ఊసుపోక – జీవితానికీ, నటనకీ టిప్పణి రాస్తున్న నటి

(ఎన్నెమ్మకతలు 82)

హాస్యం కూడా అన్ని వస్తువుల్లాగే బజారుసరుకు అయిపోయిన ఈ రోజుల్లో నన్ను నవ్వించగల హాస్యనటులు కనిపించడంలేదు ఈమధ్య. నిన్న msnbc ఛానెల్లో వార్తలు చూస్తుంటే, Betty White ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తుంటే ఈ టపా రాయాలనిపించింది. లింకు ఇస్తున్నాను చూడండి.

http://www.bing.com/videos/watch/video/betty-white-not-a-resurgence-ive-been-working-all-this-time/6iz3j95

నన్ను హాయిగా, మనస్ఫూర్తిగా, ఫక్కున నవ్వించగల హాస్యనటులు నేను చూస్తున్న షోలలో ఇద్దరే – Dick Van Dyke, Betty White.

తను పోషిస్తున్న పాత్రలలో అమాయకత్వం, అయోమయం, అలకలాటి అనేకభావాలు క్షణాలమీద ముఖకవళికలో మార్చేంటే చూసి నవ్వకుండా ఉండలేను. బెటీ ఉన్న షోలో నవ్వెప్పుడొస్తుందో అని ఎదురు చూడఖ్ఖర్లేదు.

నేను తొలిసారిగా బెటీని చూసింది 70వ దశకంలో Mary Tyler Moore Showలో. తరవాత 80 దశకంలో Golden girlsలో, ప్రస్తుతం Hot in Cleveland‌లో – ఏ పాత్రలోనైనా సరే చూస్తుంటే ఆమె అసాధారణమైనప్రజ్ఞ గల నటి అనిపించకమానదు. లుసీల్ బాల్ తరవాత అంతటి హాస్యచతురత చూపిన నటి బెటీ వైట్ ఒక్కరేనేమో.

ఆమె కొన్ని గేం షోలలో కూడా పాల్గొన్నారు. password షోలో ఒకసారి ఆ హోస్ట్ లడెన్ ఆ రోజుకి ఆట అయిపోయినతరవాత, “మీకు నేను చేయగలసాయం ఏమైనా ఉందా?” అంటే, బెటీ చాలా మామూలుగా, “మా ఇంటికి రైడ్ ఇవ్వొచ్చు కదా,” అందిట. ఆయన సరేనన్నారు. ఆ తరవాత వారు పెళ్ళి చేసుకున్నారు.

తెరమీద పాత్రలలో ఎంత అమాయకత్వం చూపుతుందో వాస్తవ జీవితంలో అంతటి స్ఫూర్తి ప్రదర్శించ గల బెటీ ప్రస్తుతం మరో రియాలిటీ షో కూడా ప్రారంభిస్తోందిట. ఇప్పటికి ఆరు పుస్తకాలు ప్రచురించారు. స్థానిక జూ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న మనీషి.

మరో ఇంటర్వ్యూలో ఎవరో ఎనభైతొమ్మిదేళ్ళ బెటీని, “చాలామంది నటులలా మీరు మీవయసు దాచి, చిన్నగా కనిపించడానికి ప్రయత్నించరే,“ అంటే, బెటీ కొంచెం ముందుకు వంగి వణుకుతున్న స్వరంతో ముసలితనం అనుకరిస్తూ  తాను తానుగా ఉండడమే తనకిష్టం అనడం నవ్వు తెప్పించడమే కాక, తాను నమ్మిన ఒక సత్యాన్ని వివరిస్తున్నట్టు ఉంది నాకైతే. అలాగే తాను ఒప్పుకోని పాత్రలు ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు, “డ్రగ్స్ వాడుతున్నట్టు చూపించే పాత్రకి నేను ఒప్పుకోను. వాటివల్ల ఎంతో ప్రాణహాని జరుగుతోంది. అందులో హాస్యం లేదు,” అంది.

ఆమె నిశిత పరిశీలనాదృష్టి, చమత్కారంగురించి పూర్తిగా చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు. యూట్యూబునిండా చాలా విడియోలున్నాయి చూడండి. వికిపీడియాలో ( http://en.wikipedia.org/wiki/Betty_White) ఆమె సాధించిన ఘనవిజయాలు ఉన్నాయి.

(నవంబరు 23, 2011.)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.