చెట్టు

సౌమ్య వ్యాఖ్యానం చూసినతరవాత తప్పు దిద్దుకుంటున్నాను. ఇస్మాయిల్ గారికి నా క్షమాపణలు.
— మాలతి.

చెట్టు ఆదర్శం?

.
చెట్టు తమ ఆదర్శం
అంటారు మన కవులు
మరి
ఈనాడు మూడులోకాలకూ
పనికొస్తోంది వనచయం
సంచులూ, కంచాలూ కూర్చిపెట్టటానికీ,
ముక్కూ, మూతీ,
ముందూ వెనకా ఒత్తుకోటాని‌కీ
ఇల్లూ వాకిలీ సోకులు జేసుకోటానికీ.

అయ్యో రాతా!
ఇదా నేను ఏరికోరి
వలచి వరించిన బతుకని
కుమిలి కుళ్లిపోతోంది చెట్టు.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “చెట్టు”

  1. అనిల్ అట్లూరి, గోపీచంద్ గారి కథ నేను చదవలేదు కానీ కడిమిచెట్టు చదివేవుంటాను. ఇప్పుడు పేరు తప్ప మరేం గుర్తులేదు. మీకు నాకవిత అంత పెద్దవారిరచనలు గుర్తు చేయడం నాకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు

    మెచ్చుకోండి

  2. త్రిపురనేని గోపిచంద్ కథ ‘తుమ్మ చెట్టు‌’ (మాకు ఉన్నయి స్వగతాలు)ని గుర్తు చేసింది – మీ చెట్టు. విశ్వనాధ వారి కడిమి చెట్టు మరొక కథ.

    మెచ్చుకోండి

  3. నేను ఇస్మాయిల్ కవితలేమీ చదవలేదు. తిలక్ అని చదివినట్టు అనిపించింది. 😦
    నేను రాసింది తప్పు కావచ్చు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s