నీలితెరలమాటున
Posted in డయాస్ఫొరా, నాకథలు, సాహిత్యం, అఁటిఁచబడినది Add new tag, కథలు, డయస్ఫొరా కథలు, సాహిత్యం on ఏప్రియల్ 30, 2008 | 3 వ్యాఖ్యానాలు »
నీలితెరల మాటు
కంప్యూటరుముందు కూర్చుని వెబ్బుమబ్బుల్లో ఓలలాడుతోంది నీల కాని మనసంతా రాబోయే మెయిలుమీదే వుంది.
తెల్లార్తూనే తొలికప్పు కాఫీలాగానే ఈమెయిలు కూడా అలవాటయిపోయింది వారం తిరక్కుండా.
కిందటి మంగళవారం వచ్చింది మొదటి మెయిలు. ఆరోజు నీలకి ఆదేమంత ప్రత్యేకంగా అనిపించలేదు. ఎవరో రామలక్ష్మిట ఓ మెయిలు పంపింది.
తనేదో మెయిలు చూసుకుంటుంటే ఓమూలని వెలిగిన కవరుబొమ్మ చూసి నీల యదాలాపంగా నొక్కింది దాన్ని.
“కొత్తతలపులు” సైటులో మీకవిత ఇప్పుడే చూశాను. చాలా బావుంది″. - రామలక్ష్మి.
″థాంక్స్ అండీ″. జవాబు కొట్టింది నీల
ఆవిడ [...]