నిన్న వంశీ మాగంటి నన్ను చకితురాలిని చేసేరు నేనే మరిచిపోయిన నా పాత కథ ఒకటి వెలికి తీసి “బుష్ కోటు వేసిన బ్లాగురు మాలతి గారు” అంటూ.
ఆయన పెట్టిన శీర్షిక చూస్తే నాకు గాంధీ టోపి అన్న వాడుక గుర్తుకొచ్చింది. ఈనాడు బుష్ కి ఉన్న ప్రాచుర్యం తలుచుకొచ్చి నవ్వుకున్నాను.
ఈ లింకు చూడండి. http://janatenugu.blogspot.com/2011/12/1954.html.
@ ఉదయరాణిగారూ, అదేనండీ నాబాధ కూడా. చదువు అంటే డబ్బు సంపాదించే నైపుణ్యం అన్న అర్థం వచ్చేసింది. మనకి పూర్వం విద్యార్జన, జ్ఞాన సముపార్ఝన, దానివల్ల మానసికంగా, మేధోపేతంగా ఎదగడం, మానవీయవిలువలు సంతరించుకోడం అన్న ధ్యాసం ఎవరికీ లేదిప్పుడు. మీఅభిప్రాయం పంచుకున్నందుకు ధన్యావాదాలు.
eppudo rasina eppatiki ade kada kondari samasya
-chaduvu job korakena? appati mee abhiprayamu eppatiki change ayivundachchu kada
-kani chaduvu -job kosamu kadu ante andaru nato differ avutunnaru malathi garu
@ మధురవాణి, నాక్కూడా ఆశ్యర్యంగానూ సంతోషంగానూ ఉంది ఆనాటి నాకథలని చదివి ఆనందించేవారు ఇప్పటికీ ఉన్నారంటే. మీరు మీఅభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు
@ మాలతి గారూ,
భలే సరదాగా ఉంది మాక్కూడా అప్పటి కథలు చదవడం, బుష్ కోటు కథతో పాటు వంశీ గారు ఈ రోజు పబ్లిష్ చేసిన ‘బ్రోకరు శేఖరు’ అనే గల్పిక కూడా చదివొచ్చాను. అంత చిన్న నిడివితో చమత్కారంగా భలే రాసారు. నాకు చాలా నచ్చేసాయి.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
లలితగారూ,
). శుభం. తప్పకుండా మొదలుపెట్టండి తూలిక4కిడ్స్. నాతరవాత తూలికపేరుమీద సాహిత్యకృషి లేశమాత్రంగానైనా కొనసాగాలని నా అభిలాష. నిజమే, పిల్లలకథలు రాసినట్టే ఉన్నాను. అవును, వంశీమోహన్ గారు నాక్కూడా మంచి సర్ప్రైజి ఇచ్చేరు, పైగా సకాలంలో అంటే నేనింక రాయలేను అని నీరసపడిపోతున్నసమయంలో. మీరూ ఆయనా కలిసి నాకు మళ్ళీమంచి ఉత్సాహం కలిగిస్తున్నారు. మీకూ,
నాకు అనేకవిధాల ప్రోత్సాహం కలిగిస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు, ఎర్లీ బర్డ్ శుభాకాంక్షలు
- నిడదవోలు మాలతి
మాలతి గారూ,
మీ కథలు అలా ఎదురు చూస్తున్నాయి క్యూలో. నేనిక తీరుబడి చేసుకొని పని మొదలు పెట్టాల్సిందే
మాగంటి (వంశీ) గారు బలే surprise ఇచ్చారు. ముందు వారి బ్లాగులో చూశాను. తర్వాత మీ టపా చూశాను. వంశీ గారికి బోలెడు ధన్యవాదాలు. మీ ‘భయం’ కథ లాగే ఇది కూడా పిల్లల కోసం కూడా బావుంటుంది. ఈ క్రొత్త సంవత్సరం తెలుగు4కిడ్స్ కోసం కొత్తవి ఓ పద్ధతి ప్రకారం మొదలు పెట్టాలని నా ఆశ. ఈ కథతో మొదలు పెట్టమంటారా? మీరు పిల్లల కోసం వ్రాయలేనని ఎందుకంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తూలిక4కిడ్స్ అనుకున్నామనుకుంటా కదూ అప్పట్లో
@లక్ష్మీ రాఘవ, అవునండీ, ఆరోజుల్లో బుష్ కోట్లూ, ఆవారా సినిమా అందరికీ తెలిసినవి. మీక్కూడా గుర్తుందన్నామాట. బాగుంది.
బుష్ షర్టు అని బాగా వినేవాళ్ళం ఆకాలం లో .”.అవారా ను చూస్తూ”…అని మీరు రాస్తే నిజంగా పప్పులో కాలేసాము ..బాగుంది మీ పాతకథ !!
@ జి. యస్. లక్ష్మి,హా, సంబరం మనలా కథలు చెప్పుకునేవాళ్ళకే కదండీ.
. అప్పుడే రాయడం మొదలుపెట్టేను కనక అట్టే రాయలేకపోయేను.
@ నాగేస్రావ్, హాహా, బాగా పట్టుకున్నారు. తలపుకొచ్చి, తలుచుకుని – ఈరెంటికీ క్రాస్ బ్రీడ్ అనుకుంటా ఆ ప్రయోగం. :p. తప్పులు క్షమించి కథ చదివినందుకు ధన్యవాదాలు.
ఆవారా అంతం బావుంది.
“తలుచుకొచ్చి” – ఈ ప్రయోగం గమ్మత్తుగా ఉంది. ఏమీ అనుకోపోతే కొంచెం వివరిస్తారా?
ఇలా జరిగినప్పుడు బలే సంబరంగా ఉంటుంది కదా..
నేను నిన్ననే చదివేసానండీ మీ కథ..
కొసమెరుపు బలే బాగుంది..