Posted in నాకథలు, హాస్యం, అఁటిఁచబడినది కథలు, డయాస్ఫోరా, హాస్యం on మార్చి 4, 2008 | 5 వ్యాఖ్యానాలు »
వూసుపోక - కాలువిరిగిన కలదు సుఖము.
(ఎన్నెంకతలు 4)
కాలు కాదులెండి. యతి కుదిరిందని షోకులు పోయేను :). నిజంగా విరిగింది చెయ్యి. కుడిచేయి. తన్మూలంగా నాకు పట్టుబడ్డ కొత్త సుళువులే ఈకత.
సర్జరీ అయి ఇంటికి వచ్చాక, ఎడంచేత్తో నేనేం చెయ్యగలనో ఏంచెయ్యలేనో అంచనా వేసుకోడం నా మొదటి వ్యాపకం అయింది.
సర్జరీ అయి ఇంటికి వచ్చాక, ఎడంచేత్తో నేనేం చెయ్యగలనో ఏంచెయ్యలేనో అంచనా వేసుకోడం నా మొదటి వ్యాపకం అయింది.
ఓరోజంతా ఆస్పత్రినీళ్లతో ప్రాణం విసిగి, మొట్టమొదట కావల్సివచ్చింది ఓకప్పు చిక్కటి [...]
పూర్తి టపాని చదవండి »
Posted in కవితలు, వ్యంగ్యం, అఁటిఁచబడినది డయాస్ఫోరా on మార్చి 3, 2008 | అభిప్రాయాలు లేవు »
తాటిచెట్టు నీడ
సైడ్ వాక్ పైన సభలు తీరిన తరుసంతతి
నాతలపై నటరాజతాండవం అనుదినం
తొలిసంజవెలుగులు నడివీధిలో
మలిసంజదీపాలు పొరుగులానులపైన
నడిపొద్దు నీడలు కుదురుమట్టాన
నాతల కాయని నీడలు
నాగొడుగుపట్టని వనరులు
పల్లెకో సంత
వూరుకో సంఘం
వాడకో సదస్సు
మనిషికో మతం
వాదాలు, వినాదాలు
నినాదాలు సునాదాల వెన్నంటి
రెడ్డిరాజులు
కమ్మప్రభువులు
సెంటరుఫీల్డలులో సుబ్రాహ్మణ్యాలు
పులుసులో ముక్కలు
చిన్నా పెద్దా
తెలుపూ నలుపూ
ఆడేవారూ పాడేవారూ
పక్కతాళాలవారు
చెక్కభజనలవారూ
చీకాకోలునించీ రామకుప్పంవరకూ
వూరిపేర్లనుండీ వారసత్త్వాలవరకూ
ఆరాలు తీయువారు
వేరువేరుపేరులవారు
ఆనామకులకూ అంగుష్ఠమాత్రులకూ
ఆశల్ రేపుతూ దారంట తాళవృక్షాలు.
(ఎన్నెం. ఆగస్ట్ 2006)
పూర్తి టపాని చదవండి »
Moved to englishthulika.wordpress.ocm
Please visit my English site for this and other articles in English.
పూర్తి టపాని చదవండి »
Posted in నాకథలు, సాహిత్యం, అఁటిఁచబడినది డయాస్ఫోరా on ఫిబ్రవరి 19, 2008 | అభిప్రాయాలు లేవు »
విధీ, హతవిధీ!
మాకాండోలో రిపేరొచ్చిందని మామానేజరుని పిలిచేవరకూ నాకువిధి వైపరీత్యాలగురించిన ఆలోచనలు రాలేదు.
వంటింట్లో కొళాయి చుక్కలు చుక్కలుగా కారుతుంటే మామానేజరుకి ఫోను చేశాను. నాకసలు ఫోనులో మాటాడ్డం సరిపడదు. నామాట వాళ్లకర్థం కాదు, వాళ్లమాట నాకర్థం కాదు పెళ్లిమంత్రాల్లాగే. మమ అనమన్నప్పుడల్లా మమ అనేసి వూరుకోడమే.
రెండు రోజులు ఎదురు చూశాను మానేజరు వెంటనే వచ్చేసి, నవ్వుమొహంతో నాకొళాయి బాగుచేసేసి, నన్నానందపరిచేసి వెళ్తాడని. వారంరోజులయింది. ఎక్కడా అతగాడి జాడ లేదు. తెగించి మళ్లీ పిలిచాను. నాలుగు రోజులయింది. మళ్లీ ప్రయత్నంచేను. [...]
పూర్తి టపాని చదవండి »
Posted in నాకథలు, హాస్యం, అఁటిఁచబడినది డయాస్ఫోరా on ఫిబ్రవరి 17, 2008 | 9 వ్యాఖ్యానాలు »
ఊసుపోక -పచ్చిమిరపకాయ బజ్జీ
ఎన్నెంకతలు 2
చలి ..చలి … మంచు బ్లిజర్డూ ముంచుకొచ్చి ముంచేస్తోందీరోజు ఇక్కడ. వీధిలోకెళ్లడం గగనం. వేడివేడిగా కారంగారంగా పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకుని సోఫాలో ముడుకు పడుకుని టీవీ చూసుకోవాలనిపిస్తోంది.
నేను చిన్నప్పటినుంచే కారాలూ మిరియాలూ నూరుతూ పుట్టలేదు. అసలు నేను సగటుకారం కూడా తినలేనని మాఅమ్మ నాకోసం కూర వేరే తీసిపెట్టేది. అలాటిది అమెరికా వచ్చేక కారం అలవాటయింది. నేనే చేసుకున్నాను.
ముఖ్యకారణం డోనట్లు. అవి చూడ్డానికి గారెల్లా కనిపించి మురిపించి నన్ను మోసం చేసేయి. మొదటిసారి [...]
పూర్తి టపాని చదవండి »
పలుకు వజ్రపుతునక
నిన్న అప్ లోడ్ చేసిన ఫైలులో అక్షరాలు సరిగా కనిపించడంలేదని నాస్నేహితురాలు మెయిలు చేసింది. అంచేత మళ్లి సంస్కరించి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా సమస్యే అయితే తెలుపగలరు. ఇండియాలో చక్కగా ఇంగ్లీషు చదువుకుని వచ్చాక కూడా, ఇక్కడి భాష కొత్తగానే వుంటుంది.
పూర్తి టపాని చదవండి »