(ఎన్నెంకతలు 14. తెలుగు జ్యోతి, న్యూజెర్సీ, పత్రిక, జూన్ 2008, లో సంక్షిప్తరూపంలో ప్రచురింపబడింది)
నాచిన్నప్పుడు నేను ఉత్తరాలు బాగా రాసేదాన్నిట. -ట అని ఎందుకంటున్నానంటే ఓసారి నాస్నేహితురాలు, ఫిఫ్తుఫారంలో క్లాస్‌మేటు రాసిన మాట అది. అవి ఇంకా అణాలూ, కాణీలూ చెలామణీ అయేరోజులు. ఒకసారి తను నాకు రాసింది, “సత్తుఅణాలిచ్చి మల్లెపూలు కొనుక్కున్నట్టు నువ్వు రాసే వుత్తరాలకోసం నేను నీకు ఉత్తరాలు రాస్తున్నాను” అని. ఎంత మనోజ్ఞమయిన భావన! నిజంగానే నేను అంత గొప్పగా రాసేదాన్నని చచ్చినా [...]
పూర్తి టపాని చదవండి »
Posted in నాకథలు, సాహిత్యం, అఁటిఁచబడినది కథలు, వ్యాసాలు, సాహిత్యం on జూన్ 23, 2008 | 12 వ్యాఖ్యానాలు »
(ఎన్నెమ్ కతలు 13)
కథా? బ్లాగా? సీరియస్‌గానే అడుగుతున్నాను. ఆమధ్య నాకు హఠాత్తుగా అనుమానం వచ్చింది బ్లాగుకీ కథకీ తేడా ఏమిటి, ఏవి కథలు, ఏవి బ్లాగులు అని.
బహుశా తేడా విషయంలోనేమో అనిపిస్తోంది. ఎలా రాస్తున్నారని కాక ఏం రాస్తున్నారన్నదానికే పెద్దపీట అనుకుంటాను. కథలో పేర్లు మార్చి, రూపురేఖలు మార్చి, స్థలాలూ కాలాలూ మార్చి, వున్నవి దాచి, లేనివి కల్పించి చెప్తాం. నేను “కాఫీ రంగూ రుచీ” గురించి రాసినప్పుడు అలవాటుగా కల్పించి కాఫీ మానేసేనని [...]
పూర్తి టపాని చదవండి »
నా మొదటితూలిక, www.thulika.net,లో
ఆరుద్రమీద వ్యాసం, 30లక్షల పందెంకథ కి కొత్తపాళీ అనువాదం, నాయని క్రిష్ణకుమారిగారి కవిత్వంమీద వైదేహీ శశిధర్ పరిశీలనాత్మకవ్యాసం చూడండి. ఇంగ్లీషుమాత్రమే చదవగల మీమిత్రులకి పరిచయం చెయ్యండి.
ఇప్పటికే నాసైటు ప్రచారంచేస్తున్నవారికి కృతజ్ఞతలు.
అలాగే ఈలింకుమీద కూడా ఓకన్నేయండి. నాకథ “Two Glass Bubbles” is published on desijournal.com
http://www.desijournal.com/article.asp?articleid=329.
పూర్తి టపాని చదవండి »
ఆరుద్ర చిన్నకథలు - ఒక పరిశీలన
″సుబ్బారావున్నరగంటలసేపు″ - చూడగానే అచ్చుతప్పు కాబోలు అనిపించే ఈపదబంధం ఆరుద్రగారి కథలసంకలనంలో ″ఇందలి నీతిః చెడలేదు″ అన్నకథలోది.
సమగ్రాంధ్రసాహిత్యం, త్వమేవాహం, డిటెక్టివ్ నవలలూ, సినిమాపాటలూ, డైలాగులరచయితగా చాలామందికి గుర్తుండిపోయిన ఆరుద్ర చిన్నకధలు కూడా రాశారు. సాహిత్యంలో వివిధప్రక్రియలలో మాత్రమే కాదు, ఆయనకి జ్యోతిషం, గారడీ, నాట్యశాస్త్రంవంటి విద్యలతో కూడా పరిచయం వుంది.
