(ఎన్నెంకతలు 15)
“బాబ్బాబూ, నాపుస్తకం కాస్త అచ్చేసి పెట్టండి. చచ్చి మీకడుపున పుడతా.” - ఇది నిజానికి మధ్యమ స్థాయి.
ఆదిని, ఈ అచ్చొత్తడాలు లేనిరోజుల్లో, కవులు సభల్లోనూ, నడివీధిలోనూ ఆశువుగా కవితలు చెప్పేసేవారు. ఆపైన ఆకులమీద గిలికేస్తూ వచ్చారు.
ఆతరవాత కొంతకాలానికి గ్రేటు బ్రిటనునుండి యంత్రాలొచ్చేయి. అసలు నన్నడిగతే నాగరీకం అన్నమాట ఎలా వచ్చిందో కాని మనదంతా పశ్చమీకం తెలుగువారికంటె ఎక్కువగా తెల్లవారే పూనుకుని మహోత్సాహంతో పుస్తకాలూ, పత్రికలూ అచ్చేసేసేరు. అసలు కారణం క్రైస్తవీకరణమే అయినా, మన పుస్తకాలక్కూడా [...]
పూర్తి టపాని చదవండి »
(ఎన్నెంకతలు 14. తెలుగు జ్యోతి, న్యూజెర్సీ, పత్రిక, జూన్ 2008, లో సంక్షిప్తరూపంలో ప్రచురింపబడింది)
నాచిన్నప్పుడు నేను ఉత్తరాలు బాగా రాసేదాన్నిట. -ట అని ఎందుకంటున్నానంటే ఓసారి నాస్నేహితురాలు, ఫిఫ్తుఫారంలో క్లాస్‌మేటు రాసిన మాట అది. అవి ఇంకా అణాలూ, కాణీలూ చెలామణీ అయేరోజులు. ఒకసారి తను నాకు రాసింది, “సత్తుఅణాలిచ్చి మల్లెపూలు కొనుక్కున్నట్టు నువ్వు రాసే వుత్తరాలకోసం నేను నీకు ఉత్తరాలు రాస్తున్నాను” అని. ఎంత మనోజ్ఞమయిన భావన! నిజంగానే నేను అంత గొప్పగా రాసేదాన్నని చచ్చినా [...]
పూర్తి టపాని చదవండి »
మూఢనమ్మకాలు ఇది 2002 లో రాశాను కానీ కథాకాలం 70 దశకంగా గుర్తిందాలి.
pdf మళ్లీ చేసాను. కనిపించకపోతే చెప్పండి. .
పూర్తి టపాని చదవండి »
Posted in నాకథలు, సాహిత్యం, అఁటిఁచబడినది కథలు, వ్యాసాలు, సాహిత్యం on జూన్ 23, 2008 | 12 వ్యాఖ్యానాలు »
(ఎన్నెమ్ కతలు 13)
కథా? బ్లాగా? సీరియస్‌గానే అడుగుతున్నాను. ఆమధ్య నాకు హఠాత్తుగా అనుమానం వచ్చింది బ్లాగుకీ కథకీ తేడా ఏమిటి, ఏవి కథలు, ఏవి బ్లాగులు అని.
బహుశా తేడా విషయంలోనేమో అనిపిస్తోంది. ఎలా రాస్తున్నారని కాక ఏం రాస్తున్నారన్నదానికే పెద్దపీట అనుకుంటాను. కథలో పేర్లు మార్చి, రూపురేఖలు మార్చి, స్థలాలూ కాలాలూ మార్చి, వున్నవి దాచి, లేనివి కల్పించి చెప్తాం. నేను “కాఫీ రంగూ రుచీ” గురించి రాసినప్పుడు అలవాటుగా కల్పించి కాఫీ మానేసేనని [...]
