శునకేంద్రభోగాలు

శునకేంద్రభోగాలు

ఈనాడు మానాట
కుక్కలకు గౌరీకల్యాణం
కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు
ఆవులను కోసి కుక్కలను మేపుట సర్వసాధారణం
ఇచట
కుక్కతిండికి వ్యయం ఏటికి పదహారు బిలియనులు
గ్రామసింహాల పళ్లు తోమడానికీ
ఒళ్లు కడగడానికీ
మరో తొమ్మిది బిలియనులు
యజమానులు తీరిచి దిద్దుకుంటున్నారు
ముద్దుకుక్కల ముఖవిలాసం
కుక్కలకున్నాయి
ఫర్‌కోటులూ, ఆభరణాలూ
అందాలపోటీలూ,
ఆరామస్థలాలు
సంఘాలు, సమావేశాలు
వెరసి వ్యయం
యేటికి యాభై బిలియనులు
మాసార్వభౌముల
సలహాదారులు *లోరా, బార్నీ,
వారిలో బార్నీవాక్కులకే అధికప్రాధాన్యం.
సామాన్యజనాలకి కుక్కగతి

మానవజన్మనెత్తి
నానా ఆగచాటులు పడుటేల
అమెరికాలో కుక్కగా
పుట్టిన కలుగు
అష్టశ్వైర్యములు, అనన్యసామాన్య భోగబాగ్యాలు

(* Laura జార్జ్ బుష్ అర్థాంగి, బార్నీ వారి ముద్దుకుక్క అని గ్రహించగలరు)
000

(మా.ని. జనవరి 2008)

2 thoughts on “శునకేంద్రభోగాలు

  1. అవును. కరక్టే. ఈ రోజు పేపర్లో అనుకుంటా, ఒక ఫొటొ చూస్తే, విచిత్రంగా అనిపించింది. ఆ ఫొటొలో ఒక జాతి కుక్క యజమాని, తన కుక్క పట్టే మంచినీటిని తాను ముందు తాగిచూసి, మరీ ఆ కుక్క కి పట్టించాడు. ఇది “అతి”కి పరకాశ్టేమో అనిపించినిది.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.