అచ్చేసుకున్న పుస్తకం – రెండో భాగం.

 

 

అచ్చేసుకున్న పుస్తకం రెండో భాగం.

 

వెనక టపాలో క్రియేట్స్పేస్ డాట్ కామ్  సంస్థ ఎలా పని చేస్తుందో మళ్లీ రాస్తానని చెప్పేను కదా. ఆమాట చెప్పడానికే ఈ టపా.

 

మామూలుగా చాలా పి.ఒ.డి (పబ్లిష్ ఆన్ డిమాండ్) వాళ్లు కొంత సెటప్ ఫీ అడుగుతారు. 600నుండి మూడు వేల డాలర్లవరకూ వుండొచ్చు మనం వాళ్ల సాయం ఎంతవరకూ అడుగుతాం అన్నదాన్ని బట్టి. క్రియెట్ స్పేస్ లో సెటప్ ఫీ లేదు. ఇన్ని కాపీలు మనం కొని తీరాలన్న నియమం లేదు. సర్వహక్కులూ మనవే. మనం మళ్లీ ఇంకోచోట కావలిస్తే ప్రచురించుకోవచ్చు. వాళ్లు ఇచ్చిన ISBN నెంబరు వాడుకోడానికి మాత్రం వీల్లేదు. ఇప్పుడు నేను ఇండియాలో నాపుస్తకం ప్రచురించుకోవాలంటే, మరో ASIN నెంబరుతో ఇదే పుస్తకం ప్రచురించుకోవచ్చన్నమాట. చేద్దాం అనుకుంటున్నాను కూడా కేవలం ఇండియాలో మార్కెట్ చెయ్యడానికి,.

 

 క్రియేట్.కాం, వారు కొన్ని గైడులైనులు ఇస్తారు. పుస్తకం మొత్తం అట్టలషోకునించీ లోపలిపేజీలవరకూ వాళ్ల గైడ్ లైనులకి అనుగుణంగా తయారుచేసి ఇవ్వాలి, పిడియప్.లో ఫార్మాట్ చేసి ఇవ్వాలి. రకరకాల సైజులన్నాయి. ఏసైజు అన్నది మన ఇష్టం. కవరు పేజీ సొంతంగా తయారు చేసుకోడం చేతకాకపోతే వాళ్ల టెంప్లేటు వాడొచ్చు. ఆటెమ్‌‌ప్లేటుమీద బొమ్మలూ, అక్షరాలూ పెట్టడానికి ఏదో ఫొటో సాఫ్టువేరు వాడాలి. నేను వాడినవి రెండు. Paint.NET. ఇది వుచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండోది Roxio Easy DVD/CD Creatorతో వచ్చిన PhotoSuite 9. ఇది కొన్నాను. దీనితోనే ఎక్కువ తంటాలొచ్చేయి.

పెయింట్.నెట్ బాగానే పని చేసింది. ఎటొచ్చీ నాకున్న నసాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని సాధించడానికి మూడు వారాలు పట్టింది. అంతా అయింతరవాత, వాళ్లకి పంపిస్తే, బొమ్మ 300 డిపిఐ వుండాలి, నువ్వు పంపింది 96 డిపిఐలో వుంది, బొమ్మ స్ఫుటంగా రాదు పుస్తకం అట్టమీదు అన్నారు.

సరే నేను తంటాలు పడలేనని ఆపీసుమాక్సుకి తీసుకెళ్లి నాకెలా కావాలో అంతా చెప్పి, చెయ్యమన్నాను. 20 డాలర్లు ఇచ్చుకుని అతనిచేత చేయిస్తే, అదీ నేను చేసినట్టే బొమ్మ 300 డిపిఐలో లేదు. అప్పుడు నేనే కూర్చుని బొమ్మ 300 డిపిఐకి సరిదిద్ది, ఆఫీసుమాక్సుకి ఇచ్చి పీడియఫ్‌గా మార్చమని చెప్పేను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఇదంతా మొదటి పుస్తకంతో, రెండో పుస్తకం తయారు చేసే వేళకి నేనే పిడియఫ్. కూడా చేసుకోగల స్థితికి వచ్చేను.

