పూర్వపు సంకలనాల్లోలాగే ఇందులో కూడా ఐదు పాతరచనలు ఉన్నాయి. మొదటిమూడూ 1954లో రాసిన గల్పికలు. ఇందులో రెండు మాగంటి వంశీ మోహన్ గారు అంతర్జాలంలో చూసి నాకు తెలియజేసినవి. వీటిమీద ఆయన చేసిన వ్యాఖ్యలు వారి బ్లాగులో చూడండి. వారికి ధన్యవాదాలు.
మరొక మాట. నా సాహిత్యం పిడియఫ్ పేజీలో కొన్ని లింకులు తెగిపోయినట్టు ఇప్పుడే చూసి సరి చేసేను. అంచేత కావలసినవారు మరొకసారి అక్కడ చూడొచ్చు. ఇంకా మీకు తెరుచుకోకపోతే, దయచేసి నాకు చెప్పండి.