ఊసుపోక – ఏకాగ్రతా, అనేకాగ్రతా

11/30/2011

(ఎన్నెమ్మకతలు 83)

ఏకాగ్రత అంటే సమస్తం మరిచి ఒకే విషయంలో నిమగ్నమై ఉండడం. అనేకాగ్రత అంటే ఏమిటో చెప్పడం కష్టం. ఈటపా చదివినతరవాత మీకేం తోస్తే అదే. ఇంకా దీన్నే అష్టకర్మావధానం అని కూడా అనొచ్చు. కారు నడుపుతూ, కాఫీ చప్పరిస్తూ, రేడియో వింటూ, ఒక చెవులో పీసుద్వారా మరొకళ్ళతో ఊసులాడుతూ పోతుంటారు కొందరు. ఇంకా కారులో are we there yet అంటూ పిల్లలు సంగీతం మొదలు పెడితే అది మరీ వీర అష్టకర్మావధానమే!

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఎన్నెమ్మకతలు – 2 (పిడియఫ్)

11/28/2011

ఎన్నెమ్మ కతలు పేరుతో, కొత్తపాళీ ముందుమాటతో ఒక సంకలనం వెలువడింది ఇదివరలో. నాసాహిత్యం పిడియఫ్ లో పేజీ చూడండి.

ఇది రెండో సంకలనం. యథాశక్తి అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు దిద్ది, 32 కతలు ఈ సంకలనంగా కూర్చేను. అన్నట్టు ఇందులో లింకులు కూడా పని చేస్తున్నాయి మీ సౌకర్యార్థం!

ఎన్నెమ్మకతలు 2


ఊసుపోక – జీవితానికీ, నటనకీ టిప్పణి రాస్తున్న నటి

11/23/2011

(ఎన్నెమ్మకతలు 82)

హాస్యం కూడా అన్ని వస్తువుల్లాగే బజారుసరుకు అయిపోయిన ఈ రోజుల్లో నన్ను నవ్వించగల హాస్యనటులు కనిపించడంలేదు ఈమధ్య. నిన్న msnbc ఛానెల్లో వార్తలు చూస్తుంటే, Betty White ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తుంటే ఈ టపా రాయాలనిపించింది. లింకు ఇస్తున్నాను చూడండి. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – సంస్కృతీ, కల్చరూ

11/18/2011

(ఎన్నెమ్మకతలు 81)

ఈరోజు పొద్దున్నే నాకు మాధురీకృష్ణ ఒక విడియో పంపేరు, తణుకుకి చెందిన 11 ఏళ్ళ శృతి తేట తెలుగులో ఇచ్చిన ఉపన్యాసం. విని ఆశ్చర్యపోయేను. ఆ తల్లిదండ్రులని అభినందిస్తున్నాను. విని చూడండి.

<http://www.youtube.com/watch?v=BZg74oCNvZM>

నాకు వెంటనే మరో ప్రశ్న ఉదయించింది – ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


సిస్టావధానం (కథ)

11/15/2011

ఆస్తి పోతే పోయింది కోర్టుపద్ధతులు తెలిసేయి అన్నాట్ట ఓ పెద్దమనిషి వెనకటికి.

చెయ్యి విరిగితే విరిగింది కానీ అమెరికాలో వైద్య విధివిధానం విశదమయింది నాకు, ఏకాలేజీల్లోనూ ఏ బోధనాపద్ధతులూ తెలియజేయలేనంత తేటతెల్లముగా.

ఆస్పత్రి లౌంజిలో నిస్సహాయంగా కూర్చుని ఉన్నవాళ్ళందర్నీ చూసీ చూడనట్టు  కొనకళ్ల పరిశీలిస్తున్నాను మాటలు వినిపించని టీవీకి కళ్ళప్పగించి.   ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.