1966లో ప్రచురింపబడిన ″ఆరుద్రకథలు″ చిన్నపుస్తకం. డెమీసైజు. 175 పేజీలు. 25 కథలున్నాయి. మూడు కథలు తప్పిస్తే, ప్రతికథా అయిదారు పేజీల్లో అయిపోతుంది. [...]
పూర్తి టపాని చదవండి »
Posted in చర్చలు, సాహిత్యం, అఁటిఁచబడినది వ్యాసాలు, సాహిత్యం, కథలు on ఏప్రియల్ 8, 2008 | 2 వ్యాఖ్యానాలు »
ఊసుపోక. ఉగాది కోరిక
(ఎన్నెం కతలు 7)
అమరావతీపట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు
ఓరుగల్లున రాజవీరలాంఛనముగా పలుశస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగరరాజవీధుల కవితకు పెళ్లిపందిళ్లు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున ఆంధ్రసామ్రాజ్య దిగ్జయస్తంభమెత్తించునాడు
ఆంధ్రసంతతికి ఏమహితాభిమాన దివ్యదీక్షా సుఖస్ఫూర్తి తీవరించె
ఆమహావేశమర్థించి ఆంధ్రులారా, ఆంధ్రులారా
చల్లుడు చల్లుడాంధ్రలోకమున అక్షతలు నేడు.
ఇదే ఆరునెలలకిందట నేను ఈపద్యంగురించి రాస్తే, బహుశా ఇలా మొదలుపెట్టి వుండేదాన్ని. ″చాలామందికి తెలియకపోవచ్చు కానీ టంగుటూరి సూర్యకుమారి అని మాతెలుగుదేశంలో చాలాగొప్ప గాయని వుండేవారు. రాయప్రోలు సుబ్బారావుగారని ఒకగొప్పకవి వుండేవారు …″ అంటూ.
నేను ఈబ్లాగులలోకంలోకి వచ్చింతరవాత ఇలా చెప్పడం అనవసరం [...]
పూర్తి టపాని చదవండి »
Posted in చర్చలు, సాహిత్యం, అఁటిఁచబడినది వ్యాసాలు, సాహిత్యం on ఏప్రియల్ 4, 2008 | అభిప్రాయాలు లేవు »
పాఠకులకీ రచయితలకీ మధ్యగల అవినాభావసంబంధం
ఈరోజుల్లో వస్తున్న విమర్సలూ అభిప్రాయాలమీద నా అభిప్రాయం ఏమిటని నిన్న ఓస్నేహితురాలు అడిగారు. కథలకీ బ్లాగులకీ తేడా వున్నా, ఈవ్యాసం ఇక్కడ కూడా వర్తిస్తుందన్న అభిప్రాయంతో ఇక్కడ పెడుతున్నాను. మీరేం అంటారో చెప్పండి.
పూర్తి టపాని చదవండి »
Posted in చర్చలు, సాహిత్యం, అఁటిఁచబడినది వ్యాసాలు, సాహిత్యం on మార్చి 24, 2008 | 12 వ్యాఖ్యానాలు »
నాజీవనదృక్పథం నాసాహిత్యదృక్పథమే…
–నిడదవోలు మాలతి
(“మీభూమి” వారపత్రిక, హైదరాబాదు, కి సమర్పించినవ్యాసం, మార్పులతో)
నాజీవనదృక్పథం రాయమని మీభూమి వారపత్రికకోసం కేతు విశ్వనాథరెడ్డిగారు అడిగింతరవాత చాలా నేను ఆలోచించవలసివచ్చింది. ఎందుకంటే నేను జీవితంగురించి అంత లోతుగా ఆలోచించను ఆరోగ్యంకాదని. జీవితం సీరియస్‌గా తీసుకోను. చాలా చిన్ననాడే “నేను వేర”న్న అభిప్రాయం నామనసులో స్థిరపడిపోయింది. అంటే హెచ్చుతగ్గులమాట కాదు నేను చెప్తున్నది. నేనెక్కువ అని నేనెప్పుడూ అనుకోలేదు కాని వేరని మాత్రం అనుక్షణం అనిపిస్తుంది. పదిమంది నడిచేదారి పనిగట్టుకు తప్పుకుతిరిగే జాతి నాది.
మేం ఐదుగురం. [...]
