చదువుకున్న సరస్వతి (మళ్లీ పాతకథే!)

12/31/2011

తెలుగు తూలిక అభిమానులకు

2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు

రెండు మాటలు -

ఈ కథ 1959లో రాసేను.

గతవారం జానుతెనుగు.బ్లాగ్‌స్పాట్.కాం లో మాగంటి వంశీమోహన్‌గారు పాత తెలుగు స్వతంత్రలు తిరగేస్తుంటే నా గల్పిక ఒకటి కనిపించిందని నాకు చెప్పి ప్రచురించేరు. తరవాత మరో గల్పిక చూసి, అది కూడా నాకు పంపించేరు. దానిమీద వారిఅభిప్రాయాలు నిర్మొహమాటంగా రాయమని చెప్పేను. ఒకేకాలంలో రాసినా మిగతా గల్పికలు ఒక మెట్టు పైనున్నాయనీ,  “దీనికి కొద్దిగా మినహాయింపు ఇచ్చి పత్రికలో ప్రచురించారేమో అనిపించింది” అన్నారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను.

ఆ సందర్భంలోనే ఆనాటి సాహిత్యచరిత్ర కొంచెం స్పృశించాలనిపించి ఈ రెండు మాటలు. ఎందుకంటే ఆ గల్పిక తరవాత ఐదేళ్ళకి రాసిన ఈ కథలో కూడా పరిపక్వత తక్కువే. ఇది ఏదో పత్రికకి పంపినట్టు నా రాతప్రతిమీద కనిపిస్తోంది కానీ ప్రచురించిన జాడల్లేవు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


జానుతెనుగు బ్లాగులో నా పాతకథ!

12/29/2011

నిన్న వంశీ మాగంటి నన్ను చకితురాలిని చేసేరు నేనే మరిచిపోయిన నా పాత కథ ఒకటి వెలికి తీసి “బుష్ కోటు వేసిన బ్లాగురు మాలతి గారు” అంటూ.

ఆయన పెట్టిన శీర్షిక చూస్తే నాకు గాంధీ టోపి అన్న వాడుక గుర్తుకొచ్చింది. ఈనాడు బుష్ కి ఉన్న ప్రాచుర్యం తలుచుకొచ్చి నవ్వుకున్నాను.

ఈ లింకు చూడండి. http://janatenugu.blogspot.com/2011/12/1954.html.

 


ఊసుపోక – పూర్తి చెయ్యని పుస్తకాలు 2

12/27/2011

(ఎన్నెమ్మకతలు 87)

 తెలుగు నవలాసాహిత్యంగురించి తెలిసిన ఎవరినైనా మీరు తెలుగులో గొప్ప ప్రాచుర్యం పొందిన నవలలు ఓ పదో పన్నెండో చెప్పమంటే ఆ పట్టికలో వుప్పల లక్ష్మణరావుగారి “అతడు – ఆమె” తప్పకుండా ఉంటుంది. నేను చాలాకాలంగానే ఈపేరు వింటున్నా, తొలిసారిగా పుస్తకం చూసింది మాత్రం ఆర్నెల్లక్రితం కొత్తపాళీగారింట్లోనే. ముందోసారి రాసేననుకుంటాను అది ఎయిర్పోర్టులోనే చదవడం ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – పూర్తి చెయ్యని పుస్తకాలు – 1

12/23/2011

(ఎన్నెమ్మకతలు 86)

ఇదివరకోసారి చదవనివారికి ప్రత్యేకం శీర్షికతో “చదువుతాను, తరవాత చదువుతాను, తప్పక చదువుతాను” అను తిరుమంత్రం జపిస్తూ మనం పోగేసుకుని అటకమీదకి ఎక్కించేసే పుస్తకాలగురించి రాసేను. అప్పుడు నాలాటి పాఠకులు చాలామందే ఉన్నారని అర్థమయింది. మళ్ళీ ఇప్పుడు నాకు చదవాలన్న కోరిక అంటే నిజంగా చదవాలన్న కోరిక పుట్టింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – చుక్కలూ, తోకచుక్కలూ

12/17/2011

(ఎన్నెమ్మకతలు 85)

ఈమధ్య పాఠకులు చాలామంది నా, మీ ఇంకా ఇతర రచయితల రచనల్లో చుక్కలూ [.], తోకచుక్కలూ [,] సరిగా లేవని చిరాకు పడుతున్నారు. అంచేత ఈరోజు పొద్దున్నే లేచి, ఈ విషయం సవిస్తరంగా చర్చించదల్చుకున్నాను. అంటే విశ్వవిద్యాలయాల్లో ఘనాపాఠీ పండితుల సిద్ధాంతగ్రంథాలలోవలె పాశ్చాత్య మహాశయులని ఆదర్శంగా తీసుకోక తప్పదు కదా. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఇష్టసఖి

12/13/2011

“ఒకరికి అసలు ఎవరికైనా మరొకరంటే ఎలా ఇష్టం కలుగుతుంది?”

ట్రినిటీ నదిలో చిరుతరగలు గాలి వీచిన దిక్కుగా కదులుతున్నాయి నిదానంగా.

గట్టున వీపింగ్ విల్లోలు ఊయలలూగుతూ గాలివేగం సూచిస్తున్నాయి.

వాహిని వాహిక అయి గడ్డిపరకల్నీ, ఫోం కప్పుల్నీ మోసుకుపోతోంది దూరతీరాలకి నిరామయంగా. కడిగిన పింగాణీముక్కల్లాటి తెల్లముక్కుల్తో బాతులు చిరుతరగలమీద ఓలలాడుతున్నాయి జల్సాగా. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


ఊసుపోక – నా సహచరులు

12/10/2011

(ఎన్నెమ్మకతలు 84)

మహోదయం

చల్లగా, శాంతంగా

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »


Follow

Get every new post delivered to your Inbox.