అనామకులు
Posted in కవితలు, వ్యంగ్యం, సాహిత్యం, అఁటిఁచబడినది Add new tag, కవితలు, సాహిత్యం on జూన్ 13, 2008 | 2 వ్యాఖ్యానాలు »
అనామకులు కవిత
Posted in కవితలు, వ్యంగ్యం, సాహిత్యం, అఁటిఁచబడినది Add new tag, కవితలు, సాహిత్యం on జూన్ 13, 2008 | 2 వ్యాఖ్యానాలు »
అనామకులు కవిత
Posted in కవితలు, సాహిత్యం, అఁటిఁచబడినది కవితలు, సాహిత్యం on ఫిబ్రవరి 24, 2008 | 1 అభిప్రాయం »
నిరీక్షణ
*
చిన్నప్పుడు స్కూల్ బస్సుకోసం
చల్లని సాయంత్రాలకోసం
ఆసాయంసమయాల బీచిలో
ఇసకలో కట్టే పిచిగ్గూళ్లకోసం
ఆగూళ్లలో చేరే పిట్టలకోసం
పెద్దపండుక్కోసం
పట్టుపరికిణీకోసం
గోదావరి ఆనకట్టపై
పరుగుల్తీసే రైలుబండీకోసం
ఆరైలుబండీకమ్మీల్లోంచి
చిమ్మచీకట్లు చీల్చుకుంటూ
వెలుగులు కురుసే దీపాలతోరణాలకోసం
ఏతావాతా
చదువుల్తెచ్చే డిగ్రీలకోసం
ఆడిగ్రీలిచ్చే ఉద్యోగాలకోసం
ఆఉద్యోగాల్లో ప్రమోషన్లకోసం
ఆప్తుల ఆమోదముద్రకోసం
నాలుగువీధులకూడలిలో పచ్చవెలుక్కోసం
మనసిచ్చి మాటాడే మనిషికోసం
అలనాటి ఆప్తురాలు
కాకమ్మచేతనైనా అంపే కబురుకోసం
ఋజువైన చెలిమికోసం
ఎండకోసం
వానకోసం
ఆకురాలు కాలంలో
కొమ్మలు చిమ్మే వింతసొగసులకోసం
తిరిగొచ్చే చివుళ్లకోసం
ఎదురుచూస్తున్నాను అర్ధశతాబ్దిగా
మూడంతస్థులమేడల్లో
ఐదంకెల ఆదాయాల్తో
కోరితెచ్చుకున్న ఈతిబాధల్తో
వాలుకుర్చీల్లో విలాసంగా
వెనక్కి వాలి
భారతీయసాంప్రదాయం
వైరాగ్యం ఔన్నత్యం గూర్చి
వివరిస్తుంటే
వింటున్నాను ఓపిగ్గా.
తరంగాలెళ్తే స్నానం చేస్తానంటూ
సముద్రపొడ్డున
ముడుచుక్కూచున్న బడుగుబాపడిలా
ఎదురుచూస్తున్నాను.
ఏఉద్గ్రంథానికో
అస్తవ్యస్తంగా రాస్తున్న
నాందీప్రస్తావనలా వుంది
జీవనహేల.
తుదిపలుకు మాటే లేదు మరి.
*
(తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో, తెలుగువెలుగు, 2003, లో ప్రచురితం. )
Posted in కవితలు, సాహిత్యం, అఁటిఁచబడినది సాహిత్యం, కవితలు, క on ఫిబ్రవరి 12, 2008 | అభిప్రాయాలు లేవు »
గ్రహ బలాబలాలు.
సూర్యమాన గ్రహచారంలో
దలైలామా, అమెరికాఅధ్యక్షడూ కేన్సీరియన్లు
ఉభయులకూ కేంద్రం ఆత్మ.
ఒకరికి ఆదర్శం ఆత్మావలోకనం
రెండోవారు చేస్తున్నారు ఆత్మప్రదక్షిణం
ఒకరికి ఆలంబన విశ్వమానవసౌభ్రాతృత్వం
రెండోవారికి విశ్వం సర్వస్వామ్యసంకలితం.
ధృవాంతరసీమలకు విస్తరిల్లిన
వారి తేజోపుంజాలు
మిరుమిట్లు గొల్పుతున్నాయి
కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
అలివికాని అంధకారంలో
మురికివాడలో
నా ఇరుకుగదిలో
వెతుక్కుంటున్నాను
ఆల్చిప్పంత జాగాకోసం.
మూడోపాదం మోపనున్న వామనుడిలా.
నేను మూడో కేన్సీరియనుని.
(జూన్ 23, 2007. ఈమాట.కామ్ లో ప్రచురింపబడింది.)
Posted in కవితలు, సాహిత్యం, హాస్యం, అఁటిఁచబడినది కవితలు, సాహిత్యం on ఫిబ్రవరి 7, 2008 | 1 అభిప్రాయం »
చెలగాటం, దృష్టిదోషం, తెలుగునుడికారం.