మొత్తంమీద పుస్తకం తయారయింది. ప్రతి స్టెప్పులోనూ క్రియేట్.స్పేస్ వారు  నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ వెంటవెంటనే స్పష్టంగా, వివరంగా జవాబులిస్తూ వచ్చేరు. నిజంగా ఇంత ప్రొఫెషనలిజం చూపిన సంస్థ నాకు తటస్థపడడం ఇదే మొదలు.

నాలుగు రోజులకిందట నా డెస్క్టాపు కూలిపోయింది. నా ఫైళ్లన్నీ తుడిచిపెట్టుకుపోయేయి. అందులో ముఖ్యమైనవి నేను ఈమధ్య పబ్లిష్ చేసిన రెండుపుస్తకాలు. క్రియేట్.స్పేస్ వారిని అడిగితే, ఆ ఫైళ్లు వాళ్లు వెంటనే పంపించారు. ఆఆనందంలోనే ఈటపా రాస్తున్నాను.

 

అలాగే మార్కెటింగు సలహాలు చెప్పమని అడిగితే కూడా చాలా వివరాలతో మంచి సలహాలు ఇచ్చారు. అంచేత కూడా రాస్తున్నాను. మీకు ఎవరికైనా ఉత్సాహం వుంటే క్రియేట్.స్పేస్ ని సంప్రదించి చూడండి.

మార్కెటింగుకి వారిచ్చిన సలహాల్లో ఒకటి ఎమెజాన్ డాట్ కామ్లో పాఠకులచేత రెవ్యూలు రాయించాలి అన్నది. మన పుస్తకసమీక్షలలా పేజీలకి పేజీలు రాయక్కర్లేదు. కాని కొనదలుచుకునేవారికి ఈపుస్తకంలో ఏం వుందో తెలిసేలా వుండాలి.

 

నారెండో పుస్తకం, తెలుగు రచయిత్రుల,మీద  170 జీలు. అందులో ఆనాటి రచయిత్రులు, వెనకటి రచయిత్రులతో పోలిస్తే, ఏవిషయాల్లో ముందంజ వేశారు, వారికి కుటుంబంలోనూ, సమాజంలోనూ పరిస్థితులు ఎలా దోహదం చేసాయి, వారు తీసుకున్న కథాంశాలేమిటి, వార రచనల్లో పాఠకులని ఆకట్టుకున్న విశిష్టాంశాలు ఏమిటి, పాఠకుల స్పందనకీ పండితుల అంచనాలకీ మధ్య గల అంతరం ఎటువంటిది,  … వంటి వివిధ అంశాలు చర్చించాను.

తెలుగు చదవడం రానివారిని దృష్టిలో పెట్టుకుని రాసిన పుస్తకం కనక అందులో విషయ చర్చ తదనుగుణంగానే వుంటుంది.

 

(మా.ని. సెప్టెంపరు 2008. )

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “అచ్చేసుకున్న పుస్తకం – రెండో భాగం.”

 1. మాలతి గారు :

  Just now I sent you an email. Please reply to that email with the files. It’s just Split Images, Merge Text with them and Publish it as a PDF. I think this can be very easily done but we should make sure the quality of the final PDF should be good with no free(share)ware watermarks on the pages.

  మెచ్చుకోండి

 2. @ తెలుగు’వాడి’ని, సరే, గారు ఈజ్ గాన్.
  మీరు ఇంత పబ్లిగ్గా సాయం చేస్తానని మాటిచ్చీసేరు. ఆఅవసరం వెంటనే వచ్చీసింది. ఇతర పాఠకులకు పనికోచ్చే అంశం, ఎమెజాన్ డాట్ కాం. వారు అందిస్తున్న మరో ప్రోగ్రాం అమ్మకాలకి See Inside the Book. ఇక్కడ మనం వాళ్లు కోరినవిధంగా పీడియఫ్ ఫైలు లోడ్ చేస్తే, కొనేవారు పుస్తకంలో కొన్ని భాగాలు చదివే అవకాశం కల్పిస్తారు.
  నాకొచ్చిన బాధ ఏమిటంటే , చెప్పేను కదా నాకంప్యూటరు కూలిపోవడంచేత, క్రి.స్పే.వారిని అడిగాను. వాళ్లు పిడియఫ్ ఫైల్లు పంపేరు, అవి రెండు కవరు పేజీ (back and front on one page) and the second the entire text that should go between the front and the back. That means the page needs to be reformatted into two separate pages and added at the beginning and end of the text file. I am hoping this will be possible with some advanced full version software.
  Can you please do this for me? If you can, I will send you the files with further details. If it is not possible, I understand.

