Feed on
టపాలు
వ్యాఖ్యలు

‘హాస్యం’ టాగుతో ఉన్న టపాలు

(ఎన్నెంకతలు 15)
 
“బాబ్బాబూ, నాపుస్తకం కాస్త అచ్చేసి పెట్టండి. చచ్చి మీకడుపున పుడతా.” - ఇది నిజానికి మధ్యమ స్థాయి.
ఆదిని, ఈ అచ్చొత్తడాలు లేనిరోజుల్లో, కవులు సభల్లోనూ, నడివీధిలోనూ ఆశువుగా కవితలు చెప్పేసేవారు. ఆపైన ఆకులమీద గిలికేస్తూ వచ్చారు.
ఆతరవాత కొంతకాలానికి గ్రేటు బ్రిటనునుండి యంత్రాలొచ్చేయి. అసలు నన్నడిగతే నాగరీకం అన్నమాట ఎలా వచ్చిందో కాని మనదంతా పశ్చమీకం తెలుగువారికంటె ఎక్కువగా తెల్లవారే పూనుకుని మహోత్సాహంతో పుస్తకాలూ, పత్రికలూ అచ్చేసేసేరు. అసలు కారణం క్రైస్తవీకరణమే అయినా, మన పుస్తకాలక్కూడా [...]

పూర్తి టపాని చదవండి »

(ఎన్నెంకతలు 14. తెలుగు జ్యోతి, న్యూజెర్సీ, పత్రిక, జూన్ 2008, లో సంక్షిప్తరూపంలో ప్రచురింపబడింది)
 
 
నాచిన్నప్పుడు నేను ఉత్తరాలు బాగా రాసేదాన్నిట. -ట అని ఎందుకంటున్నానంటే ఓసారి నాస్నేహితురాలు, ఫిఫ్తుఫారంలో క్లాస్‌‌మేటు రాసిన మాట అది. అవి ఇంకా అణాలూ, కాణీలూ చెలామణీ అయేరోజులు. ఒకసారి తను నాకు రాసింది, “సత్తుఅణాలిచ్చి మల్లెపూలు కొనుక్కున్నట్టు నువ్వు రాసే వుత్తరాలకోసం నేను నీకు ఉత్తరాలు రాస్తున్నాను” అని. ఎంత మనోజ్ఞమయిన భావన! నిజంగానే నేను అంత గొప్పగా రాసేదాన్నని చచ్చినా [...]

పూర్తి టపాని చదవండి »

(ఎన్నెంకతలు 12)
 
“హలో అంటే ఐదూ”,“హలో కులాసా అంటే పదీ”, .. “అఋణ”, “కఋణ” .. లాటి వాక్య మరియు పదవిన్నాణంతో ముళ్లపూడి వెంకటరమణగారు ఋణాలనందలహరి అనబడే ఋణవేదం రాసి తెలుగుపాఠకలోకాన్ని శాశ్వతంగా తమకి ఋణగ్రస్తుల్ని చేసేసుకున్నారు. మరింక ఆ అప్పులగురించి మనం రాయలేం. “ఆఋ” యోజనాలదూరంనుండి కూడా ఆయనవేపు కన్నెత్తి చూడలేం.
 
డబ్బుమాట వచ్చింది కనక చెప్తున్నా. సుమతీశతకం రాసినాయన “అప్పిచ్చువాడు, వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు ఏరును చొప్పడిన వూరు”లోనే వుండమన్నాడు. కానీ అమెరికాలో అలా [...]

పూర్తి టపాని చదవండి »

ఊసుపోక - కలగంటి, కలాగంటి …
(ఎన్నెంకతలు 11)
 
… కమలారేకులవంటి కన్నులూ గలా స్వామిని కాదులెండి.
మామూలుగా నాకు కలలు రావు. అంచేత ఈకల ఎందుకు వచ్చిందా అని చర్చ మొదలుపెట్టుకున్నాను నాతో నేను. .. ఇంటర్నెట్ చూతాం అనుకున్నా గానీ ఈఇంగ్లీషువాళ్లతో చిక్కు. నదులన్నీ సాగరంలో కలిసినట్టు, ఏవస్తువూ, ఆలోచనా అయినా అటు తిప్పి, ఇటు తిప్పి ఏ ఫ్రాయిడుదరికో ఎంగిలుదరికో చేరుస్తారు. అణగారిపోయిన కోరికలే కలలై కనిపిస్తాయని ఈవిజ్ఞులసుభాషితం. అంతకుమించి ఇంకేమైనా ఆలోచనలకి తావుందా అంటే [...]

పూర్తి టపాని చదవండి »

(ఎన్నెమ్ కతలు 10)

 కిందటివారం తనబ్లాగులో సౌమ్య రాసిన “పుస్తకాలు చదవడం ఎందుకు“ అన్న బ్లాగు చూశారు కదా. దానిమీద వచ్చినవ్యాఖ్యలలో తలెత్తిన ఒక ఉపప్రశ్న “ప్రత్యేకించి తెలుగు పుస్తకాలు చదవడం ఎందుకు?” అన్నది. దానిమీద సౌమ్య నన్ను అడిగింది, “మీరు తెలుగు పుస్తకాలు ఎందుకు చదువుతార”ని (సర్వే చేస్తున్నట్టు J.).
 