పూర్తి టపాని చదవండి »
Posted in సాహిత్యం, హాస్యం, అఁటిఁచబడినది వ్యాసాలు, సాహిత్యం, కథలు on మార్చి 19, 2008 | 10 వ్యాఖ్యానాలు »
ఊసుపోక - నసాంకేతికం
(ఎన్నెం కతలు - 3)
హెచ్చరిక - ఘనసాంకేతికనిపుణులకు ఈ అసాకేంతికాలూ, నసాంకేతికాలు నచ్చవు. ఇది కేవలం నాలాటి అసాంకేతికేయులతోనూ (బొత్తిగా సాంకేతికపరిజ్ఞానం లేనివారు), నసాంకేతికేయులతోనూ (ఏదో తెలుసుకోవాలన్న తహతహతో నస పెట్టే మధ్యస్థ సాంకేతికేయులు) కలబోసుకు ఇకిలించుకోడానికి మాత్రమే.
ఈతరతమతరగతులని ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే - బుద్ధిగా కాలేజీకెళ్లి చక్కగా చదువుకుని సాంకేతికనిపుణులుగా చెలగుతున్నవారు ఘనసాంకేతికనిపుణులు. వీరు నిరంతరం ప్రోగ్రాములు రాయడమో, పాతవి తిరగరాయడమో చేస్తూ సకలజనులకు వెలుగు చూపుతారు. (అందువల్ల నాలాటివారికి కాస్త ఇబ్బందే [...]
పూర్తి టపాని చదవండి »
Posted in సాహిత్యం, అఁటిఁచబడినది వ్యాసాలు, సాహిత్యం on మార్చి 13, 2008 | 2 వ్యాఖ్యానాలు »
పూర్వకవులు -వెంగమాంబ (తరువాయిభాగం)
(ఎన్నెం కతలు)
మొదటి వ్యాసం రాసినతరవాత, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు రాసిన సరస్వతీ సామ్రాజ్యవైభవము రూపకం నాకు కనిపించింది. బెజవాడ గోపాలరెఢ్డిగారి కోరికపై ఆంధ్రరచయిత్రుల ప్రజ్ఞాపాటవాలు లోకులకు తెల్లం చేసే ఉద్దేశ్యంతో రాసినరూపకమని ముందుమాటలో చెప్పారు ఆమె. తొమ్మదిమంది ప్రముఖకవయిత్రులని ఒకచోట చేర్చి, వారి కావ్యాలలో ప్రాచుర్యం పొందినపద్యాలను ఉటంకిస్తూ, సూత్రధారుడు, కలభాషిణివంటి సముచితపాత్రలతో రసవత్తరంగా నడిపిన రూపకం ఇది.
అందులో వెంగమాంబరచనలుగా ఉదహరించిన రెండు పద్యాలు ఇక్కడ చేరుస్తున్నాను. మొదటిది వెంగమాంబగారు రచించిన వేంకటేశ్వరమహాత్మ్యంలోనిది. సున్నితమైన చమత్కారం, [...]
పూర్తి టపాని చదవండి »
పూర్వకవులు - తరిగొండ వెంగమాంబ
స్త్రీలలో కవులుగా ప్రసిద్ధికెక్కినవారు అట్టే లేకపోయినా, లభ్యమయిన వారి కథలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. సాధారణంగా నాకు నచ్చేవి ఆడవారిలో కానీ మగవారిలో కానీ వారు ప్రదర్శించే వ్యక్తిత్వాలు. కష్షాలు జీవితంలో ఒకభాగం. వాటిని అధిగమించి తమ జీవితాలని మలుచుకోడం మానవనైజం. పూర్వకవులలో భీమనలాగే తరిగొండ వెంగమాంబ కూడా సారస్వతాభిమానుల ఆదరణ చూరగొన్న కవయిత్రి.
వెంగమాంబ కడపజిల్లా తరిగొండలో కృష్ణయామాత్యుని ఇంట 18వశాతాబ్దం ఉత్తరార్థంలో జన్మించినట్టు పరిశోధకులఅభిప్రాయం. తల్లి మంగమాంబ. వెంగమాంబకి వెంకమ్మ, [...]
పూర్తి టపాని చదవండి »