  @ వెటిజన్. లేదండీ. చూస్తాను. థాంక్స్.

  మెచ్చుకోండి

 3. మాలతి గారు :

  1. ముందుగా మీరు నా పేరుకి ‘గారు’ తగిలించకండి, దయచేసి. మీరు స్వతంత్రం తీసుకుని పేరుతో పిలిచినా ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్లు ఇప్పటి వరకు మన తెలుగు బ్లాగ్లోకంలో లేరనే అనుకుంటున్నా. అలా చొర్వవ/స్వతంత్రం తీసుకోకపోవటం అన్నది మీ గొప్ప(మంచి)తనాన్ని సూచిస్తుంది. అందరివరకు కాదు అనుకున్నా, కనీసం నా వరకైనా గారు వద్దండీ ..

  2. Amazon లో review రాయటానికి పుస్తకం కొనవలసిన అవసరం లేదండీ .. Username ఉంటే చాలు .. కొత్తది సృష్టించుకోవటం కూడా చాలా సులభం/ఉచితం. ఇప్పుడే మరొకసారి check చేశాను నేను.

  మెచ్చుకోండి

 4. నిషిగంధ, లేదండీ, వాళ్లు ఏమీ చార్జ్ చెయ్యరు. పుస్తకం అమ్మినప్పుడే వాళ్లకీ మనకీ కూడా డబ్బు కనబడేది. ఎమెజాన్.కాంలో కొనేవాళ్ల కంట మనపుస్తకం పడడానికి రెవ్వూలు మంచి మార్గం అన్నారు. కానీ, పుస్తకం కొన్న తరవాత మాత్రమే రెవ్యూలు పోస్ట్ చెయ్యనిస్తారక్కడ.

  తెలుగు’వాడి’ని గారూ, మీసలహాకి కృతజ్ఞతలు. ఇప్పుడే మారుస్తాను. మీరు అంత ఆదరపూర్వకంగా సాయం చేస్తానంటే ఎలా కాదంటాను. తప్పకుండా తీసుకుంటాను.
  మాలతి.

  మెచ్చుకోండి

 5. 1. మీ thulika web site లో Amazon కి ఉన్న లంకెను ఈ పుస్తకానికి ఉన్న లంకెగా మార్చండి. (CreateSpace ది బాగా నే ఇచ్చారు)

  http://www.amazon.com/Telugu-Writers-1950-1975-Andhra-Pradesh/dp/1438264186

  Telugu Women Writers, 1950-1975, Andhra Pradesh, India: A Unique phenomenon in the history of Telugu Fiction

  2. Books ::: “Malathi Nidadavolu”

  3. Amazon లో reviews ఎంత ముఖ్యమో tags జత చేయటం కూడా అంతే ముఖ్యం … అంటే మన పుస్తకానికి మనమే review రాసుకుంటే అంత బాగోదు అనుకుంటే, ఈ tags మాత్రం ఎవరన్నా జత చేయవచ్చు కనుక వీలుంటే మీరే కొన్ని జతచేయటానికి ప్రయత్నించండి. నిజంగా చాలా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా ఎవరన్నా మీ పేరు మీదో, Telugu అనే పదంతోనో (మొదలగు పదాలతో) వెదుకుతున్నప్పుడు. Amazon లో మీ పుస్తకం Link లోకి వెళ్లిన తరువాత కొంచెం కిందకు వచ్చి చూస్తే Tag this product కనపడుతుంది.

  ఇకపోతే మీకు సాంకేతికపరమైన వాటికి ఎలాంటి సహాయం కావాలన్నా నాకు ఒక Email చేయండి. నేను మీకు సాధ్యమైనంతవరకు వెనువెంటనే సమాధానం ఇస్తాను. దీనిలో మీరు నన్ను ఇబ్బందిపెడుతున్నది ఏమీ లేదు .. మొహమాటపడవలసింది అంతకన్నా లేదు …

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s