“అలా అడిగితే నేను చెప్పలేను, తరవాత వివరంగా రాస్తాలే” అన్నాను. తీరా మొదలిపెట్టింతరవాత, చదవడంకంటె మాట్లాడడంగురించిన ఆలోచనలే ఎక్కువగా ముసురుకున్నాయి నాతల్లో. అంచేత అక్కడే మొదలుపెడతాను. [...]

పూర్తి టపాని చదవండి »

ఊసుపోక - ఏపేరెట్టి పిల్చినా …
(ఎన్నం కతలు 6)
రోజు విరజిమ్మునవే పరిమళములు అన్నాడు ఇంగ్లీషుకవి. కాని పేరులు వేరులయినప్పుడు రాగల తికమకలు ఆయన గుర్తించినట్టులేదు.
నాలుగురోజులకిందట సాటిబ్లాగరులలో ఒకరు పొరపాటున నాపేరు రవంత సవరిస్తేనూ మరొకరు అది గమనిస్తేనూ, నాకు కొన్ని పాత సంగతులూ, మరికొన్ని కొత్త ఆలోచనలూ తగిలేయి.
అందులో మొదటిది అమెరికాలో అడుగెట్టగానే తెల్లవారినాలుకలమీద మాఅమ్మా నాన్నగారు బారసాలనాడు పెట్టినపేరు పొందగల రూపాంతరాలు - మానికా, మెలనీ, మేరీ, మలాతీ, మరతీ, మెలథై — ఇలా [...]

పూర్తి టపాని చదవండి »

ఊసుపోక 5 - వినదగు నెవ్వరు చెప్పిన
(ఎన్నెంకతలు)
వినదగు నెవ్వరు జెప్పిన
వినినంత వేగిరపడక వివరింపం దగు
కని కల్లనిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుండు మహిలో సుమతీ.
నేను నాచిన్నప్పుడూ, మీరు బహుశా ఈమధ్యనా, చదివిన సుమతీశతకంలోని ఈపద్యం నాకంటే మీకే ఎక్కువ గుర్తుండొచ్చు. ఎవరు చెప్పినా వినాలి. నాజీవితంలో మొదటిసగం మాఅమ్మమాట వింటూ వచ్చేను. తరువాతిసగం మాఅమ్మాయిమాట వింటున్నాను. మా అమ్మా, నాన్నగారూ, అక్కయ్యా, అన్నయ్యా, ఇరుగూ, పొరుగూ, క్లాసుమేటులూ, కూరగాయలమనిషీ .. ఎవరు చెప్పినా వింటూనే వచ్చేను. అదేం అని [...]

పూర్తి టపాని చదవండి »

వూసుపోక - కాలువిరిగిన కలదు సుఖము.
(ఎన్నెంకతలు 4)
కాలు కాదులెండి. యతి కుదిరిందని షోకులు పోయేను :). నిజంగా విరిగింది చెయ్యి. కుడిచేయి. తన్మూలంగా నాకు పట్టుబడ్డ కొత్త సుళువులే ఈకత.
సర్జరీ అయి ఇంటికి వచ్చాక, ఎడంచేత్తో నేనేం చెయ్యగలనో ఏంచెయ్యలేనో అంచనా వేసుకోడం నా మొదటి వ్యాపకం అయింది.
సర్జరీ అయి ఇంటికి వచ్చాక, ఎడంచేత్తో నేనేం చెయ్యగలనో ఏంచెయ్యలేనో అంచనా వేసుకోడం నా మొదటి వ్యాపకం అయింది.
ఓరోజంతా ఆస్పత్రినీళ్లతో ప్రాణం విసిగి, మొట్టమొదట కావల్సివచ్చింది ఓకప్పు చిక్కటి [...]

పూర్తి టపాని చదవండి »

తల్లీ నిన్ను దలంచి
ఈనాటి రెండు కథలు (టపాలు) గురించి ఒకమాట. నేను ఈరెండు కథలు రాసినప్పుడున్న అభిప్రాయాలు కేవలం పాక్షికమని గత రెండు నెలలోనూ నాకు స్పష్టమయింది. అందరిలాగే నేనూ తెలుగు సమసిపోతోందనీ, ఈనాటి యువత తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నారనీ అనుకున్నపుడు రాసిన కధలివి. కాని కొన్ని బ్లాగులు చూసాక, ఎంతోచక్కని తెలుగు రాయగల, తెలుగంటే అభిమానంగల తెలుగువాళ్లు చాలామంది వున్నారని అర్థం అయింది. మీఅభిప్రాయాలు రాసినప్పుడు నాదృష్టిలో వచ్చిన ఈమార్పుని గమనించవలసిందిగా నాకోరిక.

 

పూర్తి టపాని చదవండి »

కాఫీ, రంగూ రుచీ

పూర్తి టపాని చదవండి »