జులైలో నేను కల్పనని కలుసుకున్నప్పుడు, మాకబుర్లలో సంకలనాలప్రసక్తి వచ్చింది. ఆ తరవాత మన సాహిత్యచరిత్రగురించిన ప్రశ్నలు తలెత్తేయి. అంతకుముందు సౌమ్య మహిళావరణం చదువుతూ నాతో సంకలనాలవిషయం ప్రస్తావించడం కూడా ఒక కారణం మాకబుర్లకి. ఈరెండు చర్చలమూలంగా నాకు కొన్ని ఆలోచనలు వచ్చేయి.