ఊసుపోక – పూర్తి చెయ్యని పుస్తకాలు 2

(ఎన్నెమ్మకతలు 87)

 తెలుగు నవలాసాహిత్యంగురించి తెలిసిన ఎవరినైనా మీరు తెలుగులో గొప్ప ప్రాచుర్యం పొందిన నవలలు ఓ పదో పన్నెండో చెప్పమంటే ఆ పట్టికలో వుప్పల లక్ష్మణరావుగారి “అతడు – ఆమె” తప్పకుండా ఉంటుంది. నేను చాలాకాలంగానే ఈపేరు వింటున్నా, తొలిసారిగా పుస్తకం చూసింది మాత్రం ఆర్నెల్లక్రితం కొత్తపాళీగారింట్లోనే. ముందోసారి రాసేననుకుంటాను అది ఎయిర్పోర్టులోనే చదవడం మొదలెట్టేశానని. ఓ గంటసేపు ఆపకుండా చదివేసేను కూడా నా అలవాటుకి విరుద్ధంగా అంటే నేను ఎయిర్పోర్టుల్లోనూ, ప్లేనులోనూ, రైళ్ళలోనూ అట్టే చదవలేను. ఆపైన లక్ష్మణరావుగారు మాప్రాంతంవారేనని తెలిసి మహ గొప్పపడిపోయేను.

ఇంతకీ కథ సంగతి – మొదట పుస్తకంపేరు సంగతి చెప్తాను. అతడు, ఆమె లాటి సర్వనామాలు వాడినప్పుడు దాన్ని రెండు రకాలుగా అది అర్థం చేసుకోడానికి అవకాశం ఉంది. వారిద్దరూ కొన్ని ప్రత్యేకలక్షణాలు గల వ్యక్తులు అని అనుకోవచ్చు పండిత పరమేశ్వరశాస్త్రిలా. లేదా ఆ ఇద్దరూ ఆనాటి యువతీయువకుకి ప్రతినిధులు అంటూ సాధారణీకరించేరు అనుకోవచ్చు.

ఈ నవల త్రిసంపుటి అన్నారు రచయిత. మొదటిభాగంలో అతడు అంటే చిదంబరశాస్త్రి. ఆమె అంటే శాంతం. మన దేశస్వాతంత్ర్యపోరాటం మొదలై, ఉధృతంగా సాగుతున్నసమయంలో ఆనాటి విద్యాధికులకి ప్రతినిధులు. చిదంబరశాస్త్రిలాటి “అతడు” శాంతంలాటి “ఆమె”లూ ఆనాడూ ఉన్నారు ఈనాడూ ఉన్నారు. అంచేత సార్వత్రికంగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి భావాలూ, వారి ప్రవర్తనలూ, నమ్మకాలూ, వీటితో పాటు ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులూ ఎంతో విపులంగా చిత్రించేరన్నమాట. రెండోభాగంలో వారి పెద్దకూతురు సుభ “ఆమె”. ఆమెస్నేహితుడు జనార్దనం “అతడు”. మూడోభాగంలో రెండోకూతురు లక్ష్మి “ఆమె”, ఆమెస్నేహితుడు భాస్కరం “అతడు”.

శైలివిషయంలో ముఖ్యవిషయం ఇది డైరీరూపంలో రాయడం అని ముందుమాటలో చెప్పేరు. అయితే ఇది ఒకరి డైరీ కాదు. పైన చెప్పినట్టు ముగ్గురు “అతడు”లూ, ముగ్గురు “ఆమె”లూ ఉన్నారు కనక ఆరు డైరీలు అనొచ్చు.  అంటే కప్పగంతులేస్తూ అక్కడక్కడ చదివేవారికి ఈ “నేను” ఎవరు అన్నప్రశ్న తలెత్తే అవకాశం ఉంది.  

