తెలుగు తూలిక

మే 21, 2009

ఆతపచ్ఛాయలు

ప్రచురించిన వర్గము కవితలు — malathi @ 8:43 అపరాహ్నం

నిండుకుండ

ఆమె నిండుకుండ

అయినవాళ్లూ, కానివాళ్లూ కుమ్మరించిన

(ఇంకా…)

మే 14, 2009

ఇంద్రజాలం (కవిత)

ప్రచురించిన వర్గము కవితలు — malathi @ 8:50 అపరాహ్నం

మిత్రమా!

చూడమంటూ నువ్వంపిన ఫైలు

తెరవబోతున్న క్షణంలో

తటాలున కిటికీలో వెలిగిన తటిల్లత

(ఇంకా…)

అక్టోబర్ 1, 2008

మళ్లీ నాగురించే

ప్రచురించిన వర్గము కవితలు — malathi @ 9:53 అపరాహ్నం
Tags: ,

 

పొద్దున్నే, లచ్చిమి నీగురించి చెప్పూ అని అడుగుతోంది. మరిపాపం ఆపిల్ల పుట్టకముందే నేను రాయడం మొదలు పెట్టేను కదా. అంచేత మళ్లీ చెపుతున్నా. చాలామందికి తెలిసిన సంగతులే. హీహీహీ.

మరో అసలు నిజం కారణం లక్ష్మీకాన్తమ్మగారి మీద రాసిన వ్యాసం నలుగురికళ్లా పడలేదేమోనని అనుమానంగా వుంది. అంచేత ఇది టెస్టు డ్రైవు కూడా.

వ్యాఖ్యలు చూసి సవరించబడింది :) సమయం అపరాహ్నం 1.30

000 

 

సరే మళ్లీ చెపతా

మరోసారి నాగురించి.

పేరు మాలతి

ఇంటిపేరు నిడదవోలు.

కన్ఫ్యూజనవకండి మరే మాలతితోనూ

పుట్టింది ఇసాపట్టనంలో

పబ్బము గడుపుకుంటున్నది విస్కాన్సిను లో. 

వయసు చెపితే ఝడుసుకుంటారేమో

వున్నాయి డెబ్భైకి పైనే

నాకుంది ఒక అమ్మాయి

పేరు సరయు, వృత్తి -హాలివుడ్ తార

వివరాలకి చూ. www.thulika.net

 

పోతే

నారాతలు నాకాలక్షేపం,

కంప్యూటరు నా నేస్తం

కీబోర్డే నా సమస్తం

ప్రింటరు స్థిరాస్తి

ఫ్లాష్ డ్రైవు చరాస్తి

 

టీవీ ఇష్టసఖి

ఇష్టమొచ్చినపుడు

ఇష్టమయినవి తినడం నా సరదా

ఇష్టమొచ్చినట్టు తిరగడం మరో సరదా

 

దేవుడు బొత్తిగా లేడనను కానీ

he is minding his business

and I am minding mine.

I think I missed the common ground

somewhere along the way.

 

వ్యసనాల్లేవనుకోడం నా వ్యసనం

చేస్తుంది నా మొహం నిండా మోసం

నాగూట్లో నేను

ముడుచుకు పడుకోడమే

నాకు పరమానందం.

నామటుకు నాకు అదే పరమయోగసారం.

 

 

 

 

 

 

(ఫస్టోబరు 2008. )

(నోటు-  ఫస్టోబరు అన్నపదం ఆరుద్ర సృష్టించింది )

సెప్టెంబరు 1, 2008

నీడ, సంతాపసభ

ప్రచురించిన వర్గము కవితలు, సాహిత్యం — malathi @ 7:34 అపరాహ్నం
Tags: , ,

ఇది నా నూరో పోస్టు కావడం విశేషం!

 

నీడ

 

నేనెవరికీ కనిపించను

వాగొంతెవరికీ వినిపంచదు.

నాకోసమెవరూ

పరితపించరు

ఏనాడో.

ప్రపంచం మరిచినవెనుక

అగపడగలను

పుట్టలోనో

చెట్టుమీనో

కొండవాగులోనో

కోనసీమలోనో

ఛాయామాత్రంగా

ఎదురు కావచ్చు..

ఆనాడు

కళ్లు పొడుచుకు చూడు

సావధానుడవై విను

నా వునికీ, గళమూ

కోరుకున్నవారికి

మాత్రమే వేద్యం.

 

 

సంతాపసభ

 

ఈమధ్య ఎంచేతో

ఒబిచ్యురీలు చూసినప్పుడల్లా

ఇవే ఆలోచనలు నాకు.

నా దుకాణం ఎత్తేస్తే

ఎవరేమంటారా అని..

ఇప్పుడే తెలిసింది

అయ్యో కొట్టు మూతపడింది

నాణ్యమైన సరుకు

అందించిన షాపు

తెలుగురుచులు

విదేశాల చాటిన మేటి షాపు

మరి లేదిక మనకి

అంటారని.

దిక్కులు చూస్తున్నా

నాకొట్లో కూచుని.

ఎలా చెప్పను

 

నేనింకా బతికే వున్నానని

నాగుండె ఇంకా కొట్టుకుంటూనే వుందని

బతికుండగానే నన్ను పాతిపెట్టేయకండని

 

మీ మెప్పుకోళ్లకిది

సమయం కాదు.

ఇంకా అంతరించలేదు కనక

అనివార్యకారణాలు అసలే లేవు.

దుప్పట్లు కప్పడానికీ

పుష్పగుచ్ఛాలందించడానికీ

సంతాపసభలకీ

ఇంకా టైముంది.

తొందరపడకండని

 

(ప్రాణహితులకి కృతజ్ఞతలతో, సెప్టెంబరు, 2008. )

 

 

 

 

 

జూన్ 13, 2008

అనామకులు

ప్రచురించిన వర్గము కవితలు, సాహిత్యం — malathi @ 8:05 అపరాహ్నం
Tags: , ,

మార్చి 3, 2008

తాటిచెట్టు నీడ

ప్రచురించిన వర్గము కవితలు — malathi @ 7:01 పూర్వాహ్నం
Tags:

తాటిచెట్టు నీడ

సైడ్ వాక్ పైన సభలు తీరిన తరుసంతతి
నాతలపై నటరాజతాండవం అనుదినం

తొలిసంజవెలుగులు నడివీధిలో
మలిసంజదీపాలు పొరుగులానులపైన
నడిపొద్దు నీడలు కుదురుమట్టాన
నాతల కాయని నీడలు
నాగొడుగుపట్టని వనరులు

పల్లెకో సంత
వూరుకో సంఘం
వాడకో సదస్సు
మనిషికో మతం
వాదాలు, వినాదాలు
నినాదాలు సునాదాల వెన్నంటి
రెడ్డిరాజులు
కమ్మప్రభువులు
సెంటరుఫీల్డలులో సుబ్రాహ్మణ్యాలు
పులుసులో ముక్కలు

చిన్నా పెద్దా
తెలుపూ నలుపూ
ఆడేవారూ పాడేవారూ
పక్కతాళాలవారు
చెక్కభజనలవారూ

చీకాకోలునించీ రామకుప్పంవరకూ
వూరిపేర్లనుండీ వారసత్త్వాలవరకూ
ఆరాలు తీయువారు
వేరువేరుపేరులవారు

ఆనామకులకూ అంగుష్ఠమాత్రులకూ
ఆశల్ రేపుతూ దారంట తాళవృక్షాలు.

(ఎన్నెం. ఆగస్ట్ 2006)

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.