకు పంపిన లక్ష్మీ రాఘవగారికి ధన్యవాదాలు. లలితగారి కథకి వ్యాఖ్యలు చేసిన వారందరికీ మరోసారి ధన్యవాదాలు. ఆ వ్యాఖ్యలు లలితగారికే కాక, నాకు కూడా జ్ఞానదాయకంగా ఉన్నాయి. అలాగే ఈ కథకి కూడా పాఠకులు ఇతోధికంగా తమ తమ అభిప్రాయాలు వెల్లడించగలరని ఆశిస్తున్నాను.

మాలతి

—————————————————————————–

                                   గుండె అలిసింది    

రచన: లక్ష్మీ రాఘవ

సర్వ హక్కులు రచయిత్రివి.

“కారు పంపుతున్నా ఒక్క సారి టౌనుకు రామ్మా “ వర్దనమ్మకు రామచందర్ రావు దగ్గరినుండి వచ్చిన ఆ ఫోను  అర్థం  కాలేదు

“ ఆయన మీ దగ్గరికే వచ్చారన్నయ్యా “

‘అవున్నమ్మ వాడు ఇక్కడనే వున్నాడు.. కాస్త నలతగావుంది. అందుకే కారు పంపుతున్నా ..నీవు వచ్చేసేయ్..”

“ ఏమయింది అన్నయ్యా ?” గాబరాగా అంది వర్దనమ్మ. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.