కథ చెప్పిన తీరు, భాష సహజంగా, మనని ఆకట్టుకునేలా ఉన్నాయి. “కాంసు“ (కాబోలు), గ్యేపకం (జ్ఞాపకం), చూపుణ్ణు (చూపి ఉండును?) లాటి మాటలతోపాటు “అల్పగ్యతాభాగ్యం” లాటి కొత్త నుడికారం కూడా కనిపించి మురిపించిందని ఒప్పుకోక తప్పదు. అయితే నేను ఆకళించుకోలేకపోయిన సందర్భాలు కథ చక్కగా నడుస్తున్నప్పుడే తగిలేయి. ఒకచోట మొత్తం సంభాషణ అంతా ఇంగ్లీషులో సాగింది మూడు, నాలుగు పేజీలు. అదంతా తెలుగులిపిలో రాయడం జరిగింది. నాకు అలా ఇంగ్లీషు తెలుగులిపిలో చదవడం, చదివి అర్థం చేసుకోడం చాలా కష్టం. అలాటి సందర్భాలలో పాత్రలు ఇంగ్లీషుకి అలవాటు పడిపోయేరన్న సంగతి రచయిత మరో విధంగా పాఠకులకి తెలియజేసి ఉంటే బాగుండేది. దానికి తగిన మాధ్యమం సృష్టించుకోగలిగినప్పుడే రచయిత ప్రతిభ వ్యక్తమవుతుందని అని నా అభిప్రాయం. ఏ విషయమైనా కథలో ఉన్నదున్నట్టు చెప్పినప్పటికంటే ఇతరసాధనాలు వాడుకుని సూచనప్రాయంగా చెప్పడంలో కొత్తదనం, స్ఫూర్తి కనిపించడమే కాక, పాఠకులకి ఆలోచించుకోడానికి కూడా అవకాశం కల్పిస్తుంది, వారి మేధకి పని పెడుతుంది. అలాగే జనార్దనం బ్రిడ్డికట్టడానికి ఇంజినీరింగు లెక్కలు పాఠం పెట్టేయడం కూడా నా ఉత్సాహాన్ని కాస్త మందగించేలా చేసింది.  

రాజకీయసిద్ధాంతాలని స్వప్రయోజనాలకి వాడుకోడం, స్వప్రయోజనంకోసం కోట్లు మార్చేయడం చాలా వాస్తవికంగా చిత్రించేరు రచయిత. అయితే రాజకీయ చర్చలతోపాటు, నిత్యజీవితంలో వంటకాలవంటి సాధారణవిషయాలు కూడా సరదాగా ఉన్నాయి. శాస్త్రి ఊరుబిండి, తెలకపిండి, నక్కదోసకాయ అంటూ వర్ణిస్తారు నోరూరేలా. ఆకాలంలో మగవాళ్ళు వంటింటివేపు వచ్చేవారు కాదు చాలా ఇళ్ళల్లో. ముఖ్యంగా కొన్ని బ్రాహ్మణకుటుంబాల్లో ఇంట్లో భార్య తప్ప మరో ఆడమనిషి లేకపోతే తప్ప. 

నేను చదివినంతమేరకి, నాకు ఆశ్చర్యం కలిగించిన రెండు సందర్భాలు – తల్లీకూతుళ్లు చీటికి మాటికి కౌగలించుకోడం, ముద్దులు పెట్టుకోడం, తల్లిని కూతురు పెళ్ళికి ముందు సెక్స్ అనుభవించేరా అని ప్రశ్నించడం, మన సంప్రదాయంప్రకారం అసహజంగా అనిపించింది. కనీసం నాకాలంలో నేను వినలేదు అలాటివి. నిజానికి తల్లిగారి సెక్స్ జీవితంగురించి అమెరికాలో కూడా చాలా కుటుంబాల్లో మాటాడరు ఇప్పటికీ. రెండోది, సుప్రసిద్ధ నటి కేథరిన్ హెప్బర్న్ సౌందర్యంమూలంగా పేరు తెచ్చుకుంది అనడం. కేథరిన్ హేప్బర్న్ అందంగా ఉన్నా ఆవిడ కీర్తి సంపాదించుకున్నది కేరక్టర్ యాక్ట్రెస్‌గా. తమ సౌందర్యం కారణంగా పేరు తెచ్చుకున్నవాళ్ళు మెరిలిన్ మన్రో, కొంతవరకూ ఎలిజబెత్ టేలర్. మరి జర్మనీలో కేథరిన్ హెప్బర్న్‌కి అలాటి పేరు ఉండేదేమో ఆరోజుల్లో నాకు తెలీదు.      

ముందే చెప్పేను రెండోభాగంలో పెద్దకూతురికథ, మూడో భాగంలో రెండోకూతురి కథ అని. ఆ మూడోభాగానికొచ్చేసరికి, నాకు ఆసక్తి తగ్గిపోయింది. నాకు రాజకీయాల్లో, ఇలాటి వాదప్రతివాదాల్లో అంత ఆసక్తి లేదు మరి. నా రాజకీయ అజ్ఞానంగురించి మరో టపాలో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి,  దేశంలోస్వాతంత్ర్యం రాకముందు, సమరం జరుగుతున్నప్పుడూ, వచ్చేక  ఆ మూడుతరాల భావజాలంలో, సమాజంలో వచ్చినమార్పులు ఈ నవల చదివితే అర్థమవుతాయని మాత్రం అర్థమయింది.   

ఇంతకీ, ఈ అన్ని కారణాలవల్ల నేను పూర్తి చేయలేదీ పుస్తకం.