పూర్తి టపాని చదవండి »
Posted in నాకథలు, సాహిత్యం, అఁటిఁచబడినది కథలు, సాహిత్యం on జూన్ 13, 2008 | 2 వ్యాఖ్యానాలు »
(ఎన్నెంకతలు 12)
“హలో అంటే ఐదూ”,“హలో కులాసా అంటే పదీ”, .. “అఋణ”, “కఋణ” .. లాటి వాక్య మరియు పదవిన్నాణంతో ముళ్లపూడి వెంకటరమణగారు ఋణాలనందలహరి అనబడే ఋణవేదం రాసి తెలుగుపాఠకలోకాన్ని శాశ్వతంగా తమకి ఋణగ్రస్తుల్ని చేసేసుకున్నారు. మరింక ఆ అప్పులగురించి మనం రాయలేం. “ఆఋ” యోజనాలదూరంనుండి కూడా ఆయనవేపు కన్నెత్తి చూడలేం.
డబ్బుమాట వచ్చింది కనక చెప్తున్నా. సుమతీశతకం రాసినాయన “అప్పిచ్చువాడు, వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు ఏరును చొప్పడిన వూరు”లోనే వుండమన్నాడు. కానీ అమెరికాలో అలా [...]
పూర్తి టపాని చదవండి »
Posted in డయాస్ఫొరా, నాకథలు, హాస్యం, అఁటిఁచబడినది కథలు, హాస్యం on జూన్ 1, 2008 | 3 వ్యాఖ్యానాలు »
ఊసుపోక - కలగంటి, కలాగంటి …
(ఎన్నెంకతలు 11)
… కమలారేకులవంటి కన్నులూ గలా స్వామిని కాదులెండి.
మామూలుగా నాకు కలలు రావు. అంచేత ఈకల ఎందుకు వచ్చిందా అని చర్చ మొదలుపెట్టుకున్నాను నాతో నేను. .. ఇంటర్నెట్ చూతాం అనుకున్నా గానీ ఈఇంగ్లీషువాళ్లతో చిక్కు. నదులన్నీ సాగరంలో కలిసినట్టు, ఏవస్తువూ, ఆలోచనా అయినా అటు తిప్పి, ఇటు తిప్పి ఏ ఫ్రాయిడుదరికో ఎంగిలుదరికో చేరుస్తారు. అణగారిపోయిన కోరికలే కలలై కనిపిస్తాయని ఈవిజ్ఞులసుభాషితం. అంతకుమించి ఇంకేమైనా ఆలోచనలకి తావుందా అంటే [...]
పూర్తి టపాని చదవండి »
అడిదము సూరకవి (1720-1785)
క. ఊరెయ్యది? చీపురుపల్లె
పేరో? సూరకవి యింటిపేర డిదమువార్
మీరాజు? విజయరామ మ
హారాజ తడేమి సరసుడా? భోజుడయా..
నాచిన్నతనంలో నాకు చాలా నచ్చిన పద్యాల్లో ఇదొకటి. మనం రోజూ ఆడుకునే మాటలు - వూరూ, పేరూ - ఇలా అతిసామాన్యమైనవి పద్యంలో పొందుపరచడం నాకు మనసున బాగా నాటుకుంది.
చినవిజయరామరాజు భోజుడని చెప్పుకోడానకి ముందు సూరన ఆర్థికంగా చాలా బాధలు పడ్డాడు. ఆయన తండ్రి భాస్కరయ్య లక్షణసారం రాసేడని చెప్పుకోడమే కాని ఇప్పుడు అందుబాటులో లేదు.
18వ శాతాబ్దం తొలి పాదంలో [...]
పూర్తి టపాని చదవండి »
Posted in నాకథలు, సాహిత్యం, అఁటిఁచబడినది కథలు, సాహిత్యం on మే 18, 2008 | 1 అభిప్రాయం »
జీవాతువు కథ
1961లో రాసిన కథ. నీచేతను, నాచేతను, వరమడిగిన కుంతిచేతను.. వరసగా ఆరుగురిచేత వంచింపబడినా కర్ణుడు యుద్దం చేస్తునే వున్నాడు
పూర్తి టపాని చదవండి »