Feed on
టపాలు
వ్యాఖ్యలు

‘నాకథలు’ టాగుతో ఉన్న టపాలు

మద్రాసు టు తిరుపతి
మరో పాతకథ

పూర్తి టపాని చదవండి »

ఓ గొలుసు కథ
మనసాంప్రదాయంలో వాచ్యంకాని పరస్పరాభిమానాలకి రూపకల్పన. ఓహెన్రీ కథలు చదివినతరవాత అలాటికథ రాయలనిపించింది. అప్పుడే ఒకబ్బాయి మీరుతీసుకోండి అమ్మగారూ అంటూ పాతకాలంనాటి గొలుసు తీసుకొచ్చాడు నాదగ్గరికి. అదీ ఈగొలుసువెనక కథ.

పూర్తి టపాని చదవండి »

తల్లీ నిన్ను దలంచి
ఈనాటి రెండు కథలు (టపాలు) గురించి ఒకమాట. నేను ఈరెండు కథలు రాసినప్పుడున్న అభిప్రాయాలు కేవలం పాక్షికమని గత రెండు నెలలోనూ నాకు స్పష్టమయింది. అందరిలాగే నేనూ తెలుగు సమసిపోతోందనీ, ఈనాటి యువత తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నారనీ అనుకున్నపుడు రాసిన కధలివి. కాని కొన్ని బ్లాగులు చూసాక, ఎంతోచక్కని తెలుగు రాయగల, తెలుగంటే అభిమానంగల తెలుగువాళ్లు చాలామంది వున్నారని అర్థం అయింది. మీఅభిప్రాయాలు రాసినప్పుడు నాదృష్టిలో వచ్చిన ఈమార్పుని గమనించవలసిందిగా నాకోరిక.

ఉభయభాషాప్రవీణ
ఈకథ ఇంగ్లీషులో ప్రచురించినతరవాత, [...]

పూర్తి టపాని చదవండి »

కొనేమనిషి
నేను అమెరికా వచ్చినతరవాత 1976లో రాసిన తొలికథ. మానవసంబంధాలన్నీ ఆర్థికప్రతిపత్తి పైనే ఆధారపడి వుంటాయన్న ఆలోచనకి మరొక కోణం.

పూర్తి టపాని చదవండి »

కొత్తసీసా, పాతసారా
స్థానిక కాలేజీలో నాకు ఉద్యోగం దొరికినప్పుడు కొండనందుకున్నట్టు పొంగిపోయాను. ఎందుకంటే నాకు ప్రాణపదమైన మానవతావిలువలకి సంబంధించిన పని అది. ప్రతి విద్యార్థీ ఒకసెమెస్టరులో పది గంటలసేపు సాంఘికసేవ చెయ్యాలి. దానికి కొన్ని నియమాలు వున్నాయి. ఆనియమాలు వివరించడం, వాళ్లని చక్కని రాజమార్గాన నడపడం నా విధి.
మాడైరెక్టరు నాకు వివరాలు చెప్పినప్పుడు నాకు చిన్న నవ్వొచ్చింది. మేం చిన్నప్పుడు కాపీబుక్కుల్లో రాసేవాళ్లం “ఆడి తప్పరాదు”, “తల్లిదండ్రులు దేవునితో సమానము” లాటివి. దాంతో నీతులూ రాతలూ కూడా నీటుగా [...]

పూర్తి టపాని చదవండి »

రంగుతోలు
డయాస్ఫొరా కథ. మనదేశంలో నలుపు సౌందర్యానికి సంబంధించిన చిహ్నం అయితే, అమెరికాలో జాతికి చిహ్నం. రెండు నెగిటివ్ కోణాలే. ఆతేడా విశ్లేషించి చూసినప్పడు పాజిటివ్ స్ఫూర్తి కలిగే అవకాశం వుంది.
ఈమాట.కామ్ లోప్రచురితం.

పూర్తి టపాని చదవండి »

జీవనమాధుర్యం
1960లనాటికథ. ఆత్మీయతలూ అంతఃకరణలూ వేరు. అవి ఎదుటివారికి కనిపించేతీరు వేరు.

పూర్తి టపాని చదవండి »

తృష్ణ
1970లనాటి ఈకథ నేను తిరపతిలో వున్నప్పుడు రాసింది. ఈకథలో బాలయ్యలా చాలామందికి నాలుగోతరగతి వుద్యోగులలో చదవాలన్న ఆసక్తి వున్నా, మనవ్యవస్థ ప్రోత్సహించదు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు.  

పూర్తి టపాని చదవండి »

చివురుకొమ్మ చేవ
2002లో ఇ-పత్రిక, ఆంధ్రజ్యోతి, తరవాత తెలుగునాడిలో ప్రచురితమైన ఈకథలో చిన్నపిల్లలు మనమనుకున్నంత అమాయకులు కారని ఆవిష్కరించడానికి ప్రయత్నించాను. నావయసువాళ్లు అంతచిన్నపిల్లకి అంతపెద్దమాటలేమిటి అన్నారు కాని ఈరోజుల్లో పిల్లలచురుకుదనం చాలామంది చూడగలరనే నానమ్మకం.

పూర్తి టపాని చదవండి »

పాత టపాలు »