(డిసెంబరు 27, 2011)

Normal
0

false
false
false

EN-US
X-NONE
TE

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-parent:”";
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin:0in;
mso-para-margin-bottom:.0001pt;
text-indent:.5in;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Gautami;
mso-bidi-theme-font:minor-bidi;}

87 ఊసుపోక – పూర్తి చెయ్యని పుస్తకాలు 2

(ఎన్నెమ్మకతలు 87)

తెలుగు నవలాసాహిత్యంగురించి తెలిసిన ఎవరినైనా మీరు తెలుగులో గొప్ప ప్రాచుర్యం పొందిన నవలలు ఓ పదో పన్నెండో చెప్పమంటే ఆ పట్టికలో వుప్పల లక్ష్మణరావుగారి “అతడు – ఆమె” తప్పకుండా ఉంటుంది. నేను చాలాకాలంగానే ఈపేరు వింటున్నా, తొలిసారిగా పుస్తకం చూసింది మాత్రం ఆర్నెల్లక్రితం కొత్తపాళీగారింట్లోనే. ముందోసారి రాసేననుకుంటాను అది ఎయిర్పోర్టులోనే చదవడం మొదలెట్టేశానని. ఓ గంటసేపు ఆపకుండా చదివేసేను కూడా నా అలవాటుకి విరుద్ధంగా అంటే నేను ఎయిర్పోర్టుల్లోనూ, ప్లేనులోనూ, రైళ్ళలోనూ అట్టే చదవలేను. ఆపైన లక్ష్మణరావుగారు మాప్రాంతంవారేనని తెలిసి మహ గొప్పపడిపోయేను.

ఇంతకీ కథ సంగతి – మొదట పుస్తకంపేరు సంగతి చెప్తాను. అతడు, ఆమె లాటి సర్వనామాలు వాడినప్పుడు దాన్ని రెండు రకాలుగా అది అర్థం చేసుకోడానికి అవకాశం ఉంది. వారిద్దరూ కొన్ని ప్రత్యేకలక్షణాలు గల వ్యక్తులు అని అనుకోవచ్చు పండిత పరమేశ్వరశాస్త్రిలా. లేదా ఆ ఇద్దరూ ఆనాటి యువతీయువకుకి ప్రతినిధులు అంటూ సాధారణీకరించేరు అనుకోవచ్చు.

ఈ నవల త్రిసంపుటి అన్నారు రచయిత. మొదటిభాగంలో అతడు అంటే చిదంబరశాస్త్రి. ఆమె అంటే శాంతం. మన దేశస్వాతంత్ర్యపోరాటం మొదలై, ఉధృతంగా సాగుతున్నసమయంలో ఆనాటి విద్యాధికులకి ప్రతినిధులు. చిదంబరశాస్త్రిలాటి “అతడు” శాంతంలాటి “ఆమె”లూ ఆనాడూ ఉన్నారు ఈనాడూ ఉన్నారు. అంచేత సార్వత్రికంగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి భావాలూ, వారి ప్రవర్తనలూ, నమ్మకాలూ, వీటితో పాటు ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులూ ఎంతో విపులంగా చిత్రించేరన్నమాట. రెండోభాగంలో వారి పెద్దకూతురు సుభ “ఆమె”. ఆమెస్నేహితుడు జనార్దనం “అతడు”. మూడోభాగంలో రెండోకూతురు లక్ష్మి “ఆమె”, ఆమెస్నేహితుడు భాస్కరం “అతడు”.

శైలివిషయంలో ముఖ్యవిషయం ఇది డైరీరూపంలో రాయడం అని ముందుమాటలో చెప్పేరు. అయితే ఇది ఒకరి డైరీ కాదు. పైన చెప్పినట్టు ముగ్గురు “అతడు”లూ, ముగ్గురు “ఆమె”లూ ఉన్నారు కనక ఆరు డైరీలు అనొచ్చు.  అంటే కప్పగంతులేస్తూ అక్కడక్కడ చదివేవారికి ఈ “నేను” ఎవరు అన్నప్రశ్న తలెత్తే అవకాశం ఉంది.  