Posted in కవితలు, సాహిత్యం, అఁటిఁచబడినది కవితలు on ఫిబ్రవరి 4, 2008 | అభిప్రాయాలు లేవు »
నావేదనతో కలిసి మేమిద్దరం
నాస్నేహితురాలు సాయిపద్మమూర్తి రాసిన కవిత, painకి నా అనువాదం. http://www.angelfire.com/realm3/telugu/ లో ప్రచురింపబడింది.
బాధ అనుభవైకవేద్యం. సానుభూతికోసం చెప్పే అనునయవాక్యాలు సాంత్వన చేకూర్చవు సరికదా, అలా చెప్పేవారిని చూస్తే నాకు జాలేస్తుంది అంటుంది మా పద్మ.
Posted in కవితలు, వ్యంగ్యం, సాహిత్యం, అఁటిఁచబడినది కవితలు on జనవరి 28, 2008 | 1 అభిప్రాయం »
శునకేంద్రభోగాలు
ఈనాడు మానాట
కుక్కలకు గౌరీకల్యాణం
కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు
ఆవులను కోసి కుక్కలను మేపుట సర్వసాధారణం
ఇచట
కుక్కతిండికి వ్యయం ఏటికి పదహారు బిలియనులు
గ్రామసింహాల పళ్లు తోమడానికీ
ఒళ్లు కడగడానికీ
మరో తొమ్మిది బిలియనులు
యజమానులు తీరిచి దిద్దుకుంటున్నారు
ముద్దుకుక్కల ముఖవిలాసం
కుక్కలకున్నాయి
ఫర్‌కోటులూ, ఆభరణాలూ
అందాలపోటీలూ,
ఆరామస్థలాలు
సంఘాలు, సమావేశాలు
వెరసి వ్యయం
యేటికి యాభై బిలియనులు
మాసార్వభౌముల
సలహాదారులు *లోరా, బార్నీ,
వారిలో బార్నీవాక్కులకే అధికప్రాధాన్యం.
అందుకే సామాన్యులకి కుక్కగతి
మానవజన్మనెత్తి
నానా ఆగచాటులు పడుటేల
అమెరికాలో కుక్కగా
పుట్టిన కలుగు
అష్టశ్వైర్యములు, అనన్యసామాన్య భోగబాగ్యాలు
(* లోరా సార్వభౌముల అర్థాంగి, బార్నీ వారి ముద్దుకుక్క అని గ్రహించగలరు)
000
(మా.ని. జనవరి 200
Posted in కవితలు, సాహిత్యం, అఁటిఁచబడినది కవితలు on జనవరి 26, 2008 | అభిప్రాయాలు లేవు »
ధర్మకాటా
ఆకలేస్తే అన్నం తిను
చలేస్తే దుప్పటీ కప్పుకోమంటూ
నోటిలెక్కల్లా
బహుతేలిక
ఈనాటి నాగరీకప్రపంచంలో
ప్రతిసమస్యకీ
రెడీమేడ్ జవాబు
కంటికానని
అనుభవాలు
పరమాణుల్లా
కోటానుకోట్లు
అణువణువూ
గతానుగతికంగా
ప్రపంచాన్ని పాలిస్తోంది
చట్టాలని సృష్టిస్తోంది
నిజానికి
అంతరాంతరాల్లోంచి
పుట్టుకొచ్చే వణుక్కి
దుప్పట్లెక్కడా దొరకవు
అకాడమీలందిచ్చే
ధర్మనిర్ణయాలు
సామాన్యులకి
సాంత్వన కూర్చవు
వారి తీర్పులు
వీరి బతుకుల
మూసపోసిన అచ్చుల్లా
అమరవు.
(మాలతి, 10-24-1997)
Posted in కవితలు, సాహిత్యం, అఁటిఁచబడినది కవితలు on జనవరి 26, 2008 | 2 వ్యాఖ్యానాలు »
సౌమ్య వ్యాఖ్యానం చూసినతరవాత తప్పు దిద్దుకుంటున్నాను. ఇస్మాయిల్ గారికి నా క్షమాపణలు.
– మాలతి.
చెట్టు ఆదర్శం?
.
చెట్టు తమ ఆదర్శం
అంటారు మన కవులు
మరి
ఈనాడు మూడులోకాలకూ
పనికొస్తోంది వనచయం
సంచులూ, కంచాలూ కూర్చిపెట్టటానికీ,
ముక్కూ, మూతీ,
ముందూ వెనకా ఒత్తుకోటానికీ
ఇల్లూ వాకిలీ సోకులు జేసుకోటానికీ.
అయ్యో రాతా!
ఇదా నేను ఏరికోరి
వలచి వరించిన బతుకని
కుమిలి కుళ్లిపోతోంది చెట్టు.
Posted in కవితలు, వ్యంగ్యం, సాహిత్యం, హాస్యం, అఁటిఁచబడినది కవితలు, సాహిత్యం on జనవరి 21, 2008 | అభిప్రాయాలు లేవు »
అప్పగింతలు
ఈమాట.కామ్, తెలుగుపీపుల్.కామ్ లో ప్రచురితం.