పూర్వకవులు-వేములవాడ భీమకవి
Posted in సాహిత్యం, అఁటిఁచబడినది పూర్వకవులకథలు on ఫిబ్రవరి 27, 2008 | 4 వ్యాఖ్యానాలు »
పూర్వకవులకథలు - వేములవాడ భీమకవి
హయమది సీత పోతవసుధాధిపుఁడారయ రావణుండు ని
శ్చయముగ నేను రాఘవుఁడ వహ్యజవారిధి మారుఁడంజనా
ప్రియతనయుండు లచ్చన విభీషుణుఁడా గుడిమెట్ట లంక నా
జయమును బోతరక్కసుని చావును నేడవనాడు చూడుడీ!
ఇది పూర్వకవులలో ప్రముఖుడయిన వేములవాడ భీమకవి చెప్పిన పద్యం.
భీమకవి కాలం ఇంతవరకూ ఎవరూ నిర్ధారణ చేయలేదు కాని ఆయనగురించి చెప్పుకునే కథలు చాలా వున్నాయి. ముఖ్యంగా జననం గురించి. గోదావరిమండలంలో ద్రాక్షారామ భీమేశ్వరాలయం ప్రాంతంవాడని ఒకకథనం. ఆయన తల్లి బాలవితంతువు, సాటి చెలులతో కలిసి భీమేశ్వరస్వామి [...]