Feed on
టపాలు
వ్యాఖ్యలు

‘Add new tag’ టాగుతో ఉన్న టపాలు

drukkonaalu

పూర్తి టపాని చదవండి »

అనామకులు కవిత

పూర్తి టపాని చదవండి »

(ఎన్నెంకతలు 12)
 
“హలో అంటే ఐదూ”,“హలో కులాసా అంటే పదీ”, .. “అఋణ”, “కఋణ” .. లాటి వాక్య మరియు పదవిన్నాణంతో ముళ్లపూడి వెంకటరమణగారు ఋణాలనందలహరి అనబడే ఋణవేదం రాసి తెలుగుపాఠకలోకాన్ని శాశ్వతంగా తమకి ఋణగ్రస్తుల్ని చేసేసుకున్నారు. మరింక ఆ అప్పులగురించి మనం రాయలేం. “ఆఋ” యోజనాలదూరంనుండి కూడా ఆయనవేపు కన్నెత్తి చూడలేం.
 
డబ్బుమాట వచ్చింది కనక చెప్తున్నా. సుమతీశతకం రాసినాయన “అప్పిచ్చువాడు, వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు ఏరును చొప్పడిన వూరు”లోనే వుండమన్నాడు. కానీ అమెరికాలో అలా [...]

పూర్తి టపాని చదవండి »

అడిదము సూరకవి (1720-1785)
క. ఊరెయ్యది? చీపురుపల్లె
పేరో? సూరకవి యింటిపేర డిదమువార్
మీరాజు? విజయరామ మ
హారాజ తడేమి సరసుడా? భోజుడయా..
నాచిన్నతనంలో నాకు చాలా నచ్చిన పద్యాల్లో ఇదొకటి. మనం రోజూ ఆడుకునే మాటలు - వూరూ, పేరూ - ఇలా అతిసామాన్యమైనవి పద్యంలో పొందుపరచడం నాకు మనసున బాగా నాటుకుంది.
చినవిజయరామరాజు భోజుడని చెప్పుకోడానకి ముందు సూరన ఆర్థికంగా చాలా బాధలు పడ్డాడు. ఆయన తండ్రి భాస్కరయ్య లక్షణసారం రాసేడని చెప్పుకోడమే కాని ఇప్పుడు అందుబాటులో లేదు.
18వ శాతాబ్దం తొలి పాదంలో [...]

పూర్తి టపాని చదవండి »

ఎన్నెంకతలు -9 దీపాలార్పు దినము
http://battibandh.wordpress.com/2008/05/18/

పూర్తి టపాని చదవండి »

(ఎన్నెం కతలు 8 - నా దినం)
రానున్న ఆదివారం అమ్మదినం. ఆశుభసందర్భంలో నాదినం ఎలావుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే కొత్తగా పరిచయం అయినవాళ్లు నన్ను సాధారణంగా అడిగే మూడో లేక నాలుగో ప్రశ్న “మీరేం చేస్తారండీ రోజంతా“ అని.
ఎందుకంటే మొదటి రెండో లేక మడో ప్రశ్నల్లో తెల్లమయే విషయాలు - ఉజ్జోగంలేదు సజ్జోగం లేదు. సాకడానికి చిన్నా పొన్నా పిల్లల్లేరు. (సరయూని నావంతు సాకడం అయిపోయిందిలెండి), సోషలైజు చేయడానికి సావాసాల్లేవు, మరి పొద్దెలా పోతుందని,
ఏంచేస్తున్నానా అని [...]

పూర్తి టపాని చదవండి »

నీలితెరల మాటు
కంప్యూటరుముందు కూర్చుని వెబ్బుమబ్బుల్లో ఓలలాడుతోంది నీల కాని మనసంతా రాబోయే మెయిలుమీదే వుంది.
తెల్లార్తూనే తొలికప్పు కాఫీలాగానే ఈమెయిలు కూడా అలవాటయిపోయింది వారం తిరక్కుండా.
కిందటి మంగళవారం వచ్చింది మొదటి మెయిలు. ఆరోజు నీలకి ఆదేమంత ప్రత్యేకంగా అనిపించలేదు. ఎవరో రామలక్ష్మిట ఓ మెయిలు పంపింది.
తనేదో మెయిలు చూసుకుంటుంటే ఓమూలని వెలిగిన కవరుబొమ్మ చూసి నీల యదాలాపంగా నొక్కింది దాన్ని.
“కొత్తతలపులు” సైటులో మీకవిత ఇప్పుడే చూశాను. చాలా బావుంది″. - రామలక్ష్మి.
″థాంక్స్ అండీ″. జవాబు కొట్టింది నీల
ఆవిడ [...]

పూర్తి టపాని చదవండి »

తాపత్రయం పెద్దకథ

పూర్తి టపాని చదవండి »

jamakharcula1
మిత్రులు రాజేంద్రగారి సలహాననుసరించి, స్కాన్ చేసిన ఒక పాతకథ ఇక్కడ పెడుతున్నాను. నాదగ్గర అన్నీలేవు, వున్నవి కూడా ఇలా శిధిలావస్థలో వున్నాయి ఓసారి వరదలొచ్చి.
నయనానందకరంగా లేకపోయినా, 1982నాటి, చెణుకులూ, ప్రకటనలూ కూడా చూస్తారని పెట్టేను, మీకు ఎలా వుందో చెప్పండి.
 

పూర్తి టపాని చదవండి »