కథ చెప్పిన తీరు, భాష సహజంగా, మనని ఆకట్టుకునేలా ఉన్నాయి. “కాంసు“ (కాబోలు), గ్యేపకం (జ్ఞాపకం), చూపుణ్ణు (చూపి ఉండును?) లాటి మాటలతోపాటు “అల్పగ్యతాభాగ్యం” లాటి కొత్త నుడికారం కూడా కనిపించి మురిపించిందని ఒప్పుకోక తప్పదు. అయితే నేను ఆకళించుకోలేకపోయిన సందర్భాలు కథ చక్కగా నడుస్తున్నప్పుడే తగిలేయి. ఒకచోట మొత్తం సంభాషణ అంతా ఇంగ్లీషులో సాగింది మూడు, నాలుగు పేజీలు. అదంతా తెలుగులిపిలో రాయడం జరిగింది. నాకు అలా ఇంగ్లీషు తెలుగులిపిలో చదవడం, చదివి అర్థం చేసుకోడం చాలా కష్టం. అలాటి సందర్భాలలో పాత్రలు ఇంగ్లీషుకి అలవాటు పడిపోయేరన్న సంగతి రచయిత మరో విధంగా పాఠకులకి తెలియజేసి ఉంటే బాగుండేది. దానికి తగిన మాధ్యమం సృష్టించుకోగలిగినప్పుడే రచయిత ప్రతిభ వ్యక్తమవుతుందని అని నా అభిప్రాయం. ఏ విషయమైనా కథలో ఉన్నదున్నట్టు చెప్పినప్పటికంటే ఇతరసాధనాలు వాడుకుని సూచనప్రాయంగా చెప్పడంలో కొత్తదనం, స్ఫూర్తి కనిపించడమే కాక, పాఠకులకి ఆలోచించుకోడానికి కూడా అవకాశం కల్పిస్తుంది, వారి మేధకి పని పెడుతుంది. అలాగే జనార్దనం బ్రిడ్డికట్టడానికి ఇంజినీరింగు లెక్కలు పాఠం పెట్టేయడం కూడా నా ఉత్సాహాన్ని కాస్త మందగించేలా చేసింది.  

రాజకీయసిద్ధాంతాలని స్వప్రయోజనాలకి వాడుకోడం, స్వప్రయోజనంకోసం కోట్లు మార్చేయడం చాలా వాస్తవికంగా చిత్రించేరు రచయిత. అయితే రాజకీయ చర్చలతోపాటు, నిత్యజీవితంలో వంటకాలవంటి సాధారణవిషయాలు కూడా సరదాగా ఉన్నాయి. శాస్త్రి ఎండావకాయ వర్ణన నోరూలా చేసింది. ఆకాలంలో మగవాళ్ళు వంటింటివేపు వచ్చేవారు కాదు చాలా ఇళ్ళల్లో. ముఖ్యంగా కొన్ని బ్రాహ్మణకుటుంబాల్లో ఇంట్లో భార్య తప్ప మరో ఆడమనిషి లేకపోతే తప్ప. 

నేను చదివినంతమేరకి, నాకు ఆశ్చర్యం కలిగించిన రెండు సందర్భాలు – తల్లీకూతుళ్లు చీటికి మాటికి కౌగలించుకోడం, ముద్దులు పెట్టుకోడం, తల్లిని కూతురు పెళ్ళికి ముందు సెక్స్ అనుభవించేరా అని ప్రశ్నించడం, మన సంప్రదాయంప్రకారం అసహజంగా అనిపించింది. కనీసం నాకాలంలో నేను వినలేదు అలాటివి. నిజానికి తల్లిగారి సెక్స్ జీవితంగురించి అమెరికాలో కూడా చాలా కుటుంబాల్లో మాటాడరు ఇప్పటికీ. రెండోది, సుప్రసిద్ధ నటి కేథరిన్ హెప్బర్న్ సౌందర్యంమూలంగా పేరు తెచ్చుకుంది అనడం. కేథరిన్ హేప్బర్న్ అందంగా ఉన్నా ఆవిడ కీర్తి సంపాదించుకున్నది కేరక్టర్ యాక్ట్రెస్‌గా. తమ సౌందర్యం కారణంగా పేరు తెచ్చుకున్నవాళ్ళు మెరిలిన్ మన్రో, కొంతవరకూ ఎలిజబెత్ టేలర్. మరి జర్మనీలో కేథరిన్ హెప్బర్న్‌కి అలాటి పేరు ఉండేదేమో ఆరోజుల్లో నాకు తెలీదు.      

ముందే చెప్పేను రెండోభాగంలో పెద్దకూతురికథ, మూడో భాగంలో రెండోకూతురి కథ అని. ఆ మూడోభాగానికొచ్చేసరికి, నాకు ఆసక్తి తగ్గిపోయింది. నాకు రాజకీయాల్లో, ఇలాటి వాదప్రతివాదాల్లో అంత ఆసక్తి లేదు మరి. నా రాజకీయ అజ్ఞానంగురించి మరో టపాలో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి,  దేశంలోస్వాతంత్ర్యం రాకముందు, సమరం జరుగుతున్నప్పుడూ, వచ్చేక  ఆ మూడుతరాల భావజాలంలో, సమాజంలో వచ్చినమార్పులు ఈ నవల చదివితే అర్థమవుతాయని మాత్రం అర్థమయింది.   

ఇంతకీ, ఈ అన్ని కారణాలవల్ల నేను పూర్తి చేయలేదీ పుస్తకం.

(డిసెంబరు 27, 2011)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.