అనామకులు

లోకాన

నలుగురో పదిమందో

ధీరులు, పరమయోగులు

జ్ఞానులు, తాత్త్వికులు

నాయత్వం వహించి

పదిమందికి మార్గదర్శకులు

విశ్వాసంతో ముందు నడుస్తారు

మంచి జీవితం ఎలా ఉండాలో

Happiness అంటే ఏమిటో

శాస్త్రనిర్ణయాలు చేస్తారు

వారి వెంట

అనేకానేక జనానీకం

ముందు వారందించిన

పడికట్టురాళ్లు నెత్తికెత్తుకు

వారి భాషణలు

వల్లె వేసుకుంటూ

ఆఉప్పే వెనకవారిక్కూడా

పంచిపెడుతూ

పరమానందంగా ముందుకి సాగుతారు.వారి భాషణలు

వల్లె వేసుకుంటూ

ఆఉప్పే వెనకవారిక్కూడా

పంచిపెడుతూ

పరమానందంగా ముందుకి సాగుతారు.

మూడోరకం ఉన్నారు

ఎందునా పొందనివారు

ఏ దిక్కూ తోచనివారు

దారిపక్కన

క్రీనీడన పొంచుని

ఆశ్చర్యంతోనో

అమాయకత్వంతోనో

అయోమయంగానో

అసహాయంగానో

నిలబడిపోతారు.

ముందున్న నడుస్తున్న నాయకుల్నీ

ఆ వెనక ఉత్సాహంగా

ఉరకలలేస్తూ సాగిపోతున్న

జనసందోగాన్నీ

చూస్తూ

Alice in Wonderland లా

అంతరార్థాలు వెతుక్కుంటూ

వాళ్లు

ఊరూ పేరూ లేనివాళ్లు

నెత్తిన డాలరు పెడితే డైముకి చెల్లనివారు

వారివల్ల కూడా ఉందోలాభం

ప్రతి మార్గదర్శకుడికీ

చుట్టూ చేరిన భజనపరులతోపాడు

మరో మంద కూడా

ఉంటేనే కదా సంతృప్తి

ముగ్గులోకి దింపడానికి

ఎలక్షన్లలో ఒటరులలా.

అప్పుడే నాయకులకి

తమగోలులతో పరిపూర్ణ తాదాత్మ్యం.

000

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “అనామకులు”

  1. అవునండీ గుడ్డిగవ్వే.
    ఇది ఎప్పుడో ఏదో ఫాంట్స్ తో చేసిన పిడియఫ్ పైలు. ఇప్పుడు మార్చడానికి వసతి లేదు. సారీ, 🙂

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s